ఉదయమా, సాయంత్రమా? బరువు తగ్గడానికి ఎప్పుడు వాకింగ్ చేస్తే బెటర్

First Published | Sep 5, 2024, 4:40 PM IST

మార్నింగ్ వర్సెస్ ఈవెనింగ్ వాకింగ్: బరువు తగ్గడానికి కొంతమంది ఉదయాన్నే వాకింగ్ చేస్తే మరికొంతమంది సాయంత్రం వేళ వాకింగ్ కు వెళుతుంటారు. కానీ బరువు తగ్గడానికి వాకింగ్ ఎప్పుడు బెటరో తెలుసా? 

నేటి ఉరుకుల పరుగుల జీవితాల్లో చాలా మందికి వ్యాయామం చేయడానికి కూడా టైం దొరకడం లేదు. కానీ మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి రోజూ అరగంటైనా వ్యాయామం చేయాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. 

అయితే వ్యాయామం చేయలేనివారు పక్కాగా రోజూ 45 నిమిషాలు నడవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కానీ బరువు తగ్గాలంటే ఉదయం వాకింగ్ చేయాలా? సాయంత్రం చేయాలా? అని చాలా మందికి డౌట్ వస్తుంటుంది. మరి దీనికి నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

మార్నింగ్ వాక్  ప్రయోజనాలు

మార్నింగ్ వాకింగ్ మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఉదయపు వాకింగ్ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలలో ఒకటి జీవక్రియపై  మంచి ప్రభావం పడటం.

ఉదయాన్నే చురుకైన నడక మీ జీవక్రియను ప్రారంభించడానికి సహాయపడుతుంది. ఇది మీ శరీరం రోజంతా కేలరీలను ఎక్కువగా బర్న్ చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా బరువును నియంత్రించుకోవాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.

ఉదయాన్నే ఎండలో  నడవడం వల్ల మీ శరీరానికి అవసరమైన విటమిన్ డి కూడా అందుతుంది. ఇది మీ ఎముకలను బలంగా ఉంచుతుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ డి పొందడానికి ఇదొక సహజ మార్గం. 

ఉదయపు నడక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎండార్ఫిన్లను రిలీజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మార్నింగ్ వాక్ నేచురల్ మూడ్ బూస్ట్ గా కూడా పనిచేస్తుంది. శారీరక శ్రమతో రోజును స్టార్ట్ చేయడం వల్ల మీ మానసిక స్పష్టత, దృష్టి, మొత్తం ఉత్పాదకత మెరుగుపడుతుంది.


ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లడం వల్ల మీరు నిద్రపోయే. మేల్కొనే చక్రాలు కూడా నియంత్రణలో ఉంటాయి. ఇది మీరు ఉదయాన్నే రీఫ్రెష్ గా మేల్కొవడానికి సహాయపడుతుంది. మీ నిద్రను మెరుగుపరుస్తుంది. మొత్తంగా ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

సాయంత్రం నడక వల్ల కలిగే ప్రయోజనాలు

ఇకపోతే సాయంత్రపు నడక కూడా మీకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. వాకింగ్ తో మీ రోజును ఎండ్ చేయాలనుకుంటే ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. పని, బాధ్యతలతో నిండిన ఒక రోజు తర్వాత, సాయంత్రం నడక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది విశ్రాంతి తీసుకోవడానికి, మీ మనస్సును క్లియర్ చేయడానికి, రోజు అవసరాల నుంచి మరింత రిలాక్స్డ్ గా ఉండటానికి సహాయపడుతుంది. 

సాయంత్రపు నడక వల్ల మీ కండరాల బలం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే శారీరక పనితీరును మెరుగుపరుచుకోవాలనుకుంటే సాయంత్రపు నడక బాగా సరిపోతుంది.

సాయంత్రపు వాకింగ్ సమయంలో మీ కండరాలు మరింత స్పందిస్తాయి. అలాగే సాయంత్రం ఫ్రెండ్స్ లేదా పొరుగువారితో వాకింగ్ చేస్తే సమాజ భావన పెరుగుతుంది. ఇది మీ మొత్తం శ్రేయస్సుకు దోహదం చేస్తుంది.

రోజు గడిచేకొద్దీ వాయు కాలుష్యం తగ్గి సాయంత్రం స్వచ్ఛమైన గాలి ఉంటుంది. మీరు నగరం లేదా రద్దీ ప్రాంతంలో నివసిస్తున్నట్టైతే సాయంత్రపు నడకే బెస్ట్. ఎందుకంటే ఇది మీకు తాజా గాలి అందేలా చేస్తుంది. మీ శ్వాసకోశ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇకపోతే వాకింగ్ కు ఎప్పుడు బెస్ట్ టైం అంటే.. మీ వ్యక్తిగత ప్రాధాన్యతలు, షెడ్యూల్, ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది మార్నింగ్ నడక ప్రశాంతతను కలిగిస్తుంది. మరికొందరికి సాయంత్రం నడక బాగా అనిపిస్తుంది. 

వాకింగ్ కు సరైన టైంను నిర్ణయించేటప్పుడు మీ స్వంత సిర్కాడియన్ రిథమ్, రోజువారీ పనులు, వ్యాయామ లక్ష్యాలను పరిగణించండి.అలాగే  మీరు ఉదయం లేదా సాయంత్రం సమయాన్ని ఎంచుకున్నప్పటికీ, మీ సాధారణ వ్యాయామంలో క్రమం తప్పకుండా శారీరక శ్రమను చేర్చడం చాలా ముఖ్యమైన అంశం అని గమనించడం ముఖ్యం.

Latest Videos

click me!