వర్షాకాలంలో ఇంట్లో పురుగుల బెడదా..? ఇలా తరిమికొట్టండి..!

First Published | Jul 26, 2024, 11:26 AM IST

ముఖ్యంగా వంట గదిలోకి.. బొద్దింకలు, కబోర్డ్స్ కి చెదలు, ఇంట్లో మొత్తం దోమలు తిరుగుతూనే ఉంటాయి.  వీటి కారణంగా.. ఇల్లు పాడవ్వడమే కాదు.. మనకు ఆరోగ్య సమస్యలను కూడా తెచ్చి పెడుతుంది. 

Pest Control

వర్షాకాలం వచ్చింది అంటే  చాలు.. వాతావరణం ఆహ్లాదంగా మారుతుంది. కానీ.. వర్షాల కారణంగా భూమి బాగా నానుతుంది. దాని కారణంగా భూమిలోపల ఉండే.. పురుగులు, కీటకాలు మొత్తం బయటకు వచ్చేస్తాయి. అవి.. ఇంట్లోకి ప్రవేశించి.. మన ఇంటిని నాశనం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా వంట గదిలోకి.. బొద్దింకలు, కబోర్డ్స్ కి చెదలు, ఇంట్లో మొత్తం దోమలు తిరుగుతూనే ఉంటాయి.  వీటి కారణంగా.. ఇల్లు పాడవ్వడమే కాదు.. మనకు ఆరోగ్య సమస్యలను కూడా తెచ్చి పెడుతుంది. 

Image: Getty

వర్షాకాలంలో.. అనేక తెగుళ్లు వ్యాప్తి చెందుతాయి. నిలిచిన నీటిలో వృద్ధి చెందే దోమలు డెంగ్యూ జ్వరం, మలేరియా , చికున్‌గున్యా వంటి వ్యాధులను వ్యాప్తి చేయడంలో పేరుగాంచాయి. బొద్దింకలు, తడిగా ఉన్న పరిస్థితుల్లో వృద్ధి చెందుతాయి. వీటి కారణంగా అలర్జీలు వస్తూ ఉంటాయి

Latest Videos


చెక్క నిర్మాణాలలో తేమ కారణంగా.. చెదపురుగులు మీ ఇంటికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. మరి ఇవన్నీ రాకుండా ఉండాలంటే... మీ ఇంటితోపాటు.. మీ ఆరోగ్యం కూడా సరిగా ఉండాలి అంటే.. వీటిని తరిమికొట్టాలి. మరి.. వీటిని ఇంట్లోకి ప్రవేశించకుండా... ఒకవేళ ప్రవేశించినా.. వాటిని ఈజీగా తరిమికొట్టాలంటే ఏం చేయాలో ఓసారి చూద్దాం...

ప్రొఫెషనల్స్ సహాయం..
మీకు ఇంట్లో బొద్దింకలు, చెదలు లాంటి సమస్య వచ్చినా.. వచ్చేలా ఉందని అనుమానం వచ్చినా.. మీరు ప్రొఫెషనల్ పెస్ట్ కంట్రోల్ సేవలను పొందవచ్చు. మార్కెట్లో చాలా మంది ప్రొఫెషనల్స్  ఉన్నారు. మీరు వారి సహాయంతో.. పెస్ట్ కంట్రోల్  చేయించుకోవచ్చు. ఇలా చేయించుకోవడం వల్ల.. క్రిమికీటకాల బెడద నుంచి బయటపడొచ్చు. 

ఇలాంటి ప్రొఫెషనల్స్  అవసరం లేకపోయినా.. మన ఇంటి చిట్కాలతో కూడా వాటిని ఈజీగా తరిమికొట్టవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
 

చీడలను దూరంగా ఉంచడానికి, చీమలను అరికట్టడానికి వెనిగర్, ఎలుకలను తిప్పికొట్టడానికి పిప్పరమెంటు నూనె లేదా కీటకాలను చంపడానికి డయాటోమాసియస్ ఎర్త్ వంటి ఇంటి నివారణలను ప్రయత్నించండి. అదనంగా, మీరు దోమలను తిప్పికొట్టడానికి సిట్రోనెల్లా , బొద్దింకలను పరిష్కరించడానికి బోరాక్స్ ఉపయోగించవచ్చు.
 

click me!