శృంగారంలో రెచ్చిపోవాలంటే, ఇవి తినాల్సిందే....

First Published Jul 17, 2020, 11:33 AM IST

పని ఒత్తిడి వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల శరీరం బలహీనపడి విశ్రాంతిని కోరుకుంటూ శృంగారానికి దూరమయ్యే పరిస్థితులు చుట్టుముట్టుడుతున్నాయి. మధ్య వయస్సు వచ్చేసరికి శృంగార వాంఛ తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. అయితే, సరైన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవచ్చునని నిపుణులు అంటున్నారు. 
 

గతంలో పెళ్లికి ముందు భార్యాభర్తల మధ్య పెద్దగా పరిచయం ఉండేది కాదు. శోభనం రోజు మాత్రమే వారిద్దరు సన్నిహితంగా వచ్చేవారు. అదే వారు ఒకరినొకరు తెలుసుకోవడానికి తగిన సందర్భంగా ఉండేది. ఇరువురు కూడా ఒకరినొకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ కలిసి ఉండే సమయాన్ని పొడగించుకునేవారు.
undefined
ఇప్పుడు పరిస్థితి అలా లేదు. యువత చాలా ఫాస్ట్ అయింది. పెళ్లికి ముందే ఇద్దరు కలిసి తిరుగుతూ సాన్నిహిత్యాన్ని పెంచుకుంటున్నారు. పెద్దల ముందు కలిసి ఉండడానికి సిగ్గుపడే రోజులు పోయాయి. శృంగారం విషయంలో కూడా చాలా వరకు మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు.
undefined
వయస్సు పెరిగే కొద్దీ పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గుతుందని అంటున్నారు. పని ఒత్తిడి వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల శరీరం బలహీనపడి విశ్రాంతిని కోరుకుంటూ శృంగారానికి దూరమయ్యే పరిస్థితులు చుట్టుముట్టుడుతున్నాయి. మధ్య వయస్సు వచ్చేసరికి శృంగార వాంఛ తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. అయితే, సరైన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవచ్చునని నిపుణులు అంటున్నారు.
undefined
అనవసరమైనవన్నీ తినడానికి బదులు ఎంపిక చేసుకుని కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చునని చెబుతున్నారు. అటువంటి ఆహార పదార్థాలను, పండ్లను పరిశీలిద్దాం.
undefined
అరటి పండులో బ్రోమోలైన్ ఎంజైమ్ ఉంటుంది. అది కామవాంఛను ప్రేరేపించే టెస్టోస్టిరోన్ ను పెంచుతుందని చెబుతున్నారు. అది ఎంతో శక్తినిస్తుందని, పురుషుల రతి సామర్థ్యాన్ని అరటిపండు పెంచుతుందని నిపుణులు చెప్పారు. ఇందులో ఉండే పోటాషియం, విటమిన్ బీని ఇచ్చే రిబోఫ్లావిన్ వంటివి రతి సామర్థ్యాన్ని పెంచుతాయని చెబుతున్నారు.
undefined
మునగ కాడలు కూడా శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయని అంటున్నారు. ఇవి కూడా టెస్టోస్టిరోన్ స్థాయిని పెంచుతాయట. విటమిన్ ఈ కూడా ఉంటుందని, ఇది సెక్స్ హార్మోన్లను ప్రభావితం చేసి రతి సామర్థ్యాన్ని పెంచుతుందని చెబుతున్నారు. ములగ కాడలు స్త్రీపురుషులు ఇరువురిలోనూ సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుందని చెప్పారు. చారు, పుసులు, సాంబార్ వంటి వాటిలో ఉండే ములగ కాడలను ఆసక్తిగా ఆరగించడం ఇప్పటికీ ఉంది.
undefined
అంజీర లేదా అత్తిపండులో కూడా శృంగార సామర్థ్యాన్ని పెంచే గుణాలు ఉన్నాయని చెబుతున్నారు. అత్తిపండులో ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. తులసి ఆకుల రసాన్ని వేడినీటిలో కలిపి తాగితే మహిళల్లో కామవాంఛ బుసలు కొడుతుందని చెబుతున్నారు. దానికితోడు జననాంగ వ్యవస్థను అది శుద్ధి చేస్తుందని, దానివల్ల సంతానోత్పత్రి కలుగుతుందని అంటున్నారు.
undefined
click me!