side effects of milk : ఈ వ్యాధులున్న వారు పాలను అస్సలు తాగకూడదు..

Published : Apr 09, 2022, 12:04 PM IST

side effects of milk : పాలు సంపూర్ణ ఆహారం అయినప్పటికీ.. కీళ్ల వాపు, విరేచనాలు, కామెర్లు, ఫ్యాటీ లివర్ సమస్య, ఊబకాయం, గ్యాస్ట్రిక్, అలెర్జీలు, చర్మ సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితిలో పాలను తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. 

PREV
19
side effects of milk : ఈ వ్యాధులున్న వారు పాలను అస్సలు తాగకూడదు..

పాలు మంచి పోషకాహారం. ఇందులో  కాల్షియం, నికోటినిక్ ఆమ్లం, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ బి12 వంటివి పుష్కలంగా ఉంటాయి. అందుకే పాలను సంపూర్థ ఆహారం లీస్ట్ లో చేర్చారు.

29

పాలను ప్రతిరోజూ తాగడం వల్ల మలబద్దకం, నిద్రలేమి, అలసట, బలహీనత వంటి సమస్యలు ఇట్టే తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

39

పాలల్లో ఉండే కాల్షియం ఎముకలను, దంతాలను బలోపేతం చేస్తాయి కూడా. అయితే ఇన్ని దివ్య ఔషద గుణాలను కలిగి ఉన్నా పాలను కొందరు తాగకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 

49

పాలను తాగకూడని వ్యక్తులు.. కీళ్ల వాపు, విరేచనాలు, కామెర్లు వంటి సమస్యలున్న వారు పాలను తాగకూడదని ఆరోగ్య  నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పాలను ఎక్కువగా తాగడం వల్ల కొంతమందికి కాలేయం వాపు, ఫైబ్రాయిడ్లు ( fibroids) సమస్య వస్తుందని చెబుతున్నారు. ఇలాంటి వారు పాలు తాగకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

59

ఫ్యాటీ లివర్.. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు పాలను అస్సలు తాగకూడదు. ఈ సమస్య ఉన్నవారు పాలను తాగితే వారికి జీర్ణం తొందరగా అవదు. ముఖ్యంగా ఈ ఫ్యాటీ లీవర్ సమస్య ఉన్నవారు ప్రోటీన్ ఫుడ్ ను పరిమితిగానే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీరు పాలను తాగితే గ్యాస్, ఎసిడిటీ, అజీర్థి,అలసట, సోమరితనం, బరువు పెరగడం లేదా బరువు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. 

69

గ్యాస్ సమస్య.. పాలలో ఎక్కువ మొత్తంలో లాక్టోస్ ఉంటుంది. ఇది జీవక్రియను దెబ్బతీసే ప్రమాదం ఉంది. దీంతో పాలను తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి గాస్ సమస్యతో బాధపడుతున్నవారు పాలను తాగకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 

79

అలెర్జీలు.. పాలను తాగడం వల్ల కూడా కొందరికి అలెర్జీలు వస్తుంటాయి. దీనికి కారణంగా పాలలో ఉండే లాక్టోస్ యే. ఇది రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీంతోనే చర్మంపై ఎర్రని దద్దుర్లు, దురద , వాపు వంటి సమస్యలు వస్తాయి. అలాగే శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అలెర్జీలు సమస్యలు ఉన్న వారు పాలను తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 

89
obesity

ఊబకాయం.. ఊబకాయం సమస్యతో బాధపడేవారు పాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే పాలు సంపూర్ణ ఆహారం. పాలను తాగడం వల్ల శరీరంలో కొవ్వులు మరింత పెరిగే అవకాశం ఉంది. 

99

చర్మ సమస్యలు.. పాలను ఎక్కువగా తాగితే చర్మ సమస్యలు కూడా వచ్చే అకాశం ఉంది. పాలను మోతాదుకు మించి తాగితే ముఖంపై మొటిమలు ఏర్పడుతాయి. కాబట్టి వీటిని పరిమితిలోనే తాగాల్సి ఉంటుంది. 

click me!

Recommended Stories