Milk
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో పాలు ఒకటి. పాలలో అనేక పోషలకాలుంటాయి... కాబట్టి వాటిని ప్రతిరోజూ తీసుకుంటాం. పాలు లేదంటే పాలతో కూడిన టీ, కాఫీ వంటివి తాగనిదే కొందరికి తెల్లారదు... ఇంకొందరికి రాత్రి పాలు తాగకుంటే నిద్రపట్టదు. ఇక రోజంతా తాగే టీ, కాఫీలకు లెక్కుండదు. ముఖ్యంగా చిన్నపిల్లలు, ముసలివాళ్లకు ఇష్టం లేకున్నా బలవంతంగా అయినా పాలు తాగిస్తుంటారు కుటుంబసభ్యులు. ఎందుకంటే పాలలోని కాల్షియంతో పాటు ఇతర పోషకాలు, విటమిన్స్ వారికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. కాబట్టే ప్రతి ఒక్కరు మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తప్పుకుండా పాలు తాగుతారు.
Sesame
అయితే పాలలో కంటే పోషకాలు, విటమిన్లు అధికంగా వుండే పదార్థాలు కొన్ని వున్నాయి. అయితే పాలలోని అన్ని పోషకాలను నువ్వులు కూడా మన శరీరానికి అందిస్తాయి. ఇంకా చెప్పాలంటే పాలకంటే నువ్వులే ఎక్కువశాతం పోషకాలును కలిగివుంటాయి.
Sesame
100 గ్రాముల నువ్వుల్లో, 100 మిల్లీ లీటర్ల పాలలోని పోషకాలను పరిశీలిస్తే నువ్వుల్లోనే అన్నీ ఎక్కువగా వున్నాయి. 100 గ్రాముల నువ్వుల్లో 573 కేలరీలు, 17 గ్రాముల ప్రోటీన్లు , 50 గ్రాముల కొవ్వులు, 23.5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 0.3 గ్రాముల చక్కెరలు, 11.8 గ్రాముల ఫైబర్, 975 మిల్లీగ్రాముల కాల్షియం,
14.55 మిల్లీగ్రాముల ఐరన్, 351 మిల్లీగ్రాముల మెగ్నీషియం, 629 మిల్లీగ్రాముల ఫాస్పరస్, 468 మిల్లీగ్రాముల పోటాషియం వుంటుంది.
Milk
ఇక 100 ఎంఎల్ ఆవుపాలలో 42 కేలరీలు, 3.4 గ్రాముల ప్రోటీన్లు, 1 గ్రాముల కొవ్వులు, 5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 5 గ్రాముల చక్కెరలు, 120 మిల్లీగ్రాముల కాల్షియం, 0.03 మిల్లీగ్రాముల ఐరన్, 10 మిల్లీగ్రాముల మెగ్నీషియం, 95 మిల్లీగ్రాముల ఫాస్పరస్, 150 మిల్లీగ్రాముల పోటాషియం మాత్రమే వుంటుంది.
milk
ఇలా పాలతో పోల్చుకుంటే నువ్వుల్లోనే అధిక పోషకాలు, విటమిన్లు వున్నాయి. కానీ ధర చూసుకుంటే పాల కంటే నువ్వులే తక్కువ. కాబట్టి ఆహార అలవాటును కొద్దిగా మార్చుకుని పాల నుండి నువ్వులకు మారితే ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతాయి.
milk
పాలను మానేసి నువ్వులకు మారితే ఎంత లాభమంటే...:
ప్రతి కుటుంబం ప్రతిరోజు పాలను ఉపయోగిస్తుంది. సాధారణంగా ఒక చిన్న కుటుంబం సగటున రెండు లీటర్లు పాలు వాడుతుంది. అంటే లీటర్ పాలు రూ.70 రూపాయలు అనుకున్నా ప్రతిరోజు రూ.140 ఖర్చవుతుంది. నెలకు 60 లీటర్ల పాలు అంటే రూ.4200 ఖర్చు అవుతుంది.
Sesame
అయితే పాలకంటే ఎక్కువ పోషకాలను కలిగిన నువ్వులు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ప్రస్తుతం మార్కెట్ లో నువ్వుల ధర రూ.320 గా వుంది. 60 లీటర్ల పాలలోని పోషకాలు కేవలం 6 కిలోల నువ్వుల్లో లభిస్తాయి. అంటే కేవలం రూ.1920 నువ్వులు ఓ కుటుంబానికి నెల రోజులకు సరిపోతాయి.
Money
ఇలా పాలను మానేసి నువ్వులను తినడంద్వారా ప్రతినెలా రూ.2,000 వరకు ఆదా అవుతుంది. అంటే సంవత్సరానికి 25 వేలు. ఇలా నెలానెలా ఆదాఅయ్యే డబ్బులను అధిక లాభాలు వచ్చే మార్గాల్లో పెట్టుబడి పెట్టుకుంటే 50 ఏళ్లలో రూ.20 నుండి రూ.25 కోట్ల వరకు సంపాదించవచ్చు. ఇలా చిన్న అలవాటు మార్చుకోవడం వల్ల కోట్లు ఆదా చేయవచ్చన్నమాట.
Money
ఎవరైనా డబ్బులు సంపాదించాలంటే ముందు ఎంతో కొంత పెట్టుబడి పెట్టాలి. కానీ ఎలాంటి పెట్టుబడి లేకుండానే కేవలం ఆహార అలవాట్లను మార్చుకోవడం ద్వారా కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. కానీ చాలామంది తమ అహార అలవాట్లను కోట్లిచ్చినా మార్చుకోడానికి సిద్దంగా వుండరు. కాబట్టి మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమమో, మీకు ఏది అలవాటో అదే తీసుకోవడం ఉత్తమం. అహార అలవాట్లు మార్చుకోవడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అనుకునేవారు మాత్రం డబ్బులు ఆదా చేసుకోవచ్చు.