బనానా షేక్ ను తాగే అలవాటుందా? అయితే మీరు ఈ విషయాలను పక్కాగా తెలుసుకోవాల్సిందే

First Published | Nov 6, 2022, 2:51 PM IST

ఆరోగ్యానికి మంచిదని బనానా షేక్ ను రోజూ తాగేవారు చాలా మందే ఉన్నారు. కానీ దీన్ని రోజూ తాగడం ఆరోగ్యానిక అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..? 
 

బనానా షేక్ కు డిమాండ్ ఎక్కువ. ముఖ్యంగా దీన్ని పిల్లలు ఎక్కువగా తాగుతుంటారు. ఈ పానీయాన్ని ఎక్కువగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో లేదా సాక్స్ టైంలో తాగుతుంటారు.  నిజానికి దీనిలో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అరటిపండ్లు, పాల కాంబినేషన్ తో చేసిన ఈ పానీయం  ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ రెండింటిలో పోషకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఈ రెండింటినీ కలపడం మంచిది కాదంటున్నారు. ఈ రెండు పండ్లలో ఒకేరకమైన పోషకాలు లేనప్పటికీ.. ఈ రెండు పోషక లోపాలను భర్తీ చేస్తాయి. అందుకే దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో సాయంత్రం స్నాక్స్ లో తీసుకుంటారు. కానీ దీన్ని రోజూ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే..? 
 

బరువు పెరగొచ్చు

అరటిపండ్లలో ఎక్కువ మొత్తంలో షుగర్ కంటెంట్ ఉంటుంది. ఇది మీరు బరువు పెరిగేలా చేస్తుంది. ఇక దీన్ని మీరు మిల్క్ షేక్ రూపంలో తీసుకోవాలనుకుంటే మీ నడుం సైజ్ పక్కాగా పెరుతుంది. అధిక బరువుతో బాధపడేవారు ఈ బనానా మిల్క్ షేక్ ను తాగకపోవడమే మంచిది. ఒకవేళ తాగితే మీ శరీర బరువు మరింత పెరుగుతుంది. 
 

Latest Videos


బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి

అరటిపండ్లను తిన్నా లేదా బనానా మిల్క్ షేన్ ను తీసుకున్నా.. మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ఖాయం అంటున్నారు నిపుణులు. అందుకే వీటిని మోతాదులోనే తీసుకోవాలి. తక్కువ జీఐ స్థాయిలు ఉండి.. మొత్తం పూర్తిగా పండిన పండ్లను కాకుండా.. కొంచెమే పండిన అరటిపండ్లనే తినండి. ఎందుకంటే ఈ పండులో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. 
 

Constipation

మలబద్దకం సమస్య వస్తుంది

అరటిపండ్లలో ఎక్కువ మొత్తంలో టానిక్ ఆమ్లం ఉంటుంది. ఈ రసాయనం తక్కువ మొత్తంలో తీసుకుంటే వచ్చే నష్టమేమీ లేదు. కానీ ఎక్కువ అరటిపండ్లను తిని.. మన శరీరంలో ఈ టానిక్ ఆమ్లం ఎక్కువైతే మాత్రం మలబదద్దకం సమస్య వస్తుంది. రెగ్యులర్ గా బనానా షేక్ తాగితే మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.  కాబట్టి దీన్ని మోతాదులోనే తీసుకోండి. 
 

మైగ్రేన్ రావొచ్చు

కొన్ని రసాయనాలు, పోషకాలు మైగ్రేన్ నొప్పికి కారణమవుతాయి. అరటిపండల్లో కూడా ఇలాంటి రసాయనాలు, పోషకాలు ఉన్నాయి. అరటిలో టైరమిన్ అనే రసాయనం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మైగ్రేన్ నొప్పికి దారితీస్తుందని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి కూడా. అందుకే మైగ్రేన్ సమస్య ఉన్నవాళ్లు దీనికి దూరంగా ఉండటమే మంచిది. 

click me!