ఈ ఇంటిచిట్కాలతో టానింగ్ కు టాటా... వారంలోనే మెరిసిపోవచ్చు..

First Published | Jul 5, 2021, 1:23 PM IST

ఎండలో వెడితే చర్మం టానింగ్ అవ్వడం అనేది దాదాపుగా అందరూ ఎదుర్కునే సమస్యే.. దీనికోసం మార్కెట్లో రకరకాల సన్ స్క్రీన్ లోషన్లు, డీ ట్యానింగ్ లోషన్లు దొరుకుతున్నాయి. అయితే ఇవి కాకుండా సహజసిద్ధంగా ఇంట్లోనే ఈజీగా టాన్ తొలగించుకునే సహజ విధానాలు తెలుసుకుంటే ఎంతో సమయం, డబ్బు ఆధా అవుతుంది.

రోజురోజుకూ వాతవరణం విచిత్రంగా మారిపోతోంది. వేసవి ఉందా? లేదా? అన్నట్టుగా ఓ రోజు వర్షం పడడం.. మరోరోజు ఎండకాయడం.. దీంతో అసలు వర్షాకాలమో, ఎండాకాలమో తెలియకుండా పోతోంది. ఇక చర్మ సంరక్షణ విషయానికి వచ్చేసరికి.. టానింగ్, డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ వంటివి ఎక్కువవుతున్నాయి.
undefined
ఎండలో వెడితే చర్మం టానింగ్ అవ్వడం అనేది దాదాపుగా అందరూ ఎదుర్కునే సమస్యే.. దీనికోసం మార్కెట్లో రకరకాల సన్ స్క్రీన్ లోషన్లు, డీ ట్యానింగ్ లోషన్లు దొరుకుతున్నాయి.
undefined

Latest Videos


అయితే ఇవి కాకుండా సహజసిద్ధంగా ఇంట్లోనే ఈజీగా టాన్ తొలగించుకునే సహజ విధానాలు తెలుసుకుంటే ఎంతో సమయం, డబ్బు ఆధా అవుతుంది.
undefined
పెరుగు-తేనె ప్యాక్ : పెరుగు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, అనవసరమైన ధూళిని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. అదేవిధంగా, తేనె చర్మాన్ని శుద్ధి చేసి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఈ రెంటింటి సమ్మేళనం వల్ల తీవ్రమైన సూర్యకిరణాల బారినుంచి మీ చర్మాన్ని కాపాడి.. అందంగా ఉండడానికి సహాయపడుతుంది.
undefined
ఎలా తయారు చేసుకోవాలి? ఎలా వాడాలి? అంటే... 2 టేబుల్ స్పూన్ల పెరుగులో 1 టేబుల్ స్పూన్ తేనె కలపాలి. వీటిన బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మొహానికి అప్లై చేసి.. 15 నిమిషాల తరువాత కడిగేయాలి.
undefined
కలబంద ప్యాక్ : మీ చర్మానికి అద్భుతాలు చేసే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్, అలోవెరా టాన్ తగ్గించడానికి సహాయపడుతుంది. అలోవిరా చర్మాన్ని మృధువుగా చేస్తుంది. నలుపును తగ్గిస్తుంది.
undefined
ఎలా వాడాలి? అంటే... రాత్రి పడుకునేముందు అలోవెరా జెల్ ను ముఖానికి పట్టించి.. అలాగే వదిలేయాలి. తెల్లారి లేచాక కడుక్కుంటే మంచి ఫలితాలు ఉంటాయి. దీన్ని రోజూ చేయడం వల్ల మీరనుకున్న ప్రయోజనాలు పొందగలుగుతారు.
undefined
కొబ్బరి మిల్క్ ప్యాక్ : కొబ్బరి పాలు చర్మానికి మంచి పోషణనిస్తాయి. హైడ్రేట్ చేస్తాయి. దీంట్లోని విటమిన్ సి చర్మం మీది టాన్ తొలగించడంతో అద్భుతంగా పనిచేస్తుంది.
undefined
ఎలా వాడాలి? అంటే... దూదితో కొబ్బరిపాలను మొహనికి పట్టించాలి. పూర్తిగా ఆరిన తరువాత కడిగేయాలి.
undefined
కుంకుమపువ్వు -మిల్క్ ప్యాక్ : సాంప్రదాయ భారతీయ వంటగదుల్లో కనిపించే పదార్ధం కుంకుమ పువ్వు. కుంకుమపువ్వులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇక అందానికి ఇది మరింత మెరుగులు పెడుతుంది. పిగ్మెంటేషన్, మొటిమలు అనేక ఇతర చర్మ సమస్యలకు చికిత్స చేయడంతో పాటు నల్లటి చర్మాన్ని కాంతివంతం చేయడానికి ఇది సహాయపడుతుంది.
undefined
ఎలా వాడాలి? అంటే... కుంకుమపువ్వు, పాలు కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి కాసేపు అలా వదిలేయండి. తరువాత దూదితో మొహానికి అప్లై చేసి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.
undefined
గంధం-పసుపు ప్యాక్ : చందనం మృదువైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని మృధువుగా చేయడంతోపాటు దెబ్బతిన్న చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. పసుపుతో కలిపి టాన్ ను ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, తొలగించడానికి సహాయపడుతుంది.
undefined
ఎలా వాడాలి? అంటే... పసుపు, గంధపు పొడిలను పాలలో కలపండి. దీన్ని ముఖానికి ప్యాక్‌గా వేయండి. ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. అయితే కడిగిన వెంటనే మాయిశ్చరైజర్‌ను రాయడం మరిచిపోవద్దు.
undefined
click me!