వేసవి అంటేనే మామిడిపండ్ల కాలం.. తియ్యటి, నోరూరించే మామిడితో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు. నిజానికి మామిడి పండ్లను నేరుగా తినడం ఎంతో మంచిది. అయితే వాటితో చేసే వెరైటీలతో చిన్నారులను ఆకట్టుకోవడం.. చిన్నపాటి గెట్ టు గెదర్స్ లో మీ అతిధులను సర్ ఫ్రైజ్ చేయడం బాగుంటుంది.
మామిడిపండ్లతో మ్యాంగో షేక్, జ్యూస్, ఐస్ క్రీం, పుడ్డింగ్, డెజర్ట్స్ ఇలా అనేక రకాలు చేసుకోవచ్చు. మామిడి పండ్లను డీ హైడ్రేషన్ నుంచి కాపాడతాయి. దీంట్లో సెలీనియం, ఇనుములాంటి ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి.
ఇక మ్యాంగో కస్టర్డ్ విషయానికి వస్తే ఇది అరగంటలో తయారైపోతుంది. మామిడిపండ్లు, పాలు, ఫ్రెష్ క్రీమ్, కస్టర్డ్ పౌడర్, కాసింత చక్కెరతో సిద్ధమయ్యే ఈ రెసిపీ కిట్టి పార్టీ, పాట్‌లక్, గేమ్ నైట్ వంటి వాటిల్లో చటుక్కున చేయడానికి వీలవుతుంది.

మ్యాంగో కస్టర్డ్ తయారీకి కావాల్సిన పదార్థాలు300 గ్రాముల మామిడిపండ్లు450 మి.లీ ఫ్రెష్ క్రీమ్3 టేబుల్ స్పూన్ల వెనిల్లా కస్టర్డ్ పౌడర్600 మి.లీ పాలు12 కప్పు చక్కెర
మ్యాంగో కస్టర్డ్ తయారీ విధానం..ముందుగా మామిడి పండ్లను శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత పై పొట్టును తీసేయాలి. మామిడిపండ్లను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొన్ని ముక్కల్ని గార్నిషింగ్ కోసం పక్కనపెట్టుకుని.. మిగతా ముక్కల్ని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక పాన్ తీసుకుని మీడియం మంట పెట్టి అందులో పాలు పోసి మరిగించాలి. పాలు మరిగే సమయంలో మరో చిన్న చిన్నెలో 12 కప్పు పాలతో కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి.
ఇప్పుడు మరుగుతున్న పాలలో ఈ కస్టర్డ్ పొడి కలిపి పాల మిశ్రమాన్ని నెమ్మదిగా వేస్తూ గరిటతో కలుపుతుండాలి. మొత్తం వేయడం అయిపోయాక దీంట్లో చక్కెర వేసి కరిగేవరకు పాలను మరగనిచ్చి మంట తీసేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా తయారు చేసి పెట్టకున్న మామిడిపండ్ల గుజ్జు, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలపాలి. ఇలా ఒక నిమిషం పాటు బాగా కలిపి.. దాన్ని 6-7 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచండి.

కస్టర్డ్ గట్టిపడ్డాక.. దీని మీద ముందుగా తీసి పక్కన పెట్టుకున్న మామిడి పండ్ల ముక్కలతో అలంకరించి సర్వ చేయచ్చు. ఇంకా దీనికి దానిమ్మ గింజలను కూడ చేర్చవచ్చు.