11,000 మందికి పైగా.. 30 సంవత్సరాల కంటె ఎక్కువ ఆరోగ్య డేటాను పరిశోధన కోసం ఉపయోగించారు. సాధారణ సీరం సోడియం స్థాయి లీటరుకు 135 -146 మిల్లీవాలెంట్స్. సీరం సోడియం స్థాయిలు 142 కంటే ఎక్కువ ఉన్నవారికి గుండెపోటు, స్ట్రోక్, రక్తనాళాల వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధి, డయాబెటిస్, చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం ఉందని కనుగొనబడింది. సీరం సోడియం స్థాయిలను ప్రభావితం చేసే ఇతర అంశాలు వయస్సు, లింగం, ధూమపానం, అధిక రక్తపోటు అని పరిశోధకులు తెలిపారు.