రిలేషన్ షిప్ ను నాశనం చేసేవి ఇవే..

First Published | Mar 3, 2022, 4:55 PM IST


పార్టనర్ ను లైఫ్ లోకి ఆహ్వానించినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ అదిగమించినప్పుడే ఆ రిలేషన్ షిప్ హ్యాపీగా సాగుతుంది. 

ఎన్నో ఛాలెంజెస్:  జంటగా ఉన్నప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని తప్పక ఫేస్ చేయాల్సిందే. అయితే కొన్ని విషయాల వల్ల ఆ బంధం గట్టిపడితే.. మరికొన్ని విషయాలు మాత్రం ఆ బంధాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాయి కూడా. 
 

ఈ విషయాల్లో జాగ్రత్త: ఒంటరిగా ఉంటడం వేరు.. భాగస్వామితో కలిసి జీవించడం వేరు. ఒక రిలేషన్ లోకి అడుకుపెట్టాక.. కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. మరి అవేంటో తెలుసుకుందాం పదండి. 


నమ్మకం ముఖ్యం: ఒక రిలేషన్ షిప్ సాఫీగా సాగాలంటే వారిద్దరి మధ్య నమ్మకం ఉండాలి. ముఖ్యంగా వారి వ్యక్తిగత సరిహద్దుల విషయంలో ఎలాంటి విభేధాలు తలెత్తకూడదు. ముఖ్యంగా భాగస్వామి అనుమతి లేకుండా ఫోన్ చూడటం, వారి ఛాటింగ్ ను చెక్ చేయడం, వారి పర్సనల్ వస్తువులను ఉపయోగించడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల మీ భాగస్వామికి మీపై నమ్మకం పూర్తిగా తొలగిపోయే ప్రమాదం ఉంది. 
 

స్వీకరించాలి:  ఎవరైనా మనస్ఫూర్తిగా ఓ వ్యక్తిని లవ్ చేస్తున్నట్టైతే వారెలా ఉన్నా మీరు వారిని వారిగానే యాక్టెప్ట్ చేస్తారు. వారిలో ఈ క్వాలిటీస్ బాలేవు అంటూ వారిని మార్చే ప్రయత్నం చేయరు. ఒకవేళ మీరు మార్చాలని ప్రయత్నించినా.. మీ పార్టనర్ అందుకు సిద్దంగా ఉండదు. అంతకొస్తే మిమ్మల్ని వదులుకోవడానికి కూడా వెనకడుగు వేయరు. 
 

బ్లేమ్ గేమ్స్: ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ ఉంటే  మీ మధ్యన ప్రేమ కాస్త  బ్రేకప్ కు దారితీస్తుంది. మొదట్లో ప్రేమ పక్షుల్లా ఉండి.. రాను రాను మీ ప్రవర్తన కోపంగా, చికాకుగా, చిన్నచూపుగా మారితే మాత్రం మీ లైఫ్ అస్సలు సంతోషంగా ఉండదు. అందుకే మీరు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఆచీ తూచీ అడుగెయ్యాలి. ప్రతి విషయాన్ని యాక్సెప్టు చేసే గుణముండాలి. 
 

ఎమోషనల్ అవ్వొద్దు:  రిలేషన్ షిప్ ఎన్నో సమస్యలు, ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అందుకే ప్రతి చిన్న విషయానికి కూడా ఎమోషన్ అయ్యి నేను నీతో ఉండలేను లాంటి మాటలు అనేయకూడదు. ఎందుకంటే ఇలాంటి మాటలే మీ మధ్య ఎవరూ చెరపలేని దూరం ఏర్పడవచ్చు. 
 

కమ్యూనికేషన్ : రిలేషన్ షిప్ లో కమ్యూనికేషన్ లోపం అస్సలు ఉండకూడదు. ఇది సరిగ్గా లేకపోతే మీ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి మీ బంధం తెగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మంచి ఎమోషన్స్ ను మీ భాగస్వామికి అయ్యే విధంగా చెప్పండి. అప్పుడే మీ బంధం ఎక్కువ కాలం ఉంటుంది. 
 

ఇద్దరి కంట్రిబ్యూషన్:  రిలేషన్ షిప్ లో సెల్ఫీష్ నెస్ అస్సలు పనికిరాదు. మేము ఇద్దరం అనే భావనతోనే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను, నా, నాకోసం అంటూ ఆలోచిస్తే మీరు స్వార్థపూర్వకంగా ప్రవర్తించినట్టే లెక్క. దీనివల్ల మీ బంధం ఎక్కువ రోజులు ఉండదు. 

టైం ఇవ్వాలి: మీ పార్టనర్ కు మీ తోడు కావాలి. దాంతోనే వారు ఆనందంగా ఉంటారు. ఒకరికోసం ఒకరు టైం కేటాయిస్తేనే మీ బంధం మరింత బలపడుతుంది. కాబట్టి వారికి మీ తోడు కావాలని తెలిసినప్పుడు వారికి అండగా ఉండంటి. నీకు నేనున్నా అనే భరోసా కల్పించండి. భార్యా భర్తలన్నాకా.. ఒకరికోసం ఒకరు కాస్త సమయాన్ని కేటాయిస్తేనే హ్యాపీగా ఉంటారు. 

Latest Videos

click me!