ఈజీ గా 100 ఏండ్లు బతికేస్తారు.. ఇలా చేశారంటే..

First Published | Aug 20, 2024, 10:26 AM IST

నిండు నూరేండ్లు బతుకు బిడ్డా అని పెద్ధలు ఆశీర్వదిస్తుంటారు. కానీ ఈ మాట కేవలం ఆశీర్వపదంగానే మిగిలిపోయింది. అవును మరి ఈ మధ్యకాలంలో నూరేండ్లు బతకడమంటే మాటలు కావు. ఒకప్పుడైతే ఎలాంటి రోగాలు, నొప్పి లేకుండా నూరేండ్లేంది 120 ఏండ్లు కూడా బతికేవారు. 
 

long life

పెద్దల ఆశీర్వాదం తీసుకున్నప్పుడు వారి నోటి నుంచి వచ్చే కామన్ పదం.. ‘నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో బతుకు’ అని. ఒకప్పుడు అయితే ఈ ఆశీర్వపదం పదం నిజమయ్యేది. వంద ఏండ్లేంది, 120,130 ఏండ్లు బతికిన వారు కూడా ఉన్నారు. కానీ అప్పట్లో. ఇప్పుడు మహా అయితే 60 ఏండ్లు బతకడమే ఎక్కువ అని ఫీలవుతున్నారు. ఇది పరిశోధకులు కూడా చెప్పారు. అందులోనూ 20, 30 ఏండ్ల నుంచే లేనిపోని రోగాలతో బాధపడుతున్నారు. 


అయితే పలు పరిశోధనల ప్రకారం.. నూరేంట్లు దాటిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోందట. అవును 2000 సంవత్సరం నుంచి ప్రచురించబడిన 34 పరిశీలనా అధ్యయనాల సమీక్ష ప్రకారం.. 100 ఏండ్లు దాటిన వారు 2050 నాటికి 3.5 మిలియన్లకు పెరుగుతారని అంచనా వేయబడింది.  సైంటిఫిక్ జర్నల్ జెరోసైన్స్ లో ప్రచురించిన అధ్యయనం.. వృద్ధులు ఆరోగ్యంగా ఉండానికి హెల్తీ ఫుడ్, బరువు నిర్వాహణ వారు ఎక్కువ కాలం బతకడానికి కీలక పాత్ర పోషిస్తున్నాయని అధ్యయనం కనుగొంది. ఈ అధ్యయనం ప్రకారం.. నాలుగు పనులు చేస్తే ఈజీగా వందేంట్లు బతికేయొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


ఆహారం, పోషణ

మనకు వ్యాధులు రాకుండా, ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకడంలో మనం తినే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఇదే విషయాన్ని అధ్యయనం కూడా వెల్లడించింది. ఎక్కువ కాలం బతకాలంటే హెల్తీ ఫుడ్ ను తీసుకుంటూ ఉప్పును చాలా వరకు తగ్గించాలని అధ్యయనం నొక్కి చెబుతోంది. మధ్యధరా ఆహారం వంటి హెల్తీ ఫుడ్, పాలు, ధాన్యాలతో పాటుగా వివిధ రకాల ఆహారాన్ని తింటే ఆరోగ్యంగా నూరేండ్లు బతుకుతారని అధ్యయనం వెల్లడిస్తోంది. 

అయితే పొగాకు, స్మోకింగ్ వల్ల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. మీరు ఆరోగ్యంగా బతకాలంటే మాత్రం వీటికి దూరంగా ఉండాలని అధ్యయనం చెబుతోంది. ఎందుకంటే స్మోకింగ్ అకాల మరణ ప్రమాదాన్ని పెంచుతుంది. దీన్ని మానేస్తే ప్రమాదం తగ్గుతుంది. స్మోకింగ్ శారీరక, మానసిక ఆరోగ్యంగానికి చాలా డేంజర్. 
 


సంతృప్తికరమైన నిద్ర

ఎక్కువ కాలం బతకడంలో నిద్ర కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పలు అధ్యయనాల్లో నిద్రలేమి ఉన్నవారితో పోలిస్తే బాగా నిద్రపోయేవారు మంచి ఆరోగ్యంతో ఆరు సంవత్సరాలు, 50,  75 సంవత్సరాల మధ్య దీర్ఘకాలిక వ్యాధులు లేకుండా మరో మూడు సంవత్సరాలు జీవిస్తారని అంచనా వేయబడింది. సంతృప్తికరమైన నిద్ర వృత్తిపరమైన ఒత్తిడిని, జీవక్రియ సిండ్రోమ్ లేదా బిఎమ్ఐ మధ్య సంబంధాన్ని మాడ్యులేట్ చేస్తుందని కనుగొన్నారు. అయితే ఎక్కువ నిద్ర లేదా తక్కువ నిద్ర వ్యవధి రెండూ మరణానికి దారితీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. రోజు 8 నుంచి 9 గంటలు బాగా నిద్రపోతే మీరు నూరేండ్లు బతికే అవకాశముందని పరిశోదకులు చెబుతున్నారు. 
 

తక్కువ మందులు

చాలా మంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా మందులను విచ్చలవిడిగా వాడుతుంటారు. ముఖ్యంగా ఎలాంటి  ప్రిస్క్రిప్షన్ లేకుండా. కానీ ఈ అలవాటు మీ ఆయుష్షును తగ్గిస్తుంది. 75, అంతకంటే ఎక్కువ వయస్సున్నవారు లేదా నర్సింగ్ సౌకర్యాలలో నివసించే వారు మందులను బాగా తీసుకుంటున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. సగటున సెంటినరీలు 4.6 మందులు తీసుకుంటున్నారు. ఎపిక్రాన్ అధ్యయనం ప్రకారం.. 80, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు 6.7 మందులు తీసుకుంటున్నారు. ఈ తక్కువ మందులను వాడే అలవాటు శతాబ్దాలలో  ఉండేది. ఏదేమైనా వృద్ధులు తక్కువ మందులను తీసుకుంటే ఎక్కువ కాలం బతికే అవకాశం ఉందని అధ్యయనం చెబుతోంది. 


జీవన పరిస్థితులు

పట్టణాలలో కంటే గ్రామీణ ప్రాంతాలలో ఉండేవారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో 75% కంటే ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. గ్రామీణ జీవనశైలి దీర్ఘకాలిక ఆరోగ్యం, దీర్ఘాయువుకు గణనీయంగా దోహదం చేస్తుందని సూచిస్తుంది. గ్రామీణ జీవనశైలిని ప్రోత్సహించడానికి పచ్చని ప్రదేశాలు, చెట్ల పందిరి, పబ్లిక్ పార్కులను పెంచడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందని, మరణ ప్రమాదం తగ్గుతుందని అధ్యయనం పేర్కొంది.

Latest Videos

click me!