కంద బర్గర్.. మా అత్తగారితో ఎలా వంట చేయించానో చూడండి.. వీడియో షేర్ చేసి సమీరారెడ్డి హల్ చల్..

First Published | Sep 20, 2021, 2:58 PM IST

సమీరా రెడ్డి తన అత్తగారు మంజరి వర్దేతో కలిసి డ్యాన్స్ వీడియోలు, రెసిపీ వీడియోలు చేస్తుంటారు. మరో సూపర్ వంటకంతో  ఇన్‌స్టాగ్రామ్‌లో "మెస్సీ మామా అండ్ సాసీ సాసు" అనే టైటిల్‌తో ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో తన అత్తగారు చేసిన సూరన్ అంటే కంద స్పెషల్ బర్గర్, భజీ రెసిపీని షేర్ చేసింది. 

Sameera Reddy

సమీరా రెడ్డి నటిగా అందరికీ సుపరిచితమే.. ఆమె ప్రస్తుతం నటననుంచి విరమించుకుని హాయిగా, పెళ్లి చేసుకుని పిల్లలతో గడుపుతోంది. అయితే సమీరారెడ్డి తన అత్తగారితో కలిసి చేసే వీడియోలు చాలా వైరల్ గా మారుతుంటాయి. 

sameera reddy

సమీరా రెడ్డి తన అత్తగారు మంజరి వర్దేతో కలిసి డ్యాన్స్ వీడియోలు, రెసిపీ వీడియోలు చేస్తుంటారు. మరో సూపర్ వంటకంతో  ఇన్‌స్టాగ్రామ్‌లో "మెస్సీ మామా అండ్ సాసీ సాసు" అనే టైటిల్‌తో ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో తన అత్తగారు చేసిన సూరన్ అంటే కంద స్పెషల్ బర్గర్, భజీ రెసిపీని షేర్ చేసింది. 


sameera reddy

కందను తాను పెళ్లయ్యే వరకు తినలేదని.. తన అత్తగారే తనకు దీన్ని పరిచయం చేశారని చెప్పుకొచ్చారు. అంతేకాదు "ఇది చాలా రుచికరమైనది. కంద భూమిలోపల పెరుగుతుంది. అనేక అద్భుతమైన లక్షణాలున్నాయి. కార్బోహైడ్రేట్ కు మంచి మూలం. చర్మానికి చాలా మంచిది కూడా" అంటూ రాసుకొచ్చింది సమీరా రెడ్డి.

Sameera Reddy

మామూలుగా కంద తినాలంటే పిల్లలు పెద్దగా ఇష్టపడరని.. కాకపోతే తన అత్తగారు చేసే ఈ స్పెషల్ తో కంద పిల్లల ఫేవరేట్ అయిపోతుందని చెప్పుకొచ్చారు. వీటిని ఎలా తయారు చేయాలో కూడా ఈ వీడియో చూపించారు. 

Sameera Reddy

సూరన్ బర్గర్స్ (కంద బర్గర్) : దీన్ని తయారు చేయడానికి కంద, బంగాళదుంపలను ఒక్కొక్కటి 200 గ్రాములు తీసుకోవాలి. తరువాత కందను నీట్ గా పొట్టుతీసి ముక్కలుగా కోయాలి. బంగాళాదుంపలను కూడా శుభ్రంగా కడిగి ముక్కలుగా కోయాలి. ఆ తరువాత సమీర అత్తగారు సురాన్, బంగాళాదుంపల ముక్కలమీద ఉప్పు వేసి, వాటిని మెత్తబడే వరకు ఆవిరి మీద ఉడికించారు. 

Sameera Reddy

తరువాత కంద, బంగాళాదుంపలను మెత్తగా మాష్ చేసి, 1 సన్నగా తరిగిన ఉల్లిపాయ, 2 టేబుల్ స్పూన్ల అల్లం, 1 టేబుల్ స్పూన్ పచ్చి మిర్చి, 1 టీస్పూన్ జీరా పౌడర్, 1 చిన్న కప్పు తరిగిన కొత్తిమీర, 1/2 టీస్పూన్ చక్కెర, రుచికి తగినంత ఉప్పు వేసి.. వీటిని చిన్న చిన్న బిళ్లలుగా చేసి.. పాన్ మీద వేయించారు. తరువాత సమీర బర్గర్ బన్స్ ను కాల్చి, వెన్న రాసి, ఆకుకూర ఆకులు పరిచి దీనిమీద గుండ్రంగా కోసిన ఉల్లిపాయలు, టమోటాలతో అలంకరించింది. అంతే టేస్టీ టేస్టీ సూరన్ బర్గర్ రెడీ.

sameera reddy

సూరన్ సబ్జి : దీనికోసం కూడా చెరో 200 గ్రాముల కంద, బంగాళాదుంపలు తీసుకున్నారు. ఉపవాసం సమయంలో కూడా ఈ సబ్జీ తినవచ్చు పోస్టు రాసింది సమీర. సేమ్ ఇక్కడ కూడా తొక్కతీసి, శుభ్రంగా ముక్కలు కట్ చేసిన కంద, బంగాళ దుంపలకు కాస్త ఉప్పు వేసి ఆవిరి మీద ఉడికించారు. తరువాత దీనికి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల జీరా, 3 టేబుల్ స్పూన్లు  అల్లం/పచ్చి మిరప పేస్ట్, 1 కప్పు పల్లీలు, తరిగిన కొత్తిమీర, కొబ్బరి తురుము కలిపి ముద్దగా చేశారు.

sameera reddy

ఒక కడాయిలో నెయ్యిని వేడి చేసి పచ్చి మిరపకాయలు, అల్లం పేస్ట్, జీరా వేసి అది చిటపటలాడాక... పొడి చేసిన పల్లీలు, ఉడికిన కంద, బంగాళాదుంప మిశ్రమాన్ని జోడించింది. అంతే  కూర రెడీ అయిపోయింది. ఈ కర్రీని రాజ్‌గిరా పూరీలు, పెరుగుతో తింటే అదిరిపోతుందని సమీరా చెప్పుకొచ్చింది. 

ఇక సమీరా అత్తగారు మాట్లాడుతూ... కందను చిన్నచూపు చూస్తారని.. పెద్దగా ఉపయోగించరని చెప్పుకొచ్చారు. అయితే ఎన్నో పోషక విలువలున్న కందను ఇండియన్ స్టైల్, వెస్ట్రన్ స్టైల్ రెండింట్లోనూ అద్భుతంగా చేయచ్చని చెప్పుకొచ్చారు. 

Latest Videos

click me!