floor cleaning
ప్రతి ఒక్కరూ ఇంటిని నీట్ గా, అందంగా ఉంచుకుంటారు. ఇందుకోసం రోజూ ఊడ్చి, తుడుస్తుంటారు.దీనివల్ల ఇళ్లు శుభ్రంగా, నీట్ గా ఉంటుంది. కానీ దీనివల్ల మీ ఇంట్లో వింత వాసన మాత్రం పోదు. ఇంటిని తుడవడం వల్ల నీట్ గా కనిపించినా.. మంచి సువాసన మాత్రం రాదు. కానీ మీరు గనుక కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం మీ ఇంట్లో మల్లెపూల వాసన వస్తుంది. దీనికోసం మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయక్కర్లేదు. మరి ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నిమ్మరసం
నిమ్మరసం మన శరీరాన్ని రీఫ్రెష్ గా ఉంచడమే కాకుండా మన ఇంట్లో తాజా వాసన వచ్చేలా కూడా చేస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా మోప్ నీటిలో అరకప్పు నిమ్మరసం వేసి కలపండి. దీనితోనే ఇంటిని తుడవండి. నిమ్మకాయ మీ ఇంట్లో రోజంతా తాజా వాసన వచ్చేలా చేస్తుంది. రోజంతా మీ ఇల్లు మొత్తం నిమ్మ పరిమళంతో నిండిపోతుంది. దీనితో పాటుగా నిమ్మకాయ ఫ్లోర్ ను చాలా లోతుగా శుభ్రపరుస్తుంది. అలాగే అలాగే నేలపై పేరుకుపోయిన మురికిని, క్రిములను కూడా తొలగిస్తుంది. అలాగే ఫ్లోర్ పై ఈగలు కూడా ఆలవు. అందుకే ప్రతిరోజూ దీన్ని చేయకపోయినా కనీసం వారానికి ఒకసారైనా నిమ్మరసంతో ఇంటిని తుడవండి.
బేకింగ్ సోడా
బేకింగ్ సోడాను వంటలకు బాగా ఉపయోగిస్తారు.కానీ దీనిని ఉపయోగించి మీ ఇంట్లో కమ్మని వాసన వచ్చేలా కూడా చేయొచ్చు. అవును బేకింగ్ సోడా మూలల నుంచి చెడు వాసనలను తొలగించడానికి, ఫ్లోర్ ను బాగా శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మాప్ నీటిలో గుప్పెడు బేకింగ్ సోడాను వేయడమే. ఆ తర్వాత ఫ్లోర్ తలతల మెరవడమే కాకుండా తాజా వాసన కూడా వస్తుంది.
వెనిగర్
వంటింట్లో ఉండే వెనిగర్ కూడా మీ ఇంట్లో మంచి వాసన రావడానికి కూడా సహాయపడుతుంది. మోపింగ్ చేసేటప్పుడు నీటిలో రెండు నుంచి మూడు టీస్పూన్ల వెనిగర్ ను వేసి కలపండి. వెనిగర్ నేలను బాగా శుభ్రపరుస్తుంది. ఇది నేలపై ఉన్న మరకలను, మచ్చలను, సూక్ష్మక్రిములను తొలగిస్తుంది. దీనితో పాటుగా ఇది ఇంట్లో మంచి సువాసన వచ్చేలా చేస్తుంది. అలాగే రోజంతా మీ ఇల్లు ఫ్రెష్ గా ఉంటుంది.
ముఖ్యమైన నూనెలు
కొన్ని నూనెలతో కూడా మీ ఇంటిని శుభ్రంగా, మంచి వాసన వచ్చేలా చేయొచ్చు. దీని కోసం మీరు ఎలాంటి హడావుడి చేయనవసరం లేదు. మాప్ నీటిలో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి ఇంటి మొత్తం తుడవండి. దీనివల్ల రోజంతా మీ ఇంట్లో ఒకరకమైన మంచి వాసన వస్తుంది. కావాలనుకుంటే మీరు నిమ్మకాయ, లావెండర్, రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఇవి మానసికంగా ఎంతో రిలాక్స్ గా, ఫ్రెష్ గా ఫీలయ్యేలా చేస్తాయి.