సంక్రాంతి 2023: నువ్వులు హెల్త్ కి మంచివి.. సంక్రాంతి రోజు ఈ నువ్వుల వంటకాలు తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు

First Published | Jan 15, 2023, 12:08 PM IST

sankranti 2023: చలికాలంలో నువ్వులను తప్పకుండా తినాలంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇవి మన శరీరాన్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు నువ్వులతో చేసిన వంటకాలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అందుకే ఈ సంక్రాంతికి నువ్వులతో చేసిన ఈ వంటకాలను తప్పకుండా ట్రై చేయండి. 
 

మన దేశంలో ఘనంగా జరుపుకునే అతిపెద్ద పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. ముఖ్యంగా ఈ పండుగను తెలుగు వాళ్లు అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగ సూర్యుని కదలికతో పాటు ఋతువులో మార్పును కూడా సూచిస్తుంది అంటే మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశి లోకి ప్రవేశించిన మొదటి రోజును సూచిస్తుందన్న మాట. ఈ సంక్రాంతితో చలి తీవ్రత తగ్గి.. ఎండాకాలం కొద్ది కొద్దిగా మొదలవుతుంది. ఇతర పండుగల మాదిరిగానే.. మకర సంక్రాంతి వేడుకల కోసం నోరూరించే ఎన్నో పిండి వంటలను, తీపి వంటను తయారుచేస్తుంటారు. 
 

మకర సంక్రాంతి ఉత్సవాల్లో నువ్వులు, బెల్లానికి ప్రత్యేకత ఎంతో ఉంది. వీటిని దానం కూడా చేస్తుంటారు. నువ్వులను, బెల్లాన్ని దానం చేస్తే అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. అంతేకాదు ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలా మేలు చేస్తాయి. అందుకే సంక్రాంతికి ప్రతి ఒక్క ఇంట్లో నువ్వులు, బెల్లంతో తయారుచేసిన వంటకాలు తప్పకుండా ఉంటాయి. నువ్వులు మన శరీరాన్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. మకర సంక్రాంతి వేడుకల కోసం నువ్వులతో చేసే రకరకాల వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos


నువ్వుల లడ్డూ

సంక్రాంతికి పిండి వంటలు ఎలా ఫేమస్సో.. నువ్వుల లడ్డూలు కూడా అంతే ఫేమస్. అవును సంక్రాంతికి తప్పకుండా నువ్వుల లడ్డూలను చేసుకుని తింటుంటారు. శీతాకాలంలో కూడా.  ముఖ్యంగా మకర సంక్రాంతికి సందర్భంగా దేశంలోని దాదాపు అన్ని ఇళ్లలో నువ్వుల లడ్డూలు ఖచ్చితంగా ఉంటాయి. కాల్చిన, సువాసన గల నువ్వులు, బెల్లం సిరప్ నువ్వుల లడ్డూలను తయారుచేస్తారు. నువ్వుల లడ్డూలు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. అంతకాదు ఈ లడ్డూలు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. 

నువ్వుల పనీర్ పకోడా

పండుగకు ఇంటికొచ్చిన అతిథులకు, ఇరుగు పొరుగు వారికి నువ్వుల పరీర్ పకోడాను ఖచ్చితంగా ఇస్తుంటారు. దీన్ని చిరుతిండిగా లేదా కూరగా కూడా తీసుకుంటారు. పనీర్ దాదాపుగా అందరికీ ఇష్టమే. ఈ నువ్వుల పనీర్ పకోడా మీ మకర సంక్రాంతి వేడుకలను మరింత ఆనందంగా చేస్తుంది. నువ్వులతో చేసిన పనీర్ పకోడా  క్రిస్పీగా, రుచిగా ఉంటుది. 
 

Image: Freepik

నువ్వుల పోలి

నువ్వుల పోలీ సాంప్రదాయ మహారాష్ట్ర వంటకం. నువ్వుల పోలీని మైదాతో పాటు కాల్చిన నువ్వులు, బెల్లం , గోధుమ పిండిని ఉపయోగించి తయారుచేస్తారు. ఇది తీయగా, టేస్టీగా ఉంటుంది. ఈ నువ్వుల పోలీని సాధారణంగా మకర సంక్రాంతి పండుగ రోజున ఖచ్చితంగా తయారుచేస్తారు. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో దీనిని చాలా సులువుగా, ఈజీగా తయారుచేయొచ్చు. 
 

నువ్వుల పాపడ్

క్రంచీగా, తీయగా ఉండే నువ్వుల పాపడ్ లు కూడా సంక్రాంతి స్పెషల్ వంటకమే. ఈ నువ్వుల పాపడ్ ను పిల్లలకు ఖచ్చితంగా తినిపించాలి. ఎందుకంటే ఇది వారిని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుంది. సింపుల్ రెసిపీతో దీనిని కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేయొచ్చు. ఇవి చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. 
 

బజ్రా నువ్వుల టిక్కీ

ఈ బజ్రా టిల్ టిక్కీ మకర సంక్రాంతికి స్పెషల్ స్వీట్. ఈ స్నాక్ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బజ్రా, నువ్వులు రెండూ ఈ చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. కేవలం మూడు పదార్థాలతోనే వీటిని తయారుచేయొచ్చు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. 

click me!