రాముడు నుంచి మనం నేర్చుకోవాల్సిన నాయకత్వ పాఠాలు ఇవి..

First Published | Jan 9, 2024, 11:41 AM IST

రాముడు గొప్ప దేవుడు. ఈ దేవుడు మనకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఈయన నుంచి మనం కొన్ని నాయకత్వ లక్షణాలను అలవర్చుకుంటే.. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతాం. 
 

రాముడు తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాడు. అయినా.. ఏ మాత్రం తలొగ్గకుండా అన్ని సమస్యలను పరిష్కరించి లోకానికి ఆదర్శంగా నిలిచాడు. విష్ణుపురాణంలో రాముడు ఏడవ అవతారంగా భావిస్తారు. అలాగే విష్ణువుకు ఎంతో ఇష్టమైన రూపాల్లో ఇది ఒకటి. రాముడిని పురుషోత్తముడు అని కూడా అంటారు. మర్యాద పురుషోత్తముడు అంటే పురుషులలో గొప్పవాడని అర్థం. ఎందుకంటే రాముడు తన జీవితంలోని అన్ని విధులను ఎంతో పరిపూర్ణంగా నెరవేర్చాడు. మరి మనం రాముడి నుంచి ఎలాంటి నాయకత్వ పాఠాలను నేర్చుకోవాలో ఇప్పడు తెలుసుకుందాం పదండి.
 

నీ ధర్మానికి కట్టుబడి ఉండు

రాముడు తన జీవితం మొత్తం తన ధర్మానికే కట్టుబడి ఉన్నాడు. ఇదే మనకు మంచి ఉదాహరణ. నాయకత్వంలో ఒకరి నైతికత, సూత్రాలకు కట్టుబడి ఉండటం వల్ల అవతలి వారికి మీపై నమ్మకం పెరుగుతుంది. అలాగే మీరు జీవితంలో మంచి విషయాన్ని సాధిస్తారు. ఎలాంటి కిష్టపరిస్థితులు ఎదురైనా.. భయపడరు.
 


కర్తవ్యం, జవాబుదారీతనం

కష్ట సమయాల్లో కూడా రాముడు అపారమైన కర్తవ్య భావాన్ని, జవాబుదారీతనాన్ని కలిగి ఉన్నాడు. ఇదే ఆయన విజయానికి బాటలు వేసింది. ఇది మనందరికీ మంచి ఉదాహరణ. కార్పొరేట్ ప్రపంచం విషయానికొస్తే నాయకులు కూడా వారి నిర్ణయాలకు బాధ్యత వహించాలి. ఇది జట్టు సభ్యుల మధ్య జవాబుదారీతనం సంస్కృతిని సృష్టిస్తుంది.
 

ముందుండి నడిపించండి

రాముడు ఎప్పుడూ కూడా ముందుండే నడిపించేవాడు. నాయకుడిగా.. మీ మాటల కంటే మీ చేతలనే జనాలు ఎక్కువగా నమ్ముతారు. అవే మీ గురించి జనాలకు ఎన్నో విషయాలను చెప్తాయి. మీరు ముందుండి వ్యక్తులను  నడిపించడం వల్ల మీరు వారిని ప్రేరేపించిన వారు అవుతారు. ఇది మిమ్మల్ని జనాలు నమ్మేలా చేస్తుంది. మీ విజయానికి బాటలు వేస్తుంది. 
 

వ్యూహాత్మక నిర్ణయాలు 

రావణుడితో జరిగిన యుద్ధంలో కూడా రాముడు సమస్యలను ఎదుర్కోవడంలో కూల్ గా ఉంటూ.. వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇదే రాముడి విజయానికి కారణం. ఆధునిక కాలంలో నాయకత్వం విషయానికొస్తే ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండటం, వ్యూహాత్మకంగా ఆలోచించడం వల్ల మీరు సంక్లిష్ట పరిస్థితులను నావిగేట్ చేయగలుగుతారు. 
 


స్థితిస్థాపకత

రాముడు ఏకంగా 14 సంవత్సరాల పాటు అజ్ఞాతవాసానికి వెళ్లాడన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ అలాంటి ప్రతికూల సమయాల్లో కూడా రాముడు మానసికంగా బలంగా ఉన్నాడు. మానసికంగా దృఢంగా , స్థితిస్థాపకంగా ఉండటం వల్ల అనిశ్చితులను అధిగమించడానికి, జట్టు ధైర్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అందుకే కష్ట సమయాల్లో క్రుంగిపోకుండా.. మానసికంగా బలంగా ఉండండి. ఇదే మిమ్మల్ని ముందుకు సాగేలా చేస్తుంది. 

ప్రభావవంతమైన, సానుభూతితో కూడిన కమ్యూనికేషన్

రాముడు అందరితో చాలా స్పష్టంగా, దయగా, సానుభూతితో మాట్లాడేవారు. ఇది గొప్ప నాయకత్వ నైపుణ్యం తెలుసా? కార్పొరేట్ ప్రపంచంలో మీరు చెప్పేది చాలా స్పష్టంగా ఉండాలి. ఇది, సమర్థవంతమైన కమ్యూనికేషన్ అపార్థాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే జట్టు సహకారాన్ని బలోపేతం చేస్తుంది. సానుభూతితో ఉండటం వల్ల మీ రు ప్రతి మెంబర్ తో కనెక్ట్ అవుతారు. 


ముఖ్యమైన వాటికి ప్రాధాన్యతనివ్వడం, సమతుల్యం చేయడం

రాముడు తన జీవితంలో ఎన్నో పనులను చాల సులభంగా సమతుల్యం చేయగలిగాడు. అంటే పాలకుడిగా, కొడుకుగా, భర్తగా, సోదరుడిగా.. అన్ని పాత్రలకు తగిన న్యాయం చేశాడు. కాగా కార్పొరేట్ ప్రపంచంలో.. నాయకులు తమ ప్రాధాన్యతలను నిర్వహించడం కూడా నేర్చుకోవచ్చు. దీంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని, పనిని సమతుల్యంగా ఉంచుకోవచ్చు. 
 

Latest Videos

click me!