దేవుడికి దండం పెట్టేటప్పుడు కళ్లు మూయాలా? వద్దా?

First Published | Aug 11, 2024, 10:41 AM IST

భక్తులు తరచూ ఆలయాలకు వెళ్లి దేవుళ్లకు రకరకాల పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. అలా దండం పెట్టి మొక్కుతున్నప్పడు ఎక్కువ శాతం మంది కళ్లు మూసుకుంటారు. అసలు గుడిలో దేవతా విగ్రహాలకు దండం పెట్టేటప్పుడు ఏం చేయాలి. హిందూ ధర్మం, వేదపండితులు, సైన్సు చెబుతున్న వివరాలు ఇప్పడు తెలుసుకుందాం..

భక్తులు తరచూ ఆలయాలకు వెళ్లి దేవుళ్లకు రకరకాల పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. అలా దండం పెట్టి మొక్కుతున్నప్పడు ఎక్కువ శాతం మంది కళ్లు మూసుకుంటారు. అసలు గుడిలో దేవతా విగ్రహాలకు దండం పెట్టేటప్పుడు ఏం చేయాలి. హిందూ ధర్మం, వేదపండితులు, సైన్సు చెబుతున్న వివరాలు ఇప్పడు తెలుసుకుందాం..

ఈ సృష్టిని నడిపిస్తున్నది భగవంతుడని అంతా నమ్ముతారు.  వేర్వేరు మతాల్లో వివిధ పద్ధతుల్లో పూజలు, ప్రార్థనలు చేస్తారు. కొన్ని మతాల వారు దేవుడు ఒక్కడే అంటారు. అయితే హిందూ ధర్మంలో మాత్రం అనేక రూపాల్లో కొలుస్తారు. దేవతలకు  ప్రతీకగా ఆలయాల్లో విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేస్తారు.  చాలా మంది పండగలు, ప్రత్యేక రోజుల్లో దేవాలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. అలా దండం పెట్టి మొక్కుతున్నప్పడు ఎక్కువ శాతం మంది కళ్లు మూసుకుంటారు.

Latest Videos


హిందూ ధర్మం ఏం చెబుతోంది..

ప్రజల్లో భక్తి భావం పెరగాలన్న కారణంగా దేవాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు హిందూ ధర్మంలో ఉంది. నిత్య జీవితంలో ప్రజలు తమకు ఉన్న ఒత్తిడుల నుంచి కాస్త రిలాక్స్‌ అవడానికి ప్రతి రోజు వారి ఇళ్లకు సమీపంలో ఉన్న ఏ గుడికైనావెళ్లి కొంత సమయం గడిపిరావాలని హింధూ ధర్మంలో ఉంది. గుడికి వెళ్లినప్పుడు ఆ దేవతా విగ్రహాలను అలా చూస్తూ ఉండటం వల్ల మనలోని ఎనర్జీ రీఫ్రెష్‌ అవుతుందని హిందూ ధర్మం చెబుతోంది. 

వేద పండితులు ఏమంటున్నారంటే..

ఆలయాలు నిర్మించేటప్పడు, దేవతా విగ్రహాలు ప్రతిష్ఠించేటప్పడు మూల మంత్రాలు పఠించి, ప్రత్యేక యంత్రాలు పెట్టి ప్రతిష్ఠం చేస్తారు. దీని వల్ల ఆలయాల్లో విగ్రహాలు ప్రత్యేక శక్తిని పొందుతాయి. అలాంటి దేవతా విగ్రహాలను దర్శించినప్పుడు కచ్చితంగా కళ్లు తెరిచే దర్శించాలని వేద పండితులు చెబుతున్నారు. పూలు, పూలమాలు, వివిధ రకాల అలంకారాలతో ఉన్న విగ్రహాలను కనులారా దర్శించడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుందని చెబుతున్నారు.  

ఇదీ సైంటిఫిక్‌ రీజన్‌..

మానవ శరీరం అనేక నాడులు, గ్రంధులతో నిర్మించింది. మనసు ప్రశాంతంగా మారాలంటే ప్రధానంగా సెరోటొనిన్, ఎండార్ఫిన్ అనే రెండు రకాల హార్మోన్లు విడుదల కావాలి. సెరోటొనిన్ మెదడులోని పైనీయల్ గ్రంధి(Pineal gland) నుంచి వెలువడుతుంది. ఇది మంచి మానసిక స్థితిని, సంతోషాన్ని కలిగిస్తుంది. ఎండార్ఫిన్ పిట్యూయిటరీ గ్రంధి (Pituitary gland) , హైపోతాలామస్ (Hypothalamus) నుంచి విడుదల అవుతుంది. ఇవి ఒత్తిడిని తగ్గించి, ఆనందం ప్రశాంతత కలిగిస్తాయి. గుడికి వెళ్లి కనులారా దేవతా విగ్రహాలను దర్శించినప్పుడు శరీరంలోని పైనీయల్,  పిట్యూయిటరీ గ్రంధులు యాక్టివేట్‌ అవుతాయి. అందువల్ల మనసు, శరీరం రిలాక్స్‌ అవుతాయి. 

click me!