రకుల్ ప్రీత్ సింగ్ ఏం తింటుందో తెలుసా?

First Published | Feb 20, 2024, 10:53 AM IST

త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ విషయంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫిట్ గా ఉండటానికి రకుల్ ఎలాంటి డైట్ ఫాలో అవుతుందో తెలిస్తే షాక్ అవుతారు. 
 

రకుల్ ప్రీత్  సింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. కాగా ఈ సుందరి ఈ మధ్య కాలంలో తనకంటూ ఒక డిఫరెంట్ ఐడెంటిటీని ఏర్పరుచుకుంది. నటనతో పాటుగా ఫిట్నెస్ విషయంలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్ లో ఫిట్ నెస్ ఉన్న నటీమణుల్లో ఈ బ్యూటీ ఒకరు. ఈ బామ తరచూ తన డైట్, వర్కవుట్స్ గురించి మాట్లాడుతుంది. తన వర్కౌట్స్ వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఫిట్ గా ఉండటానికి ఈ బ్యూటీ ఎలాంటి డైట్ ఫాలో అవుతుంది? తన డైట్ టిప్స్ గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ డైట్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రకుల్ ప్రీత్ సింగ్ డైట్ సీక్రెట్

రకుల్ ప్రీత్ సింగ్ బి-టౌన్ లో ఫిట్ నెస్ ఉన్న నటీమణుల్లో ఒకరు. ఈమె తన ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్స్ చేస్తుంది. ఇలాంటి సెషన్ లో ఓ అభిమాని తన  డైట్ గురించి ప్రశ్నించాడు. దీనిపై రకుల్ స్పందిస్తూ జనాలు ఎక్కువగా ఆహారం అనే పదాన్ని ఆకలితో ముడిపెడతారని, ఇది చాలా నిరుత్సాహకరంగా అనిపిస్తుందనిన్నారు.
 


కానీ ఫిట్ గా ఉండాలంటే సమతులాహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన దినచర్యను పాటించాలి. ఇది ఫిట్ గా ఉండటానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ గ్లూటెన్ లేని, పాలు లేని ఆహారాన్ని అనుసరిస్తుంది. రకుల్ తన డైట్ లో పప్పు, రోటీ, వెజిటేబుల్స్ వంటి హోమ్ మేడ్ ఫుడ్స్ ను తీసుకుంటుంది. ముఖ్యంగా ఈ బ్యూటీ వైట్ షుగర్, జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటుంది. ఎట్టిపరిస్థితిలో వీటిని తనదు. 
 

బుల్లెట్ ప్రూఫ్ కాఫీతో రోజు స్టార్ట్ 

రకుల్ ప్రీత్ సింగ్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీతో రోజును ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఆమె జిమ్ కు వెళ్తుంది. ఈ కాఫీనే నెయ్యి కాఫీ అని కూడా అంటారు. దీన్ని గోరువెచ్చని నీటిలో ఆరోగ్యకరమైన కొవ్వును కలిపి  తయారుచేస్తారు. ఆరోగ్యకరమైన కొవ్వుగా.. మీరు చక్కెర లేకుండా ఎంసీటీ నూనె లేదా నెయ్యి లేదా వెన్న లేదా కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు. ఇది బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండటానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందట. 
 

Latest Videos

click me!