అందంలో ప్రపంచాన్ని ఏలిన మన అమ్మాయిలు

First Published | Aug 14, 2024, 6:16 PM IST

భారత దేశంలో ప్రపంచం మెచ్చే అందాల భామలున్నారని పలువురు యువతులు ఇప్పటికే నిరూపించారు. చాలా సార్లు  ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొని కిరీటాలు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు ఆరుగురు భామలు తమ అందంతో మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకున్నారు. వారెవరో తెలుసుకుందామా..
 

మానుషి చిల్లర్

మానుషి చిల్లర్ హర్యానాకు చెందిన అందాల భామ. అప్పటికి పదిహేడేళ్ల క్రితం మిస్ వరల్డ్ మన దేశానికి వచ్చింది. అన్నేళ్ల నిరీక్షణ  తర్వాత 2017లో మానుషి చిల్లర్ దేశం గర్వపడేలా చేసింది. మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకొని ప్రపంచానికి మరోసారి అందంలో ఇండియా టాప్ అని నిరూపించింది.  

ప్రియాంక

2000 సంవత్సరంలో ప్రియాంక మిస్ వరల్డ్‌గా నిలిచింది. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఈ భామ మోడలింగ్ చేస్తూ అందాల పోటీల్లో పాల్గొంది. మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకోక ముందే ప్రియాంక మిస్ ఇండియా టైటిల్ కూడా దక్కించుకుంది. తరువాత సినిమా రంగంలోకి వచ్చి హీరోయిన్ గా అనేక మూవీస్ చేస్తోంది. 


యుక్తా ముఖి

ప్రపంచ సుందరి టైటిల్ గెలుచుకున్న నాలుగో అందాల భామ ఈ యుక్తా ముఖి. ఈమె 1999లో మిస్ వరల్డ్ గా ఎంపికైంది. బెంగలూరు ఆమె సొంత ఊరు. మోడల్ గా, నటిగా మంచి పేరు తెచ్చుకుంది.  

ఐశ్వర్య రాయ్

ఐశ్వర్య రాయ్.. యువతకు పరిచయం చేయనక్కరలేని పేరు. 1994లో ప్రపంచ సుందరిగా కిరీటం గెలుచుకున్నాక ఆమె జీవితం అనూహ్యంగా మారిపోయింది. మంగుళూరుకు చెందిన ఈ అందాల భామ సినిమాల్లోకి వచ్చి హీరోయిన్ గా రాణించి స్టార్ హీరోయిన్ అయ్యింది. చాలా ప్రేమ వ్యవహారాల తర్వాత ఎట్టకేలకు అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. 

డయానా హేడెన్

ఆమె 1997లో ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది డయానా హేడెన్. నటిగా, టెలివిజన్ హోస్ట్ గా, మోడల్ గా రాణించిన ఆమె ప్రపంచ సుందరి టైటిల్ గెలుచున్న మూడో భారతీయ మహిళ. ఆమె హైదరాబాదీ వాసి కావడం విశేషం. ఫెమినా మిస్ ఇండియా, మిస్ వరల్డ్ ఆసియా తదితర అందాల పోటీల్లోనూ డయానా ప్రతిభ చూపింది. 

రీటా ఫారియా

ముంబైకి చెందిన రీటా ఫారియా 1966లో మిస్ వరల్డ్ గా ఎంపికైంది. ప్రపంచ అందాల పోటీల్లో గెలుపొంది ఇండియా పేరు మొదటి సారి ప్రపంచానికి తెలిసేలా రీటా చేసింది. మిస్ బాంబే, ఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా లాంటి పోటీల్లోనూ రీటా తన అందాలతో విజేతగా నిలిచింది. ఆమె మోడల్ గానే కాకుండా వైద్యురాలిగానూ ప్రజలకు సేవలందించింది. 

Latest Videos

click me!