ఆడవాళ్లు ఇందుకే ఊబకాయం బారిన పడుతున్నారు..

Published : Dec 20, 2022, 11:46 AM IST

ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే  బరువు పెరిగే అవకాశం ఉండదు. ఈ అలవాట్ల వల్ల బరువు కూడా సులువుగా తగ్గుతారు.   

PREV
17
ఆడవాళ్లు ఇందుకే ఊబకాయం బారిన పడుతున్నారు..

ఈ మధ్యకాలంలో ఊబకాయం ఒక అంటువ్యాధిగా మారిపోయింది. అభివృద్ధి చెందిన దేశాలలో సుమారుగా 1.5  మిలియన్ల అధిక బరువున్న పెద్దలు ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇక దీనిలో 300 మిలియన్ల మంది ఆడవారే ఉన్నారట. ఊబకాయం ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. ముఖ్యంగా స్లీప్ అప్నియా, అధిక రక్తపోటు, డయాబెటీస్, ఎన్నో రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు, స్ట్రోక్, సంతానోత్పత్తి, అధిక కొలెస్ట్రాల్, గర్భధారణ సమస్యలు, శ్వాసకోస సమస్యలకు దారితీస్తుంది. ఈ ఊబకాయం వారినే కాదు వారి కుటుంబాన్ని కూడా దెబ్బతీస్తుంది. అసలు ఆడవారు ఊబకాయం బారిన పడటానికి కారణం ఏంటి..? దీన్ని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

27

నిశ్చల జీవన శైలి

ఊబకాయానికి దారితీసే కారకాల్లో నిశ్చల జీవన శైలి ఒకటి. శారీరక శ్రమ మొత్తమే లేకపోవడం, శరీరం కదలక పోవడం వల్లే నేడు ఎంతో మంది  ఆడవారు ఊబకాయం బారిన పడుతున్నారు. ఎక్కువ సేపు కదలకుండా ఒకే దగ్గర కూర్చోవడం, పనిచేయకపోవడం వల్ల శరీరంలో ఫ్యాట్ పేరుకుపోతుంది. బరువు కూడా బాగా పెరిగిపోయి ఊబకాయం బారిన పడతారు. 
 

37

అనారోగ్యకరమైన ఆహారాలను తినడం

బరువు పెరగడానికి దారితీసే కారకాల్లో ఫుడ్ కీలక పాత్ర పోషిస్తుంది. నిజానికి మన శరీరానికి ఫుడ్ చాలా చాలా అవసరం. తగినంత ఆహారం తీసుకుంటేనే మన శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. వీటితోనే మన శరీరం సక్రమంగా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారంలో ఈ పోషకాలుంటాయి. కానీ నేడు చాలా మంది ఆరోగ్యాన్ని పాడు చేసే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ నే ఎక్కువగా తింటున్నారు. ఈ ఆహారాల్లో కేలరీలు, ఫ్యాట్, ఉప్పు, చక్కెరలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీర బరువు మరింత  పెరిగేలా చేస్తాయి. ఆల్కహాల్, శీతల పానీయాలు కూడా ఊబకాయానికి దోహదం చేస్తాయి. 
 

47

జన్యుపరంగా

కుటుంబ సభ్యుల్లో అంటే తల్లిదండ్రుల నుంచి కూడా పిల్లలు ఊబకాయానికి గురయ్యే అవకాశం ఉంది. ఊబకాయానికి జెనెటిక్స్ కూడా ఒక కారణమే. ఇలాంటి ఊబకాయాన్ని రాకుండా ఆపలేం. కానీ వ్యాయామం చేస్తే బరువు నియంత్రణలో ఉంటుంది. ఇతర అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 
 

57

హార్మోన్ల అసమతుల్యత

ఒత్తిడి, ఆందోళన, తగినంత నిద్రలేకపోవడం వంటి కారణాల వల్ల హార్మోన్ల అసమతుల్యత కలుగుతుంది. దీనివల్ల కొందరు అతిగా తింటుంటారు. దీనివల్ల కూడా బరువు ఎక్కువగా పెరిగిపోతారు. 
 

67

ముందులు

బీటా బ్లాకర్స్, స్టెరాయిడ్స్, యాంటీ సీజర్, యాంటీ డిప్రెసెంట్స్ మందులు, డయాబెటీస్ మందులు వంటి కొన్ని రకాల ముందు బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తాయి.  ఇలాంటి మెడిసిన్స్ ను యూజ్ చేసే అడవారు బరువు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. 
 

77

ఊబకాయాన్ని తగ్గించుకోవాలనుకుంటే.. కేలరీలను తీసుకోవడం చాలా తగ్గించాలి. శారీరక శ్రమ బాగా పెంచాలి. లేదా ఈ రెండూ అవసరం కావొచ్చు. అయితే ఏదైనా మార్పులు చేసే ముందు డాక్టర్ సలహాను తీసుకోవడం చాలా మంచిది. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ కు బదులుగా ఫైబర్ కంటెంట్ ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోండి. ప్రోటీన్ ఫుడ్ మీరు బరువు తగ్గేందుకు బాగా సహాయపడుతుంది. రోజూ 30 నిమిషాలైనా ఖచ్చితంగా వ్యాయామం చేయండి. ఇవి మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories