ఈ ఒక్క మిషన్ మీ ఇంట్లో ఉంటే రకరకాల ఆయిల్స్ మీరే తయారు చేసుకోవచ్చు

First Published | Nov 8, 2024, 9:59 AM IST

మీరు వంటకు ఏ ఆయిల్ వాడుతున్నారు? ఆ ఆయిల్ నాణ్యమైనదేనా? మీకు తెలుసా? మీ ఆరోగ్య సమస్యలకు కారణం మీరు వాడుతున్న నూనె కూడా అని. మార్కెట్లో కల్తీ ఆయిల్ ఎంత ఎక్కువగా అమ్ముతున్నారంటే ప్రజలకు వస్తున్న అనేక రోగాలకు ఇది కూడా ఒక కారణమని డాక్టర్లు చెబుతున్నారు. మీరు ఈ సమస్య నుంచి బయట పడాలంటే మీకు కావాల్సిన ఆయిల్స్ ని మీరే తయారు చేసుకోవాలి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

మార్కెట్లో కల్తీ ఆయిల్ ఎంత విస్తృతంగా అమ్ముతున్నారంటే ప్రజల ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. కల్తీ నూనెలు తయారుచేసి, అమ్ముతున్న వారిని పోలీసులు పట్టుకున్న సంఘటనల గురించి మీరు వినే ఉంటారు. రోజు ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. కల్తీ ఆయిల్స్ వాడడం వల్లనే అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అసలు ఏది కల్తీ నూనె? ఏది మంచి నూనె తెలుసుకోవడం కష్టంగా మారిపోయింది. 
 

బ్రాండెడ్ కంపెనీలు నాణ్యమైన నూనెలు తయారు చేస్తాయని నమ్మి వాటినే వాడదాం అనుకుంటే బ్రాండెడ్ కంపెనీల పేర్లు ఉపయోగించి కూడా కల్తీ నూనె అమ్మేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన ఆయిల్స్ ని కనిపెట్టడం, వాడడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం మీరే సొంతంగా ఆయిల్ తయారు చేసుకోవడం. 
 


ఈ ఒక్క మిషన్ మీ ఇంట్లో ఉంటే మీరు ఎలాంటి నూనె అయినా తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో ఆయిల్స్ తీసే అనేక రకాల మిషన్లు అందుబాటులో ఉన్నాయి. అవి ఎలాంటి వస్తువుల నుంచైనా సులభంగా ఆయిల్ తీస్తాయి. వీటిని కోల్డ్ ప్రెస్ ఆయిల్ మెషీన్లు అంటారు. ఇలాంటి ఒక్క మిషన్ మీ ఇంట్లో ఉంటే నాణ్యమైన ఆయిల్ మీరే తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ ను ఉపయోగించి వేరుసెనగ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఇలా అనేక రకాల నూనెలు మీరే తయారు చేసుకోవచ్చు. దీని వల్ల నాణ్యమైన నూనె తయారు చేసుకోవడంతో పాటు కల్తీ సమస్య తీరుతుతంది. 
 

ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ మెషిన్లలో చాలా రకాలు ఉంటాయి. మారచెక్కు మెషిన్, కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ మెషిన్, రోటరీ ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ మెషిన్, స్క్రూ టైప్ ఆయిల్ మిల్ మెషిన్‌లు వంటి వివిధ రకాల ఆయిల్ మిల్లులు ఉంటాయి. అయితే వీటిలో చాలా రకాలు కమర్షియల్ గా వినియోగిస్తారు. ఇవి 5 హెచ్‌పీ నుంచి 15 హెచ్‌పీ పవర్ వరకు పనిచేస్తాయి. ఇంట్లోనే కుటుంబ అవసరాలకు సరిపడే మిషన్లు కూడా మార్కెట్ లో ఉన్నాయి. ఆ మిషన్లు ఉపయోగించి మీరు ఇంట్లోనే వేరుశనగ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె లాంటివి తయారు చేసుకోవచ్చు. 
 

మార్కెట్ లో కోల్డ్ ప్రెస్ ఆయిల్ మెషీన్ల ధరలు రూ.25 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. దీని బరువు కూడా పది కేజీలు మించి ఉండదు. ఒక గంటలో 4 నుంచి 8 కేజీల వరకు నూనె తయారు చేయవచ్చు. ఈ ఆయిల్ మెకేంగ్ మెషీన్లు డ్యూయల్ కూలింగ్ సిస్టంతో పనిచేస్తాయి. 

సొంతంగా ఆయిల్ తయారు చేసుకోవడం వల్ల నాణ్యమైన ఆయిల్ తయారవుతుంది. దీన్ని వంటకు ఉపయోగించడం వల్ల గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి. ముఖ్యంగా భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. 
 

Latest Videos

click me!