తక్కువ బడ్జెట్ లో , చలికాలంలో వెళ్లాల్సిన బెస్ట్ ప్లేసులు ఇవే..!

First Published | Nov 21, 2024, 2:12 PM IST

డిసెంబర్ లో ఎలాంటి ప్లేసులకు ట్రిప్ కి వెళ్తే బాగుంటుందో చాలా మందికి ఐడియా ఉండదు. అలాంటివారు… ఈ కింది ప్రదేశాలకు వెళ్లొచ్చు. అది కూడా తక్కువ బడ్జెట్ లో చూసేయవచ్చు. మరి, అలాంటి ప్రదేశాలేంటో చూద్దాం…

travel

చలికాలం వచ్చేసింది. ఈ సీజన్ లో ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి చాలా మంది బయపడతారు. కానీ.. ఈ సీజన్ లో ట్రిప్ కి వెళ్లాలని ఆశపడేవారు కూడా చాలా మంది ఉంటారు. కానీ.. డిసెంబర్ లో ఎలాంటి ప్లేసులకు ట్రిప్ కి వెళ్తే బాగుంటుందో చాలా మందికి ఐడియా ఉండదు. అలాంటివారు… ఈ కింది ప్రదేశాలకు వెళ్లొచ్చు. అది కూడా తక్కువ బడ్జెట్ లో చూసేయవచ్చు. మరి, అలాంటి ప్రదేశాలేంటో చూద్దాం…

చలికాలంలో భార్యభర్తలు, లేదంటే కంప్లీట్ ఫ్యామిలీ అయినా సరే.. ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రదేశాలను చూసేయవచ్చు.  ఉత్తరప్రదేశ్ లో చలికాలం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.  అక్కడ గాలులు చల్లగా ఉంటాయి. చుట్టూ పచ్చదనం ఉంటుంది.  పర్టిక్యులర్ గా అక్కడ చూడాల్సిన కొన్ని ప్లేసులు ఉన్నాయి.

1.ఆగ్రా…

ప్రతి ఒక్కరూ చూడాలి అనుకునే ప్రదేశంలో తాజ్ మహల్ ముందు వరసలో ఉంటుంది. తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది. ముఖ్యంగా ప్రేమికులు.. ఈ ప్లేస్ ని చూడటానికి ఇష్టపడతారు. ఫ్యామిలీతో కూడా వెళ్లి చూడొచ్చు. 


2.వారణాసి..

గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి నగరం మత, సాంస్కృతిక కేంద్రంగా ఉంది. ఇక్కడ మీరు గంగా ఆరతి చూడవచ్చు, పడవ ప్రయాణం చేయవచ్చు. స్థానిక మార్కెట్ల చుట్టూ తిరగవచ్చు. సాయంత్రం గంగా ఘాట్‌లో కూర్చొని ఒకరితో ఒకరు సమయం గడపడం చాలా రొమాంటిక్‌గా ఉంటుంది.

3.ప్రయాగ్ ఱాజ్ 

మీరు శీతాకాలంలో అలహాబాద్ సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. జనవరి నెల నుంచి ఇక్కడ మహా కుంభ్ నిర్వహించనున్నారు. అటువంటి పరిస్థితిలో, మీరు ఇక్కడ సందర్శించవచ్చు. మహా కుంభాన్ని కూడా చూడవచ్చు.

లక్నో..

నవాబుల నగరమైన లక్నోలో మీరు మొఘల్ వాస్తుశిల్పాన్ని చూడవచ్చు, రుచికరమైన వంటకాలను రుచి చూడవచ్చు. స్థానిక కళ, సంస్కృతిని ఆస్వాదించవచ్చు. ఇక్కడ మీరు రూమి దర్వాజా, ఇమాంబర, చౌరీ బజార్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

మధుర బృందావన్…

శ్రీకృష్ణుడు జన్మ స్థలం మధురలోని బృందావన్ కూడా మీరు వెళ్లొచ్చు. ఆగ్రా నుంచి ఢిల్లీ వెళ్తున్న దారిలోనే మీకు బృందావన్ కనపడుతుంది. ఇక్కడ రాధాకృష్ణుని దేవాలయం చూడటానికి రెండు కళ్లు సరిపోవు. చాలా అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది.

Latest Videos

click me!