ఇషా, ఆకాష్, ఆనంత్.. ముఖేష్ అంబానీ ఎవరి పెళ్లికి ఎక్కువ ఖర్చు చేశారో తెలుసా?

First Published | Sep 10, 2024, 4:53 PM IST

ఇండియాలో ఎంతో రిచ్ అయిన ముఖేష్ అంబానీ తన పిల్లల పెళ్లిళ్లు ఎంతో అంగరంగ వైభవంగా జరిపించిన సంగతి తెలిసిందే. కానీ ఎవరి పెళ్లికి ఎక్కువ ఖర్చు చేశాడన్న సంగతి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. 

అంబానీ కుటుంబం

ముఖేష్ అంబానీ ఇండియాలో ఎంత పెద్ద కోటీశ్వరుడో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ  కోటీశ్వరుడి నికర విలువ రూ. 7.65 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ముఖేష్ అంబానీ రిలయన్స్‌ను ఇండియాలో అత్యంత శక్తివంతమైన సంస్థల్లో ఒకటిగా నడిస్తున్నాడు. 

ముఖేష్ అంబానీ, నీతా అంబానీ

ముఖేష్ అంబానీ నాయకత్వంలో.. రిలయన్స్ ఫిబ్రవరి 2024లో రూ. 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను చేరుకున్న మొదటి భారతీయ కంపెనీగా చరిత్రలో నిలిచింది.

ముఖేష్ అంబానీ నీతా అంబానీని 1985లో వివాహం చేసుకున్నారు. ఈ జంటలకుఇషా, ఆకాష్, ఆనంత్ ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ముగ్గురి పెళ్లిళ్లను ముఖేష్, నీతా అంబానీలు ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు. కానీ వీరు తమ పిల్లల పెళ్లిళ్లు చేసిన ప్రతిసారి వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అంటే ఇంత ఖర్చు చేశారు. అంత ఖర్చు చేశారని. మరి ముఖేష్ అంబానీ ఎవరి పెళ్లికి ఎంత ఖర్చు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


ఇషా అంబానీ వివాహం

అంబానీ ఏకైక కూతురు ఇషా అంబానీని ముఖేష్ అంబానీ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ పిరమల్‌ కు ఇచ్చి 2018 డిసెంబర్‌లో వివాహం  జరిపించారు. ఇషా వివాహ వేడుకలు..ఇటలీ నుంచి మొదలయ్యాయి. ఈమె నిశ్చితార్థం ఇటలీలో జరిపించారు. ఉదయ్‌పూర్‌లో ప్రీ-వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. వీళ్ల పెళ్లి ముంబైలోని వారి నివాసం అయిన ఆంటిలియాలో ఎంతో ఘనంగా జరిగింది. 

వీరి పెళ్లికి బియాన్సే వంటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. విలాసవంతమైన  ఆహ్వానాలు, ప్రదర్శనలతో పాటుగా ఈ పెళ్లికి ఏకంగా రూ. 830 కోట్లు దాటిందని అంచనా. ఇది భారతదేశ చరిత్రలో అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా మిగిలింది. 

ఆకాష్ అంబానీ వివాహం

ఇకపోతే ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాలు 2019 మార్చిలో పెళ్లి పీఠలు ఎక్కారు. వీరి పెళ్లి కూడా ఎంతో వైభవంగా జరిగింది. వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు స్విట్జర్లాండ్‌లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ముంబైలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి.

ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాల పెళ్లికి టెక్ దిగ్గజాలు, రాజకీయ నాయకులతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హాజరయ్యారు. మీకు తెలుసా? వీరి ఒక్క పెళ్లి పత్రిక ఖరీదు 10 వేల రూపాయలు.. దీనికోసం ఆహ్వానితుల కోసం వీరు ఏకంగా రూ. 1.5 లక్షలు ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఆకాష్ అంబానీ-శ్లోకా మెహతా పెళ్లి వేడుకకు సుమారుగా రూ. 1200 కోట్లు ఖర్చయిందని అంచనా.

ఆనంద్ అంబానీ రాధిక మర్చెంట్

ఆసియాలోనే  అత్యంత సంపన్నులలో ఒకరైన ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు తమ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి బాగా ఖర్చు చేశారని సమాచారం. వీరి పెళ్లి వేడుక ఏ రేంజ్ లో జరిగిందో మనం టీవీ, ఫోన్లలో చూసాం.వీరి ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ వేడక జామ్‌నగర్‌లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో రిహన్నా, ఎల్టన్ జాన్, తిల్జిత్ దోసాంజ్ వంటి అంతర్జాతీయ తారలు సందడి చేశారు. 

అనంత్ అంబానీ పెళ్లి వేడుక మార్చిలో ప్రారంభమైంది. వీరి వివాహ వేడుకల్లో బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్‌తో పాటుగా ఎంతో మంది అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్నారు. వీరి రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక జూన్‌లో ఇటలీ నుంచి ఫ్రాన్స్‌కు విలాసవంతమైన యాత్రతో జరిగాయి. ఈ వేడుకకు కూడా ప్రముఖులు హాజరయ్యారు. 

ఆనంద్ అంబానీ-రాధిక మర్చెంట్ పెళ్లి వేడకకు అంతర్జాతీయ తారలకు చెల్లించిన కోట్ల రూపాయల పారితోషికంతో కలిపి మొత్తంగా ఈ వేడుకకు దాదాపు రూ. 5,000 కోట్లు ఖర్చయిందని అంచనా. ఈ సంఖ్య ప్రిన్సెస్ డయానా, ప్రిన్స్ చార్లెస్ వివాహానికి అయిన ఖర్చు రూ. 1,361 కోట్లను మించిపోవడంతో, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది. 

జామ్‌నగర్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు రిహన్నాకు రూ. 74 కోట్లు ఇచ్చారు. సంగీత్ కార్యక్రమంలో పాల్గొన్న  జస్టిన్ బీబర్‌కు రూ. 83 కోట్లు చెల్లించారు. ఈ వేడుకలకు అయిన భారీ ఖర్చులో ఇవి కొన్ని మాత్రమే. అతిథుల కోసం విలాసవంతమైన ప్రైవేట్ జెట్‌లు, భారీ భద్రతా ఏర్పాట్లతో సహా ప్రీ-వెడ్డింగ్ వేడుకల కోసం మరో రూ. 2,500 కోట్లు ఖర్చయిందని అంచనా.

Latest Videos

click me!