శ్రావణ మాసంలో.. పెద్దలు ఈ పనులు చేయొద్దంటరు..

First Published | Jul 13, 2024, 9:56 AM IST

శ్రావణ మాసం 04: మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో భక్తులంతా ప్రతిరోజూ పరమ శివుడిని భక్తి, శ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఈ పవిత్ర మాసంలో కొన్ని పనులు చేయొద్దని పెద్దలు చెప్తారు. అవేంటంటే... 
 

ఏడాది శ్రావణ మాసం జులై 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మాసం పరమేశ్వరుడికి అంకితం చేయబడింది. అయితే ఈ మాసం కేవలం పూజలకే కాకుండా.. ఆరోగ్య పరంగా కూడా చాలా ప్రత్యేకమైందంటారు నిపుణులు. శ్రావణ మాసం వర్షాలు, రుతుపవనాలతో కూడి ఉంటుంది. దీనివల్ల మనకు లేనిపోని వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. అందుకే ఈ మాసంలో తినే ఆహారం, జీవనశైలి గురించి జాగ్రత్తగా ఉండాలి. కానీ శ్రావణ మాసం పౌరాణిక నమ్మకాలతో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే ఈ మాసంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలని పెద్దలు చెప్తుంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

sawan 2024


గోర్లు కట్ చేయడం నిషిద్ధం: శ్రావణ మాసంలో గోర్లు కట్ చేయకూడదని పెద్దలు చెప్పిన మాట మీకు గుర్తే ఉంటుంది. అయితే చాలా మంది దీనికి ఏమౌతుందని పెద్దల మాట పక్కన పెట్టేస్తుంటారు. కానీ దీనికి ఒక లాజిక్ ఉంది. వర్షంలో బ్యాక్టీరియా ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతుంది. పాదాల గోర్లు చిన్నగా కట్ చేస్తే అందులో ఫంగస్ పెరుగుతుంది. అందుకే ఇలాంటి బ్యాక్టీరియా పెరగకూడదని ఈ మాసంలో గోర్లను కట్ చేయకూడదని పెద్దలు చెప్తారు. 


ప్రతిరోజూ స్నానం:   శ్రావణ మాసంలో ప్రతిరోజూ స్నానం చేసి పరమేశ్వరుడిని పూజించాలని పెద్దలు చెప్తుంటారు. పూజకోసమే కాకుండా.. ఈ స్నానం మనకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది తెలుసా? ఈ ఆచారం వెనకున్న శాస్త్రీయ కారణం ఏంటంటే? ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల తేమ, చెమట వల్ల మన శరీరంపై బ్యాక్టీరియా పెరుగుతుంది. రోజూ స్నానం చేస్తే ఈ సమస్య ఉండదు. 
 

నీట్ గా దుస్తులు:  వర్షాకాలంలో బట్టలు తడిసిపోవడం, మురికిగా అవడం చాలా కామన్ . కానీ శ్రావణ మాసంలో నీట్ గా రోజూ దుస్తులను ధరించాలని చెప్తారు. ఇది కేవలం ఆరాధనకే కాకుండా.. తడి, మురికి దుస్తులు శరీరానికి అంటువ్యాధులు, బ్యాక్టీరియాను వ్యాప్తి  చేస్తాయి. దీంతో మీరు తొందరగా అనారోగ్యానికి గురవుతారు. అదే మీరు రోజూ స్నానం చేసి శుభ్రమైన దుస్తులను వేసుకుంటే ఈ సమస్య రాదు. అందుకే శ్రావణ మాసంలో శుభ్రమైన దుస్తులు ధరించి పూజించమని పెద్దలు చెప్తారు. 
 

శరీరంపై నూనె పూయడం:  శ్రావణ మాసంలో శరీరానికి నూనె పెట్టకూడదని పెద్దలు చెప్తుంటారు. ఇది పౌరాణిక విశ్వాసాలతో ముడిపడి ఉంది. కానీ శాస్త్రీయ కారణం మాత్రం.. శరీరానికి నూనెను పెట్టడం వల్ల శరీరంలో తేమ, బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. దీని వల్ల శరీరం అనారోగ్యానికి గురవుతుంది. అందుకే ఈ మాసంలో శరీరానికి నూనె పెట్టకూడదని చెప్తారు. 
 

Leafy vegetables

ఆకుకూరలు, మాంసం తినడం నిషిద్ధం:  ఈ పవిత్ర మాసంలో.. ఆకు కూరలు, మాంసం, చేపలను తినడం నిషిద్ధం. దీనికి కారణం ఈ ఆహార పదార్థాలపై బ్యాక్టీరియా ఫాస్ట్ గా పెరుగుతుంది. దీనివల్ల రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే తినకూడదంటారు. 

brinjal


వంకాయ, పెరుగు తినడం నిషిద్ధం:  అలాగే శ్రావణ మాసంలో వంకాయ, పెరుగు వంటి ఆహారాలను తినడం కూడా నిషిద్ధం. ఎందుకంటే వంకాయల్లో వర్షాకాలంలో కీటకాలు వేగంగా వృద్ధి చెందుతాయి. అలాగే పుల్లని, పాత పెరుగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే దీన్ని తినకూడదంటారు. 

Latest Videos

click me!