విద్యుత్ కాంతుల్లో.. జనాలతో కిక్కిరిసిన చార్మినార్.. రెండు కళ్లూ చాలడం లేదుగా..

Published : Apr 19, 2022, 09:42 AM IST

ఒక వైపు మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు.. మరోవైపు ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా గుమిగూడిన జనాలు.. రంజాన్ రాకతో చార్మినార్ మునపటి కాంతిని సంతరించుకుంది. ఇంకేముంది చార్మినార్ పరిసర ప్రాంతాలను చూడటానికి రెండు కళ్లూ చాలడం లేదంటే నమ్మండి.   

PREV
17
విద్యుత్ కాంతుల్లో.. జనాలతో కిక్కిరిసిన చార్మినార్.. రెండు కళ్లూ చాలడం లేదుగా..

హైదరాబాద్ లోని ఫేమస్ ప్రాంతాల్లో చార్మినార్ ఒకటి. ఈ అద్బుతమైన ప్రదేశాన్ని చూడటానికి సిటీ చుట్టుప్రక్కల వారే కాదు ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి సైతం వస్తుంటారు. ఇక రంజాన్ మాసం షురూ కావడంతో చార్మినార్ పరిసర ప్రాంతాలు జనాలతో కిక్కిరిసిపోయింది. ఇప్పుడు చార్మినార్ ను చూస్తే.. మనుపటి కళ సంతరించుకుంది అన్నంతల మారిపోయింది. 

27

అవును కరోనా మహమ్మారి రాకతో గత రెండేళ్లుగా చార్మినార్ ప్రాంతం బోసిబోయింది. కరోనా ఆంక్షలతో చార్మినార్ ను చూడటానికి కూడా వీళ్లేకుండా పోయింది. కానీ రెండేళ్ల తర్వాత అంటే ఇప్పుడు చార్మినార్ మునపటి శోభను సంతరించుకుంది. ఇక చార్మినార్ లో షాపింగ్ జోరుగా సాగుతోంది. జనాలతో కిటకిటలాడుతూ.. సందడి సందడిగా మారిపోయింది. ఇక్కడికి స్థానికులే కాదు.. ఇతర జిల్లాల ప్రజలు కూడా షాపింగ్ చేయడానికి క్యూలు కడుతున్నారు. 

37

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు దంచి కొడుతుండటంతో.. కొనుగోలు దారులు రాత్రి సమయంలోనే చార్మినార్ కు భారీ స్థాయిలో వస్తున్నారు. సాయంత్రం వేళ  వెదర్ కూల్ గా ఉండటంతో రాత్రివేళ షాపింగ్ చేయడానికి వెళుతున్నారు. ఇంకేముంది ప్రతి షాపు ముందు జనాలు కిక్కిరిసారంటే నమ్మండి. 

47

ఇకపోతే లాడ్ బజార్, గుల్జర్ హౌజ్, పథేర్గట్టి లో మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు రంజాన్ పండుగ స్ఫూర్తిని నింపుతున్నాయి. పవిత్ర మాసం రంజాన్ మొదలైనప్పటి నుంచి పగలు రాత్రి అంటూ తేడా లేకుండా జనాలతో కిటకిటలాడుతోనే ఉంది. 

57

కానీ చాలా మంది మాత్రం సాయంత్రం వేళే చార్మినార్ కు వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మండుతున్న ఎండలకు, వేడి తాపాన్ని తప్పించుకోవడానికి ఇలా రాత్రి వేళ చార్మినార్ లో షికారుకు వెళుతున్నారు. ఈ సమయంలో అక్కడ రద్దీగా ఉంటుంది. 

67

ఇక్కడకొచ్చే జనాలు కేవలం షాపింగ్ చేయడమే కాదు.. రకరకాల నోరూరించే రుచులను సైతం టేస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 
 

77

‘ ఇతర ప్రాంతాలు, జిల్లాల నుంచి షాపింగ్ కు వచ్చే వినియోగదారులు కేవలం పగటి పూట మాత్రమే వస్తారు. ఈ చుట్టుపక్కల వారు మాత్రం రాత్రి పూటే ఎక్కువగా వస్తున్నారు’-స్థానికుడు

‘మండుతున్న ఎండలకు జనాలు బయటకు రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్నం వేళ కంటే రాత్రిపూటే కస్టమర్లు ఎక్కువగా వస్తున్నారు. గిరాఖీ కూడా ఎక్కువగానే ఉంటుంది’.-స్థానిక దుకాణాదారుడు

Read more Photos on
click me!

Recommended Stories