relationship tips: ఆధిపత్యం చెలాయించే భర్తను ఇలా హ్యాండిల్ చేయండి..

First Published Jun 9, 2022, 10:41 AM IST

relationship tips: ఏండ్ల నుంచి ఈ సమాజంలో పురుషాధిక్యమే కొనసాగేది. ఇప్పుడు కాలం మారింది. భర్త ఆధిపత్యం చెలాయిస్తే.. భార్యలు అస్సలు సహించడం లేదు. అందులోనూ ఈ రోజుల్లో కొంతమంది ఆడవారు కూడా తమ పార్టనర్ పై ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు.
 

relationship tips: ఈ సమాజంలో ఏ ఒక్క జంటో అన్యోన్యంగా ఎలాంటి డామినేషన్ లేకుండా జీవిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ చాలా జంటల్లో భార్య లేదా భర్త ఎవరో ఒకరు తమ పార్టనర్ పై ఆధిపత్యం (Dominance) చెలాయిస్తూ  ఉంటున్నారు. ఇలాంటి relationship లో గొడవలు చాలా కామన్ గా జరుగుతుంటాయి. రిలేషన్ షిప్ లో ప్రేమ, గౌరవం,స్వేచ్ఛా అనే భావనలు ఉంటేనే వివాహ బంధం జీవితాంతం కొనసాగుతుంది. భర్త లేదా భార్య  పార్టనర్ పై ఆధిపత్యం చెలాయిస్తూ.. మేం చెప్పినట్టే వినాలంటే మాత్రం ఆ సంబంధం ఎక్కువ రోజులు కొనసాగదు. 

నేటికీ మన సమాజంలో పురుషులే ఆధిపత్యం చెలాయించాలని భావిస్తారు. కానీ అప్పటి ఆడవారిలా ఏది చెప్తే  అది చేసి.. భర్తలు చెప్పినట్టుగా నడుచుకునే ఆధిపత్య ధోరణిని వదిలేసారు ఇప్పటి మహిళలు. ముఖ్యంగా భర్తలు ఆధిపత్యం చెలాయిస్తే సహించడం లేదు. 

ఆధిపత్యం చెలాయించే భర్త ఉన్న మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే..వారికి నచ్చించి చేయకపోవడం..  వారు చెప్పేది వినాలి.. వాళ్లు చెప్పిందే చేయాలి.. లేదా ప్రతిదీ వారి ప్రకారం జరగాలి అని కోరుకునే భర్తలు చాలా మందే ఉంటారు. మరి ఇలాంటి భర్తలను ఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

Relationship tips

గౌరవం చాలా ముఖ్యం: ప్రేమ (Love)లేదా వివాహ (Marriage)బంధంలో ఎదుటివారికి గౌరవం ఇవ్వడమేని ముఖ్యమైనదని మీరు మీ భాగస్వామికి వివరించాలి. ఒకరినొకరు చిన్నచూపు చూడటం వల్ల సంబంధం (Relationship)దెబ్బతింటుంది. ఎప్పుుడూ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోండి. మీ భాగస్వామి అలా చేయకపోతే వారి అలవాట్లను మార్చడానికి ప్రయత్నించండి.

భావాలను పంచుకోండి: మీరు ఒక సంబంధాన్ని బలోపేతం చేయాలనుకుంటే భావాలను (Feelings) పంచుకోవడం చాలా ముఖ్యం. మీ భాగస్వామి మీతో ఎక్కువ సమయం గడుపుతూ.. వారి ఆలోచనలు, ఇతర విషయాలన్నింటినీ మీతో పంచుకుంటే అది మంచి సంబంధానికి సంకేతం. కానీ మీ భాగస్వామి మీకు సమయం ఇవ్వకుండా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుంటే.. అది సరైనది కాదు. సమయాన్ని కేటాయించండి.  అప్పుడే మీ బంధం ఎక్కువ రోజులు మనగలుగుతుంది. 

కలిసి నిర్ణయం తీసుకోండి:  చాలాసార్లు ఆధిపత్యం చెలాయించే భాగస్వామి అన్ని నిర్ణయాలను ఒక్కడే తీసుకుంటాడు. ఎక్కడికి వెళ్లాలి, ఏమి ధరించాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, జీవితాన్ని ఎలా గడపాలి మొదలైన వాటి గురించి మీరు మీరు నిర్ణయిస్తే మీ భాగస్వామికి మీపై ద్వేషం ఏర్పడొచ్చు.  ఏ బంధంలో అయినా సరే కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడే జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. 

శ్రద్ధాసక్తులు (Attention): ఆధిపత్యం చెలాయించే భాగస్వామి తమ పార్టనర్ గురించి అస్సలు పట్టించుకోరు. ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులు ఎల్లప్పుడూ తమ భాగస్వామి గురించి చాలా చిత్తశుద్ధితో ఉంటారు. అలాంటి వారికి శ్రద్ధ అవసరం. అటువంటి వ్యక్తులు తమ భాగస్వామి అవసరాలను పట్టించుకోరు. కానీ వారి అవసరాలను తీర్చాలని తమ భాగస్వామిని ఒత్తిడి చేస్తూనే ఉంటారు.
 

ఎవరికైనా పర్సనల్స్ ఉంటాయి. వీటిని భాగస్వామి తెలుసుకోవడంలో తప్పులేదు కానీ.. వారి ఫీలింగ్స్ ను గౌరవించకపోవడమే పెద్ద మిస్టేక్. అవసరమనుకుంటే వాళ్లే మీతో చెప్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని వ్యక్తిగత విషయాలు ఉంటాయి. నేటి కాలంలో.. వాళ్ల పార్టనర్ కు సంబంధించిన ప్రతి దాంట్లో జోక్యం చేసుకోవాలనుకోరు. కానీ కొంతమంది మాత్రం చేసుకుంటారు. మిమ్మల్ని అడగకుండానే మీ ఫోన్ చెక్ చేయడం లేదా ఏదైనా వ్యక్తిగత విషయాలను చూడటం సరైన  పద్దతి కాదని వారికి చెప్పాలి. 

click me!