ముకేష్, నీతా అంబానీలకు డిన్నర్ లో కచ్చితంగా ఉండాల్సింది ఏంటో తెలుసా?

First Published | Jun 13, 2024, 5:10 PM IST

ముకేష్, నీతా అంబానీలు.. తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట. ఆరోగ్యకరమైన ఆహారాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారట.


ముకేష్ అంబానీకి పరిచయం అవసరం లేదు. దేశంలోనే అత్యంత సంపన్నుడుగా.. ఆయన అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఆయన తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిని అట్టహాసంగా జరిపిస్తున్నాడు. వచ్చే నెల జులైలో పెళ్లి ఉండగా... ప్రీ వెడ్డింగ్ వేడుకలు చేస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి ఈ వేడుకలు పూర్తవ్వగా.. రెండోసారి ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహిస్తున్నారు.
 

ఈ నేపథ్యంలో.. ముకేష్ అంబానీ కుటుంబం తరచూ వార్తల్లో నిలుస్తోంది. కాగా.. వారి లైఫ్ స్టైల్, వారి ఆహారపు అలవాట్లు హాట్ టాపిక్ గా మారాయి. ఎంత కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా.. వారి ఫుడ్ చాలా సింపుల్ గా ఉంటుందట. 
 



ముకేష్, నీతా అంబానీలు.. తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట. ఆరోగ్యకరమైన ఆహారాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారట. వారికి అంటూ ఇంట్లో స్పెషల్ గా చెఫ్ లు ఉంటారు.  వారితో స్వయంగా వంట చేయించుకొని తింటూ ఉంటారు. అయితే.. వారు తినే ఆహారం వీలైనంత వరకు చాలా తక్కువ కేలరీలతో నిండి ఉంటుందంట.

ముకేష్ అంబానీ గొప్ప బిజినెస్ మెన్. ఆయన రోజంతా బిజీగా ఉంటారు. అయితే.. ఎంత బిజీగా ఉన్నా.. రాత్రి భోజనం మాత్రం భార్య నీతా అంబానీతో కలిసి చేస్తారట.  కచ్చితంగా ఇంటి భోజనమే చేస్తారట. ఇక వీరికి రాత్రి భోజనంలో తప్పనిసరిగా గుజరాతీ స్టైల్ పప్పు ఉండాల్సిందేనట. అంబానీ దంపతులు రోజూ ఈ ఐటమ్‌ని డిన్నర్‌కి మిస్ అవ్వరు. ముఖేష్ అంబానీ స్వస్థలం గుజరాత్. కాబట్టి వారు విందులో తప్పనిసరిగా గుజరాతీ స్టైల్ పప్పు తీసుకోవడం అలవాటు అంట. 
 

రాజ్మా కర్రీ , దాల్‌తో పాటు నీతా , ముఖేష్ అంబానీల ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ ఆండ్రీ రోటీ. ముకేశ్ అంబానీకి సేవ్ పూరీ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా రోడ్ల పక్కన సెవ్ పూరీని రుచి చూడటానికి ఇష్టపడతారు. నీతా , ముఖేష్ ఇద్దరూ ముంబయి ప్రత్యేకమైన దహీ బటాటా పూరీని రుచి చూడటానికి ఇష్టపడతారు.

Latest Videos

click me!