అంతర్జాతీయ క్రీడాకారులు ధరించే ఆభరణాలపై ఎప్పుడూ ఆసక్తి నెలకొని ఉంటుంది. వారు ఆఢంబరంగా నగలు ధరించకపోయినా.. వేసుకున్న ఒకటిరెండు మీదే దృష్టి నిలుస్తుంది.
అవి వారికి సెంటిమెంటుగానో.. లేదా వారి మార్క్ గానో ప్రసిద్ధి చెందుతాయి. అలాంటి కొంతమంది క్రీడాకారులు వారి ఆభరణాల గురించి ఇప్పుడు చూద్దాం.
మిరాబాయి చాను ఒలింపిక్ చెవిపోగులు... టోక్యో ఒలింపిక్స్ 2020 లో భారతదేశానికి మొదటి పతకాన్ని సాధించిన వెయిట్ లిఫ్టర్ గా మీరాబాయి చాను చరిత్ర సృష్టించింది. 87 కిలోల విభాగం ఆమెకు కేక్ వాక్ అయ్యింది. అలవోకగా ఆ విభాగంలో గెలుపొంది.. 115 కిలోల బరువును ఎత్తి దేశానికి రజతాన్ని సాధించింది.
ఈ సమయంలో మీరాబాయి చాను ధరించిన బంగారు చెవిరింగులు అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఇవి ఒలింపిక్ రింగుల ఆకారంలో ఉండడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. వీటిని మీరాబాయి తల్లి ఐదేళ్ల క్రితం కూతురు కోసం కొనుగోలు చేసిందట.
క్రిస్ ఎవర్ట్ టెన్నిస్ బ్రాస్లెట్ క్రిస్ ఎవర్ట్ ప్రపంచ టెన్నిస్ గొప్ప తారలలో ఒకరు. టెన్నిస్ లో ఏన్నో రికార్డులు ఆమె పేరుమీద ఉన్నాయి. ఆమె చేతికి సన్నటి వజ్రాల బ్రేస్ లెట్ ఉంటుంది. ప్రతీ మ్యాచ్ లోనూ ఆమె చేతికి తప్పనిసరిగా ఇది కనిపిస్తుంది.
1987లో యు.ఎస్. ఓపెన్ సమయంలో బ్రాస్ లెట్ విరిగిపోయింది. దీంతో అది దొరికేవరకు ఆటను ఆపమని క్రిస్ ఎవర్ట్ కోరింది. ఆమెను వజ్రాలతో ఉన్న అనుబంధాన్ని "టెన్నిస్ బ్రాస్లెట్" అని పిలుస్తారు. ప్రస్తుతం ఎవర్ట్ విలువ 16 మిలియన్ డాలర్లు ఉంది. అంటే ఇప్పుడామె చేతినుంచి ఎన్ని వజ్రాల బ్రాస్ లెట్లు పడిపోయినా పెద్దగా పట్టించుకోకపోవచ్చు అని అభిమానులు సరదాగా మాట్లాడుకుంటారు
మైఖేల్ జోర్డాన్ గోల్డ్ చెయిన్ మైఖేల్ జోర్డాన్ అమెరికన్ మాజీ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ఆటగాడు. అతను NBA లో 15 సీజన్లు ఆడాడు. చికాగో బుల్స్‌తో ఆరు ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు. ఆటల సమయంలో మైఖేల్ జోర్డాన్ మెడలో బంగారు గొలుసు తప్పనిసరిగా ఉండేది. అయితే ఎన్ బీఏ లీగ్ ఆటగాళ్లు నగలు ధరించడం వల్ల గాయాల పాలయ్యే అవకాశాలు ఉంటాయని నగలమీద నిషేధం విధించింది. అయినా కూడా జోర్డాన్ తన గోల్డ్ చెయిన వేసుకోవడం మానలేదు. దీనికోసం అతను జరిమానా కూడా భరించేవాడు.
బాస్కెట్ బాల్ తరువాత మైఖేల్ జోర్డాన్ స్లామ్ డంక్ వంటి ఈవెంట్స్ లో కూడా ఇలాంటి బంగారు గొలుసులు ధరించే కనిపించేవాడు. అతను ఇప్పటికీ ఇలాంటి చంకీ బంగారు గొలుసులు ధరించి కనిపిస్తాడు.
సెరెనా విలియమ్స్ డైమండ్ ఇయర్ రింగ్స్ సెరెనా విలియమ్స్ అమెరికన్ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్. మహిళల సింగిల్ టెన్నిస్ విభాగంలో మాజీ ప్రపంచ నంబర్ 1. ఆమె 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలుచుకుంది. డైమండ్ చెవిరింగుల పట్ల ఆమెకున్న ప్రేమ కొత్తేం కాదు. ఎందుకంటే ఆమె తన మ్యాచ్‌లలో డైమండ్ రింగులతో కూడా మెరుపులు మెరిపించేది.
ఆమె ఆడిన చాలా మ్యాచ్‌లలో 13 క్యారెట్స్ డైమండ్ చెవిరింగులు పెట్టుకుంది. కొన్నిసార్లు 13 క్యారెట్ల డైమండ్ స్టడ్‌లతో చేసిన ‘డ్రీమ్-క్యాచర్’ చెవిపోగులు ధరించింది. మొదట్లో సెరెనా 8 క్యారెట్ల ఇయర్ రింగ్స్ పెట్టుకునేది ఆ తరువాత ఒరిజినల్ పెయిర్ కు మారింది.
సచిన్ టెండూల్కర్ వెండి కంకణం క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్.. మైదానంలో తన ఆటతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దులను చేయడమే కాదు.. 90దశకంలో యువతను ఓ స్టైల్ తో కూడా ఆకట్టుకున్నాడు. అదే అతని చేతికి ఉండే వెండి కంకణం. సచిన్ ను అప్పటి యువత బాగా పాలో అయ్యేవారు. ఈ స్టెర్లింగ్ సిల్వర్ బ్రాస్లెట్ ఒక క్లాసిక్. ఇది సచిన్ కు అతని కుటుంబం ఇచ్చిన కానుక.
సచిన్ టెండూల్కర్ వెండి కంకణం క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్.. మైదానంలో తన ఆటతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దులను చేయడమే కాదు.. 90దశకంలో యువతను ఓ స్టైల్ తో కూడా ఆకట్టుకున్నాడు. అదే అతని చేతికి ఉండే వెండి కంకణం. సచిన్ ను అప్పటి యువత బాగా పాలో అయ్యేవారు. ఈ స్టెర్లింగ్ సిల్వర్ బ్రాస్లెట్ ఒక క్లాసిక్. ఇది సచిన్ కు అతని కుటుంబం ఇచ్చిన కానుక.