bubble wrap
ఆన్ లైన్ లో మనం ఏదైనా వస్తువులు ఆర్డర్ చేస్తే.. ఆ వస్తువును ఒక బబుల్ ర్యాపర్ లో చుట్టి కొరియర్ చేస్తూ ఉంటారు. అయితే.. ఆ బబుల్ ర్యాపర్ ని చూడగానే.. మనలో చాలా మందికి ఆ బబుల్స్ ని పగలకొట్టాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే.. వాటిని పగలకొట్టడం మంచిది అని కొందరు వాదిస్తుంటే.. మంచిది కాదు అని చాలా మంది కొందరు వాదిస్తుంటారు. నిజంగా.. ఈ బబుల్స్ పగలకొట్టడం కూడా మన మానసిక స్థితిని తెలియజేస్తుందా? ఇది మనకు మంచి చేస్తుందా? లేక సమస్యలు తెస్తుందా అనే విషయం ఇప్పుడు చూద్దాం…
ఈ బుబల్స్ ని పాప్ చేయడాన్ని చాలా మంది సరదాగా భావిస్తారు. కానీ, దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మానసిక సమస్యలు రాకుండా ఉంటాయట. మరి, ఆ ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం…
చాలా పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే… ఈ బబుల్స్ ని పగల కొట్టడం వల్ల.. మానసిక సంతోషం కలుగుతుందట. వీటిని మన చేతులతో పాప్ చేస్తుంటే…మన మెదడు నుంచి సంతోషాన్ని కలిగించే హార్మోన్లు విడుదలౌతాయట. దీంతో మనకు తెలీకుండానే సంతోషం కలుగుతుందట.
bubble wrap
ఈ రోజుల్లో చాలా మంది అనేక సమస్యల కారణంగా ఒత్తిడికి గురౌతూ ఉంటారు. అయితే.. ఈ బబుల్స్ ని పాప్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందట.ఒత్తిడి తగ్గి.. మనసుకు హాయిగా అనిపిస్తుందట. అందుకే.. అప్పుడప్పుడు ఇలా వాటిని పగలకొట్టడం కూడా మంచిదేనట.
bubble wrap
మనం టీవీ చూస్తున్నప్పుడు, మ్యూజిక్ వింటున్నప్పుడు మన బ్రెయిన్ ఎంత ఏకాగ్రత గా ఉంటుందో.. ఈ బబుల్స్ పాప్ చేసినప్పుడు కూడా.. ఏకాగ్రత పెరుగుతుందట. అందుకే.. వీటిని పాప్ చేయడం మంచిదే. అంతేకాదు.. మానసిక తృప్తిని కూడా కలిగిస్తుంది. శృంగారంలో పాల్గొన్న సమయంలో ఎలాంటి తృప్తి అయితే కలుగుతుందో.. వీటిని పగలకొట్టినప్పుడు కూడా అంతే తృప్తి కలుగుతుందట.
bubble wrap
మీకు ఎప్పుడైనా ఏదైనా పనిచేసే సమయంలో ఫోకస్ రావడం లేదని అనిపిస్తే.. ఆ సమయంలో మీరు ఈ బబుల్స్ పాప్ చేస్తే చాలట.మళ్లీ ఫోకస్ పెరుగుతుందట.