వర్షాకాలం వచ్చింది అంటే చాలు.. ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు.. దోమలు మాత్రం వచ్చేస్తాయి. ఆ వచ్చిన దోమలు ఊరకనే ఉంటాయా.. కుట్టేస్తాయి. ఇక.. దోమలు కుడితే వచ్చే సమ్యలు అన్నీ ఇన్నీ కావు. అది సాధారణ దోమ కాకుండా డెంగ్యూ, మలేరియా వ్యాపించే దోమలు అయితే.. ప్రాణానికే ప్రమాదం.
ఈ వర్షాకాలంలో దోమల బెడద నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. ఈ దోమలుు ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రదేశంలో, చెత్త ఎక్కువగా పేరుకుపోయిన ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటాయి. ఇక.. దోమలు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే.. ఈ కింది రెమిడీలు ఫాలో అయితే మాత్రం.. దోమలు ఇంట్లో రాకుండా ఆపవచ్చట. అదెలాగో చూద్దాం...
ఈ వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉండటం వల్ల మనకు డెంగ్యూ,మలేరియాయ వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వాపిస్తాయి. వాటి వల్ల ప్రాణాలకు ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టిల.. వీటి నుంచి తప్పించుకోవడానికి, దోమల నుంచి మనల్ని మనం రక్షించుకోవడం చాలా ముఖ్యం.
దోమల కాటు నుండి తప్పించుకోవడానికి మన ఇళ్లలో రసాయనాలతో కూడిన దోమల నివారణ మందులను ఉపయోగిస్తాము. కానీ అవి ఆరోగ్యానికి హానికరం. కాబట్టి వీలైనంత వరకు సహజ పద్ధతిలో వాటిని తరిమికొట్టడమే మంచిది. కానీ అది ఎలాగో మీకు తెలియదా? అందుకే వర్షాకాలంలో ఇంట్లో ఉండే దోమలను సహజ పద్ధతిలో తరిమికొట్టడానికి కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం...
వర్షాకాలంలో దోమల నివారణ చిట్కాలు
సహజ పద్ధతిలో దోమలను తరిమికొట్టడానికి కొన్ని చిట్కాలు:
1. సాంబ్రాణి & కర్పూరం
వర్షాకాలంలో ఉదయం , సాయంత్రం రెండు సమయాల్లో సాంబ్రాణితో పాటు కొద్దిగా కర్పూరం కలిపి దాని పొగను ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయండి. ఈ పొగ నుండి వచ్చే వాసన ద్వారా దోమలు ఇంట్లోకి రాకుడా ఉంటాయి. ఇల్లు మొత్తం సువాసనతో నిండిపోతుంది. కేవలం సాంబ్రాణి పొగ వల్ల కూడా దోమలు రావు.
2. యూకలిప్టస్ ఆకులు
దోమలను తరిమికొట్టడానికి యూకలిప్టస్ ఆకులు సహాయపడతాయి. ఎలాగంటే, యూకలిప్టస్ ఆకులను బాగా ఆరబెట్టి, వాటిని కాల్చి దాని పొగను ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఇక దోమల బెడద ఉండదు.
3. నిమ్మకాయ & లవంగాలు
నిమ్మకాయను సగానికి కోసి అందులో లవంగాలను పెట్టి ఇంట్లో అక్కడక్కడ ఉంచితే, దాని నుండి వచ్చే ఘాటైన వాసన వల్ల దోమలు ఇంట్లో ఉండవు.
4. ఆవు పేడ
ఆవు పేడను కాల్చడం ద్వారా దాని నుండి వచ్చే పొగ వల్ల దోమలు మాత్రమే కాకుండా ఈగలు, ఇతర కీటకాలు కూడా ఇంట్లోకి రావు. సహజ పద్ధతిలో దోమలను తరిమికొట్టడానికి ఇది ఒక చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు.
వర్షాకాలంలో దోమల నివారణ చిట్కాలు
5. కర్పూరం
కర్పూరాన్ని కాల్చి దాని పొగను ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయండి. అలాగే కర్పూరాన్ని ఒక గ్లాసులో వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉంచితే దాని సువాసనకు దోమలు ఇంట్లో నుండి పారిపోతాయి. కావాలంటే మీరు కర్పూరాన్ని పొడి చేసి దానిని ఇంట్లో అక్కడక్కడ వేసి ఉంచినా దోమలు ఇంట్లోకి రావు.
ముఖ్య గమనిక: శ్వాసకోశ సమస్యలు మరియు ఆస్తమా సమస్య ఉన్నవారు ఇంట్లో పొగ పెట్టకుండా ఉండటం మంచిది.