మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సూక్ష్మపోషకాలు ప్రోటీన్లు ఎంతో సహాయపడతాయి. వీటిలో ఉండే అమైనో ఆమ్లాలు మన శరీరాన్ని ధ్రుఢంగా, బలంగా ఉంచుతాయి. అలాగే కణాలను రిపేర్ చేయడానికి కూడా సహాయపడతాయి. ప్రోటీన్ల ఫుడ్ ను తీసుకుంటేనే మన చర్మం, ఎముకలు, కండరాలు, జుట్టుతో పాటుగా ఇదర అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ఈ ప్రోటీన్ ఫుడ్ ను వారానికో.. నెలకు ఒకసారి తీసుకుంటేనో ఆరోగ్యంగా ఉండం. ఆరోగ్యం బాగుండాలంటే ప్రోటీన్ ఫుడ్ ను రోజూ తీసుకోవాలి.
protein
గుడ్లు, మాంసం, చేపల్లో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందుకే గుడ్లను రోజూ తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే కొంతమంది నాన్ వెజ్ ను అసలే ముట్టరు. ఇలాంటి వారు ప్రోటీన్ ఫుడ్ ను కొన్ని కూరగాయలు, పండ్ల, ఇతర ఆహారపదార్థాల ద్వారా పొందొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
milk
పాలు
పాలు సంపూర్ణ ఆహారం అన్న సంగతి తెలుసు. అంటే దీనిలో అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు, ప్రోటన్లు వంటి అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయన్న మాట. మీరు శాఖాహారి అయ్యి ఉండి.. ప్రోటీన్ల లోపం ఉంటే రోజుకు రెండు గ్లాసుల పాలను తాగండి. ఈ పాలు మీ శరీరాన్ని ధ్రుఢంగా ఉంచుతాయి. అలాగే మీ బలాన్ని కూడా పెంచుతాయి.
సోయాబీన్స్
సోయా బీన్స్ ను ఇష్టపడని వారుండరు. సోయా బీన్స్ ప్రోటీన్లకు మంచి వనరు. దీనిలో మెగ్నీషియం, విటమిన్ ఎ, కాల్షియం, విటమిన్ బి, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు, ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే ఒకరోజుకు మీ శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది.
lentils
పప్పు
పప్పును ప్రోటీన్ పవర్ హౌస్ అంటారు. ఎందుకంటే వీటిలో మన శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు కందిపప్పులో ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు రాజ్మా, శెనగపప్పు, మైసూర్ పప్పు, పెసర పప్పులో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే మీలో పోషకాల లోపం రానేరాదు.
డ్రై ఫ్రూట్స్
చాలా రకాల గింజలు, డ్రై ఫ్రూట్స్ ను తింటే.. ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే ఈ డ్రై ఫ్రూట్స్ చాలా ఖరీదైనవి. కానీ వేరుశెనగుల చాలా తక్కువ ధరకే లభిస్తాయి. వేరు శెనగల్లో కూడా ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని బలోపేతం చేస్తాయి. ఎముకలు బలంగా ఉంచుతాయి. అందుకే వీటిని రోజూ గుప్పెడు తినండి. బాదం పప్పుల్లో కూడా పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అరకప్పు బాదం పలుకుల ద్వారా మన శరీరానికి 17 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. వీటిని తింటే మీ శక్తి స్థాయిలు పెరుగుతాయి. వీటిని నానబెట్టి తింటే వీటి నుంచి మరిన్ని ప్రయోజనాలను పొందుతారు.