actor Madhavan
హీరోగా, విలన్ గా, ఎన్నో పాత్రల్లో మాధవన్ నటిస్తూ వస్తున్నారు. మాధవన్ ఒక్క తెలుగు సినిమాల్లోనే కాకుండా.. హిందీ, కన్నడ, ఇంగ్లీష్ తో పాటుగా ఎన్నో భాషల్లో నటించారు.ఈ హీరో నటించిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
Director Madhavan
అయితే 2022 లో మాధవన్ 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో మాధవన్ శాస్త్రవేత్త నంబి నారాయణన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం మాధవన్ బాగాబరువు పెరిగారు. ఆ తర్వాత బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే సోషల్ మీడియాలో మాధవన్ 21 రోజుల్లో తాను ఎలా బరువు తగ్గారో తెలియజేశారు. జస్ట్ 21 రోజుల్లో పెరిగిన బరువును తగ్గించుకోవడం సాధ్యం కాదన్న ముచ్చట అందరికీ తెలిసిందే. కానీ ఈ హీరో ఎలా తగ్గించుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Madhavan
మాధవన్ 21 రోజుల్లో ఎలా బరువు తగ్గారంటే.. ఈయన బరువు తగ్గడానికి అడపాదడపా ఉపవాసం చేస్తారు. అలాగే ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. మాధవన్ ఆహారాన్ని కనీసం 45 నుంచి 60 సార్లు నమిలి మింగుతారట. అలాగే రోజులు తన చివరి భోజనం సాయంత్రం 6:45 లకే ముగుస్తుందట. అది కూడా ఇంట్లో వండిని ఆహారాన్నే తింటారట. ఈ హీరో బయటి ఫుడ్ ను అస్సలు తినరట.
బరువు తగ్గాలంటే వీలైనంత ఎక్కువ సేపు ఉదయం నడవాలంటాడు మాధవన్. అలాగే రాత్రి పడుకోవడానికి కనీసం గంటన్నర ముందు మీ సెల్ ఫోన్లు, టీవీ, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను దూరంగా ఉంచడాలంటాడు. ఇకపోతే మాధవన్ మధ్యాహ్నం పూట పచ్చి కూరగాయలను ఎక్కువగా తింటారట. ఈ డైటే అతన్ని కేవలం 21 రోజుల్లో బరువు తగ్గించిందని మాధవన్ సోషల్ మీడియాలో చెప్పారు.