ఈ హీరోయిన్లకు యోగా అంటే ఎంత ఇష్టమో.. ఒక్క రోజు కూడా మిస్ చేయరు తెలుసా?

First Published | Jun 21, 2024, 10:21 AM IST

యోగా చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే దీని ప్రయోజనాలు చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్లు మాత్రం రెగ్యులర్ గా యోగా చేయకుండా ఉండలేరు. యోగా మన శరీరానికి, మనస్సుకు చేసే ప్రయోజనాలు తెలుసుకాబట్టే చాలా మంది హీరోయిన్లు క్రమం తప్పకుండా యోగా చేస్తుంటారు. సమంత నుంచి కీర్తి సురేష్ వరకు కొంతమంది హీరోయిన్లు రెగ్యులర్ గా యోగా చేస్తుంటారు. ఎందుకో తెలుసా?

ఈ రోజు ఇంటర్ నేషనల్ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. యోగా ప్రాముఖ్యతను ఈ ప్రపంచాన్ని తెలియజేయడానికి, ప్రతి ఒక్కరూ యోగా చేసేలా ప్రోత్సహించడానికి ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. విశ్రాంతి లేని మనుషులకు యోగా చాలా చాలా అవసరం. యోగాను చాలా చిన్న విషయంగా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే ఇది మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఇది మన ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండె జబ్బులొచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 
 

ఊబకాయం, అధిక బరువును , ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించడానికి యోగా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది నిత్యం యోగా చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు నిత్యం యోగా చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. వేరేవాళ్ల సంగతి పక్కన పెడితే హీరోయిన్లు మాత్రం ఫిట్ నెస్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. రెగ్యులర్ వ్యాయామంతో పాటుగా ప్రతిరోజూ యోగా చేస్తుంటారు. యోగా దినోత్సవం సందర్భంగా రెగ్యులర్ గా యోగా చేసే కొంతమంది సౌత్ ఇండియన్ హీరోయిన్లు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 


samantha yoga

సమంత

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో.. టాప్ హీరోయిన్లలో ఒకరు సమంత. ఈ బ్యూటీ ఫిట్ నెస్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గదు. ఎంతటి కష్టమైన వర్కౌట్ అయినా సరే ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం చేస్తుంటుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఈ హీరోయిన్ ఫిట్ నెస్ రొటీన్ లో యోగా కూడా ఉంది తెలుసా. దీనికి సంబంధించి ఫోటోలను ఆమె సోషల్ మీడియా అకౌంట్లలో మనం చూడొచ్చు. సమంత ప్రతిరోజూ వ్యాయామంతో పాటుగా యోగాకు కూడా కొంత సమయాన్ని కేటాయిస్తుంది. ఇది ఆమెను మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
 

రకుల్ ప్రీత్ సింగ్

ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఖాళీ లేకుండా సినిమాల్లో నటించేది. ఇప్పుడు ఈ అమ్మడుకు అవకాశాలు కాస్త తగ్గాయి. కానీ రకుల్ ప్రీత్ సింగ్ తన శరీరాన్ని ఫిట్ గా ఉంచడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటుంది. అలాగే యోగాను కూడా అస్సలు మిస్ చేయదు. ఈ బ్యూటీ చాలా కష్టమైన ఆసనాలను కూడా అలవోకగా వేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలను మీరు ఆమె సోషల్ మీడియాలో చూసే ఉంటారు. 

హన్సిక మోత్వానీ

హన్సిక ఎంత నాజూగ్గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ అమ్మడు బరువు తగ్గడానికి, బరువు పెరగకుండా ఉండటానికి ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంది. అంతేకాదు ఈ బ్యూటీ క్రమం తప్పకుండా యోగా కూడా చేస్తుంది. యోగాతో వల్ల ఈ హీరోయిన్ శరీరాకృతి అందంగా ఉంటుంది. 

Keerthy Suresh

కీర్తి సురేష్

జాతీయ అవార్డు గ్రహీత హీరోయిన్ కీర్తి సురేష్ కు యోగా అంటే చాలా చాలా ఇష్టం. యోగా విషయంలో ఈ బ్యూటీ చాలా సీరియస్ గా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా కీర్తి సురేష్ రెగ్యులర్ గా యోగాను చేస్తుందట. తన యోగాకు సంబంధించిన ఫోటోలను ఈమె తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. 

Latest Videos

click me!