Men's Stamina: పురుషుల్లో ఆ స్టామినా పెరగాలంటే ఈ ఐదింటిని తప్పక తీసుకోవాల్సిందే..

First Published | Apr 19, 2022, 2:52 PM IST


Men's Stamina: పెళ్లి కాని వారితో పోల్చితే.. పెళ్లైన పురుషులు శరీరకంగా కొంచెం బలహీనంగా ఉంటారు. దీనికి కారణం.. బిజీ లైఫ్, చెడు జీవన విధానం కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. అయితే వీరిలో స్టామినా పెరిగిందేకు కొన్ని ఆహారాలు బాగా ఉపయోగపడతాయి. అవేంటంటే..

Men's Stamina: పెళ్లైన తర్వాత పురుషులకు బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఇంకా పెళ్లి తర్వాత ఫుల్ బిజీ బిజీగా ఉంటారు. కొంతమంది సమయానికి తినరు కూడా. ఇలాంటి వారే శరీరకంగా బలహీనంగా తయారవుతారు. దీంతో వారి వారు ఆనారోగ్యానికి గురవడమే కాదు.. సెక్స్ లైఫ్ పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. మరి వీరు ఎలాంటి ఆహారం తీసుకుంటే స్టామినా పెరుగుతుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి. 
 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలు వీరిని బలంగా తయారుచేస్తాయి. ముఖ్యంగా వీటిలో టెస్టోస్టెరాన్ హార్మోన్. ఈ హార్మోన్ ఎంత ఎక్కువగా ఉంటే పురుషులు అంత బలంగా ఉంటారు. ఒకవేళ ఈ హార్మోన్ తగ్గినట్టైతే వారిలో సెక్స్ పై ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అలాగే  బలహీనంగా తయారవుతారు. నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ హార్మోన్ పురుషుల్లో అనేక సమస్యలను తొలగించడానికి ఎంతో సహాయపడుతుంది. మరి ఈ హార్మోన్ ను పెంచే ఆహారాలేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

Latest Videos


అశ్వగంద.. ఈ అశ్వగంధ ఎన్నో ఏండ్లను నుంచి వాడుతూ వస్తున్న దివ్య ఔషదం. ఇది టెస్టోస్టెరాన్ ను పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం అరటీస్పూన్ అశ్వగంధ పొడిని తీసుకుని పాలలో వేసుకుని ఉదయం, సాయంత్రం వేళల్లో తాగితే చక్కటి ఫలితం వస్తుంది. 

ఎండు ఖర్జూరాలు..  ఎండు ఖర్జూరాలు సెక్స్ లైఫ్ కు బాగా ఉపయోగపడతాయి. వీటిని పాలలో మరిగించి రాత్రిపూట తీసుకోవడం వల్ల లైంగిక కోరికలు పెరుగుతాయి. అలాగే లైంగిక శక్తి కూడా పెరుగుతుంది. ఇందుకోసం పురుషులు ప్రతి రోజూ ఖర్జూరాలను తినొచ్చు. 
 

ఉసిరి కాయలు.. ఉసిరికాయలతో జుట్టు, చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో సహాయపడతాయి. మీ వివాహ జీవితం ఆనందంగా ఉండాలంటే ప్రతిరోజూ వీటిని ఖచ్చితంగా తినాల్సిందే. వీటిని తినడం వల్ల మీ స్టామినా పెరుగుతుంది. ఇందుకోసం ఉసిరి పౌడర్ లో టీ స్పూన్ తేనె ను కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటూ ఉండాలి. 

ఉల్లిపాయ-వెల్లుల్లి.. ఉల్లి, వెల్లుల్లిని పురుషులు తరచుగా తీసుకోవడం వల్ల వారిలో స్టామినా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రతిరోజూ రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తింటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే తెల్ల ఉల్లిపాయను తిన్నా స్టామినా ఇట్టే పెరుగుతుంది. 

click me!