పిల్లలు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా?

First Published | May 30, 2024, 5:02 PM IST

కొంతమంది పిల్లలు రోజంతా నిద్రపోతుంటారు. మరికొంతమంది పిల్లలు కొద్ది సేపు మాత్రమే పడుకుంటుంటారు. అర్థరాత్రి ఏ 11, 12 గంటలకో నిద్రపోయి మళ్లే ఉదయం 4, 5 గంటలకే నిద్రలేస్తుంటారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే పిల్లలు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా?

నిద్ర మన ఆరోగ్యానికి చాలా చాలా అవసరం. మన  శరీరానికి ఆహారం ఎంత అవసరమో నిద్రకూడా అంతే అవసరం. ఎందుకంటే నిద్రతోనే శరీరం తిరిగి శక్తివంతంగా మారుతుంది. అలసట తగ్గుతుంది. నిద్ర మన శరీరానికి శక్తి వనరనే చెప్పాలి. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి టీనేజ్ పిల్లల వరకు ఎవరు ఎంత సేపు నిద్రపోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

నవజాత శిశువు

మీరు గమనించారో లేదో కానీ నవజాత శిశువులు బాగా నిద్రపోతారు. నిపుణుల ప్రకారం.. నవజాత శిశువులకు రోజుకు 12 నుంచి 18 గంటల నిద్ర అవసరం. వీళ్లకు తల్లి పాలు, నిద్రే శక్తి వనరులు. 
 

Latest Videos


2 నెల నుంచి 12 నెలల వరకు

రెండు నెలల నుంచి 12 నెలల వయస్సు ఉన్న శిశువులు రోజుకు 14 నుంచి 15 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీళ్లు ఇన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారు.
 

Image: Getty

1 నుంచి  3 సంవత్సరాలు

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఒకటి నుంచి మూడు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు రోజుకు 12-14 గంటలు నిద్రపోవాలి.

3 - 6 సంవత్సరాలు

మూడు నుంచి ఆరేండ్ల పిల్లలకు రోజుకు 11 నుంచి 13 గంటల నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

Image: Getty

7 - 12 సంవత్సరాలు

7 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సున్న  పిల్లలు రోజుకు 10 నుంచి 11 గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు.

13 - 19 సంవత్సరాలు

13 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల టీనేజర్లకు ప్రతిరోజూ 8.5 నుంచి 9.5 గంటల నిద్ర అవసరమవుతుంది. ఇది  వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది.

click me!