
అమ్మాయిలు.. అబ్బాయిలు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ మొటిమలు (Acne) అవుతుంటాయి. చెడు ఆహారపు అలవాట్లు (Bad eating habits), వేడి వంటి వివిధ కారణాల వల్ల ముఖంపై మొటిమలు అవుతుంటాయి. మొటిమలు అందాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు వీటివల్ల ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. అయితే మొటిమలను తగ్గించేందుకు కొన్ని చిట్కాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే..
మొటిమలను గిల్లకండి: ముఖంపై మొటిమలు ఉన్న చాలా మంది తమ చేతులను ఎప్పుడూ మొటిమల మీదే ఉంచుతారు. ఎప్పుడూ వాటిని తడుతూ.. గిచ్చుతుంటారు. అవి తగ్గాలని అలా చేస్తుంటారు. కానీ ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. మొటిమలను గిచ్చడం వల్ల మొటిమల మరక ముఖంపై అలాగే ఉంటుంది. అలాగే నొప్పి కూడా పెడుతుంది. అందుకే వీలైనంత వరకు మొటిమలను టచ్ చేయకండి.
పుష్కలంగా నీళ్లను తాగండి: చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు (Water)తాగడం చాలా ముఖ్యం. మీ ముఖంపై మొటిమలు ఉంటే తగినంత నీరు తాగడం ప్రారంభించండి. దీని వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు వస్తాయి. దీంతో పాటు ముఖంలో మెరుపు కూడా కనిపిస్తుంది.
వ్యాయామం తర్వాత ముఖం తుడుచుకోండి: చాలా మంది వర్కౌట్ (Workout)చేసిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోరు.. అయితే ఇలా చేయకూడదు. వర్కవుట్ తర్వాత ముఖాన్ని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ముఖం మీద చెమటను ఖచ్చితంగా తుడుచుకోవాలి. ముఖాన్ని తుడుచుకోవడానికి మెత్తని టవల్ ను ఉపయోగించండి.
ముఖాన్ని రోజుకు రెండుసార్లు కడగాలి: మొటిమలను వదిలించుకోవడానికి ముఖ ప్రక్షాళన (Facial cleansing)కూడా చాలా ముఖ్యం. దీని కోసం మీరు తప్పనిసరిగా రోజుకు రెండుసార్లు ముఖాన్ని కడగాలి. ఉదయం నిద్ర లేవగానే ముఖాన్ని కడగాలి. అలాగే రాత్రి పడుకునేటప్పుడు కూడా తప్పనిసరిగా ముఖాన్ని కడుక్కోవాలి. దీనివల్ల ముఖం పై పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది.
అయితే మొటిమలు వచ్చే అవకాశం ఉన్న చర్మం ఉంటే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి. ఎందుకంటే దీనిలో ఆయిల్, ప్రాసెస్ చేయబడ్డ కార్బోహైడ్రేట్ లు మరియు క్యాలరీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మొటిమలను మరింత పెంచుతాయి.
అలాగే బెర్రీలు (Berries): బ్లాక్ బెర్రీస్ వంటి డార్క్ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.
బ్రోకలీ (Broccoli): బ్రోకలీలో విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, సి, ఇ, మరియు కె , ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలతో పోరాడే సామర్థ్యంతో సహా మన చర్మానికి వివిధ మార్గాల్లో సహాయపడతాయి.