మీ భాగస్వామికి శృంగార కోరికలు కలగడం లేదా? అయితే ఇదే సమస్య కావొచ్చు

First Published | Feb 3, 2023, 9:43 AM IST

భాగస్వాముల మధ్య లైంగిక జీవితం సాఫీగా ఉంటేనే మిగతా అంతా బాగుంటుందంటారు నిపుణులు. భార్యాభర్తలల్లో ఏ ఒక్కరికీ సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ లేకపోయినా అవతలి వ్యక్తి కూడా దానిపై ఇంట్రెస్ట్ ను వదులుకోవాల్సిందే. నిజానికి ఈ రోజుల్లో చాలా మందికి ఇదొక సమస్యగా మారిపోయింది. కానీ ఇలా లైంగిక కోరికలు తగ్గడం వల్ల భాగస్వాముల మధ్య సఖ్యత కరువవుతుంది. గొడవలు కూడా మొదలవుతాయి.అంతేకాదు ఎన్నో మానసిక, శారీరక సమస్యలు కూడా వస్తాయి. 

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు చాలా చాలా అవసరం. మీ శరీరంలో ఏదైనా ఒక పోషకం లోపం ఉంటే అది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది. ముఖ్యంగా విటమిన్లు. మన శరీరానికి విటమిన్లు సరైన మొత్తంలో ఉండటం చాలా ముఖ్యం. అందులో ఒకటైన విటమిన్ డి లోపిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ డి లోపంతో మీ ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఇది బోలు ఎముకల వ్యాధి, ఎముక పగుళ్ల అవకాశాలను పెంచుతుంది. విటమిన్ డి లోపం ఎన్నో ఇతర వ్యాధులకు కూడా దారితీస్తుంది. విటమిన్ డి లోపం లైంగిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని కొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 


లైంగిక కోరికలు, ఉద్వేగం తగ్గొచ్చు

రోపియన్ జర్నల్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్స్ గైనకాలజీ అండ్ రిప్రొడక్టివ్ బయాలజీలో ప్రచురించబడిన రాబర్ట్ క్రిసియాక్, ఎమ్ గిలోవ్స్కా పరిశోధన కథనం ప్రకారం.. విటమిన్ డి లోపం యువతుల లైంగిక కోరికను ప్రభావితం చేస్తుంది.  వీరిలో డిప్రెషన్ లక్షణాలు కూడా ఉన్నాయట.  సెక్స్ పై విటమిన్ డి ప్రభావాలను పరిశీలించడానికి ఈ అధ్యయనం నిర్వహించబడింది. ఈ అధ్యయనంలో విటమిన్ డి లోపం ఉన్న 14 మంది మహిళలతో పాటు 14 మంది ఆరోగ్యకరమైన మహిళలు పాల్గొన్నారు. దీనిలో పాల్గొన్న వారందరికీ ఒక ప్రశ్న వేశా


సంతృప్తి లేకపోవడం

ఈ అధ్యయనంలో పాల్గొన్న మహిళలందరి లైంగిక పనితీరును కొలిచారు. సాధారణ విటమిన్ డి స్థాయి ఉన్న మహిళల కంటే విటమిన్ డి లోపం ఉన్న మహిళలకు లైంగిక కోరికలు, ఉద్వేగం, సంతృప్తి తక్కువగా ఉన్నాయని అధ్యయనంలో కనుగొన్నారు. ఫలితాల ఆధారంగా తక్కువ స్థాయి విటమిన్ డి అసాధారణ స్త్రీ లైంగిక కార్యకలాపాలతో ముడిపడి ఉందని పరిశోధకులు నిర్ధారించారు. అలాగే ఇలాంటి మహిళల్లో డిప్రెషన్ లక్షణాలు కూడా ఉన్నాయని గుర్తించారు. 
 

పురుషుల్లో లైంగిక వాంఛ తగ్గడం

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇంపోటెన్స్ రీసెర్చ్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధనా కథనం ప్రకారం.. హైపోవిటమినోసిస్ డి  అంటే విటమిన్ డి లోపం ఉన్న మహిళలు, పురుషులలో లైంగిక కోరికలు తగ్గుతాయి. ఈ అధ్యయనం విటమిన్ డి లోపం ఉన్న యువకులలో లైంగిక సామర్థ్యం తగ్గడం లక్షణాలను గమనించింది. ఈ అధ్యయనంలో విటమిన్ డి లోపం ఉన్న 15 మంది పురుషులు, 15 మంది ఆరోగ్యకరమైన పురుషులు పాల్గొన్నారు. వారంతా 18 నుంచి 40 సంవత్సరాలున్న వారు. విటమిన్ డి లోపం ఉన్న పురుషులకు ఆరోగ్యకరమైన పురుషుల కంటే అంగస్తంభన పనితీరు, ఉద్వేగం, లైంగిక కోరికలు లేకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని గమనించారు.

పురుషుల్లో అంగస్తంభన లోపం

విటమిన్-డి లోపం కూడా అంగస్తంభనకు కారణమవుతుందని వరల్డ్ జర్నల్ ఆఫ్ మెన్స్ హెల్త్ లో ప్రచురించిన పరిశోధన నొక్కి చెబుతోంది. అంగస్తంభన పనితీరుకు విటమిన్ డి చాలా చాలా అవసరమని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 
 

Image: Getty Images

టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉండొచ్చు

సూర్యరశ్మికి ప్రతిస్పందనగా మన చర్మం విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. కొన్నిరకాల ఆహారాల్లో కూడా ఈ విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి లోపం ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది అంతేకాదు ఇది సెక్స్ డ్రైవ్ ను కూడా తగ్గిస్తుంది. విటమిన్ డి లోపం ఉన్న పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది వారి లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుంది.
 

Image: Getty Images

విటమిన్ డి, జీవక్రియ సిండ్రోమ్

విటమిన్ డి లోపం ఉండి రుతుక్రమం ఆగిపోయిన మహిళలకు మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. దీనివల్ల వారి కడుపుపై పెరిగిన కొవ్వు వారి లైంగిక ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుంది 
ఇది సెక్స్ డ్రైవ్ ను తగ్గిస్తుంది. సంతృప్తిని కూడా తగ్గిస్తుంది. మహిళలు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకుంటే టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కారణంగా వచ్చిన హార్మోన్ల స్థాయిలో వచ్చిన మార్పులను కూడా మెరుగుపరుస్తాయి.

Latest Videos

click me!