పొంగల్ రోజున రుచికరమైన వంటకాలను చేద్దామనుకుంటున్నారా? అయితే వీటిని ట్రై చేయండి..

Published : Jan 14, 2023, 02:53 PM IST

పొంగల్ రోజున రకరకాల వంటకాలను తయారుచేస్తుంటారు. మరి మీకు ఆ రోజున ఎలాంటి వంటలను చేయాలో తోచడం లేదా.. అయితే మీకోసం కొన్ని వంటకాలు ఇక్కడ ఉన్నాయి చూసేయండి..   

PREV
19
పొంగల్ రోజున రుచికరమైన వంటకాలను చేద్దామనుకుంటున్నారా? అయితే వీటిని ట్రై చేయండి..
pongal

భారతదేశంలోని దక్షిణ ప్రాంతాలలో చాలా ఘనంగా జరుపుకునే పంట పండుగే సంక్రాంతి. ఇతర పండుగల మాదిరిగానే పొంగల్ నాడు కూడా రకరకాల సాంప్రదాయ వంటకాలను తయారుచేస్తుంటారు. ఈ పండుగకు ప్రజలు కొత్త బియ్యం, బెల్లంతో చేసిన వంటకాలను దేవుడికి సమర్పిస్తుంటారు.అయితే ఈ వేడుక తమిళులకు అతి పెద్దది కాబట్టి.. వారు వివిధ రకాల వంటలను తయారుచేస్తుంటారు. వీటిని మనం మన ఇంట్లో చాలా సులువుగా తయారుచేయొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

29

సక్కరై పొంగల్

ఇదొక తీపి వంటకం. ఈ తీపి వంటకాన్ని బియ్యం, బెల్లం, పెసర పప్పుతో తయారు చేస్తారు. ఈ తీపి వంటకాన్ని పొంగల్ మొదటి రోజున ఇంద్ర దేవుడికి సమర్పిస్తారు.
 

39

పాయసం

పాయసాన్ని అన్నం, పాలు, బెల్లంతో తయారు చేసే ఖీర్ రిసిపి. ఈ పాయసం మరింత రుచికరంగా అయ్యేందుకు దీనిలో డ్రై ఫ్రూట్స్ ను కూడా వేస్తారు. 
 

49

చక్కెర పొంగలి

ఈ వంటకం రుచిలో తియ్యగా ఉంటుంది. సూర్యునికి కృతజ్ఞతలు తెలిపినందుకు ఈ వంటకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. 
 

59

వెన్ పొంగల్

ఇది దక్షిణాది మసాలా దినుసులు, రుచులతో తయారు చేసే ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇది మరింత రుచికరంగా అయ్యేందుకు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ను కలపొచ్చు. 
 

69

మెడు వడ

పొంగల్ పండుగ సందర్భంగా ఈ రెసిపీని ఈవెనింగ్ స్నాక్ గా తీసుకోవచ్చు. దీన్ని పప్పుల కలయికతో తయారు చేస్తారు. దీన్ని సాంబార్, కొబ్బరి చట్నీతో వడ్డిస్తారు.
 

79

చింతపండు పులిహోర

చింతపండు పులిహోరను ఎలాంటి సందర్భంలోనైనా తినొచ్చు. సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా చేసుకుని తింటుంటారు. దీనిని సాదా పెరుగుతో కూడా తినొచ్చు. 

లెమన్ రైస్

ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన దక్షిణ భారత వంటకాల్లో ఒకటి. సాంబార్ లేదా పెరుగుతో ఈ వంటకాన్ని ఆస్వాదిస్తారు. సంక్రాంతికి కూడా ఈ రెసిపీని తయారుచేస్తుంటారు. 
 

89
Curd rice

పెరుగు అన్నం ఇది చిక్కటి పెరుగు, సుగంధ ద్రవ్యాలు, తెల్ల బియ్యం, మొలకలతో తయారుచేస్తారు. దీనికి కరివేపాకు, పచ్చిమిర్చి కలిపితే మరింత రుచిగా అవుతుంది.  
99

ఇడ్లీ సాంబార్

దక్షిణ భారత వంటకాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన వంటకాల్లో 'ఇడ్లీ సాంబార్' ఒకటి. బియ్యం, పప్పుల కలయికతో తయారు చేసిన ఇడ్లీ చాలా ఆరోగ్యకరమైన ఆహారం. దీనిని సాంబార్ తో తింటే టేస్ట్ బాగుంటుంది. 
  

click me!

Recommended Stories