ఇదొక్కటి వేసి కలిపితే... రోటీలు మెత్తగా వస్తాయి తెలుసా?

First Published | Jul 2, 2024, 11:34 AM IST

పిండి కలిపే  సమయంలో కేవలం ఒక పదార్థాన్ని అదనంగా కలపడం వల్ల.. చపాతీలు మెత్తగా.. రెండు వేళ్లతో తుంచుకునేలా ఉంటాయి అని నిపుణులు చెబుతున్నారు.

రోటీ, చపాతీలను  చాలా మంది తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవాళ్లు రెగ్యులర్ గా రోటీని తినడానికి ఇష్టపడతారు. అయితే.. చాలా మంది రోటీలతో వచ్చిన సమస్య ఏమిటంటే.. చేసిన కాసేపటికే గట్టిగా మారిపోతాయి. పిండి ఎంత మంచిగా కలిపినా కూడా రోటీలు మెత్తగా రావడం లేదు అని చాలా మంది ఫీలౌతూ ఉటారు. 

atta dough

అయితే.. పిండి కలిపే  సమయంలో కేవలం ఒక పదార్థాన్ని అదనంగా కలపడం వల్ల.. చపాతీలు మెత్తగా.. రెండు వేళ్లతో తుంచుకునేలా ఉంటాయి అని నిపుణులు చెబుతున్నారు. అదేంతో.. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


atta dough

రోటీలు చేయడానికి మీరు ముందుగా పిండి కలుపుకుంటారు కదా.. పిండి కలిపే సమయంలో.. నీళ్లు పోయడానికి ముందే.. అందులో కాస్త ఉప్పు వేయండి.  ఉప్పు పిండిలో కలిపి.. ఆ తర్వాత నీటితో పిండిని ముద్దలాగా కలుపుకోవాలి.  ఇలా చేయడం వల్ల..  పిండి కూడా చాలా మృదువుగా ఉంటుంది. దానితో.. రోటీ చేసినా కూడా ఎక్కువ సమయం రోటీలు మెత్తగా ఉంటాయి. అంతేకాదు.. పిండి కలపడానికి వాడే నీరు కూడా చల్లటివి కాకుండా.. కాస్త గోరు వెచ్చని నీరు తీసుకోవాలి.  అప్పుడు రోటీలు మీరు కోరుకున్నట్లుగా మెత్తగా , మృదువుగా వస్తాయి.

ఇక... పిండిని కలిపే సమయంలో.. ముందుగా.. కేవలం చేతి వేళ్లతో మాత్రమే కలపాలి. అరచేతితో పిసకకూడదు. పిండి.. ముద్దగా మారిన తర్వాత.. అర చేతితో మంచిగా వత్తాలి.మెత్తగా పిండి చేస్తున్నప్పుడు పిండి పగుళ్లు రావడం ప్రారంభించినప్పుడు, ఆటోను తడి గుడ్డతో కప్పి 5-10 నిమిషాలు అలాగే ఉంచండి.
పది నుండి పదిహేను నిమిషాల తర్వాత, పిండి నుండి రోటీలను తయారు చేసి వాటిని వేడిగా వడ్డించండి; అందరూ మీ మృదువైన మరియు మెత్తటి రోటీలను ప్రశంసిస్తారు.

పిండిలో ఉప్పు వేయడంతో పాటు.. కలిపే విధానంలో పైన చెప్పిన చిట్కాలు ఫాలో అయితే.. మీరు కోరుకున్నట్లు రోటీలు మెత్తగా వస్తాయి.
పిండిలో ఉప్పు కలపడం వల్ల మెత్తగా మెత్తగా ఉంటుంది. పిండిలో ఉప్పు కలపడం వల్ల రుచి పెరగడమే కాకుండా తక్కువ రక్తపోటుతో బాధపడేవారికి కూడా మేలు చేస్తుంది.

Latest Videos

click me!