రాఖీ పండుగ నుంచి కృష్ణాష్టమి వరకు.. ఆగస్టులో వచ్చే పండుగ లీస్ట్..

First Published | Aug 7, 2024, 1:46 PM IST

ఆగస్టు నుంచి ఇక పండుగలు షురూ అయినట్టే. రెండు నెలల గ్యాప్ తర్వాత ఈ నెల నుంచే పెళ్లి ముహూర్తాలు కూడా ప్రారంభమయ్యాయి. అసలు ఈ నెలలో వచ్చే పండుగలేంటో ఓ లుక్కేద్దాం పదండి. 
 

పండుగలు మనకు తెచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. పనుల కోసం ఎక్కడెక్కడో ఉంటున్న కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఇంటికి వస్తారు. చాలా మంది ఒక్క పండుగలప్పుడు మాత్రమే ఇంటికి వస్తుంటారు. అందుకే ఎప్పుడెప్పుడు పండుగలు వస్తాయా? అని వేయి కళ్లతో ఎదురుచూసేవారుంటారు. అయితే ఈ ఆగస్టు నెలలో ఎన్నో పండుగలు రాబోతున్నాయి తెలుసా? అవును రాఖీ పండుగ నుంచి నాగుల పంచమి వరకు.. ఈ నెలలో ఎన్నో పండుగలను సెలబ్రేట్ చేసుకోబోతున్నాం.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

రాఖీ పండుగ

అక్కా చెల్లెల్లకు ఎంతో ఇష్టమైన పండుగ రాఖీ. రాఖీ నాడు అక్కలు, చెల్లెల్లు తమ అన్నలకు, తమ్ములకు ప్రేమతో రాఖీ కడతారు. ఈ పండు తోబుట్టువుల మధ్య బంధానికి ప్రతీక. ఈ రోజు అక్కా చెల్లెల్లు తమ సోదరుల మణికట్టుకు పవిత్రమైన రాఖీని కట్టి, తమను రక్షించమని కోరుకుంటారు.

Latest Videos


కృష్ణాష్టమి

కృష్ణ జన్మాష్టమి హిందువులకు ఎంతో పవిత్రమైన పండుగ. ఈ రోజు శ్రీకృష్ణుని జన్మదినాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటుంది. కృష్ణాష్టమి నాడు భక్తులు నిష్టగా ఉపవాసం ఉంటారు. ప్రార్థనలు చేస్తారు. అలాగే  భక్తులు కృష్ణుడి జీవితాన్ని నాటకాలు, పాటల ద్వారా తిలకిస్తారు. 
 


నాగపంచమి

నాగ పంచమి నాడు పాములను దేవతలుగా గౌరవిస్తారు. నాగపంచమి పండుగ ప్రతి ఏడాది  శ్రావణ మాసంలో జరుపుకుంటారు.  నాగపంచమి నాడు ప్రజలు పాము కాటు నుంచి రక్షణ కోరుతూ.. పాము విగ్రహాలను పాలు, పువ్వులలను సమర్పిస్తారు. కొంతమంది పాము పుట్ట దగ్గరికి వెళ్లి కూడా పూజలు నిర్వహిస్తారు. 
 

తీజ్

తీజ్ అనేది శివుని భార్య అయిన పార్వతీ దేవిని గౌరవించే మహిళల పండుగ. ఈ రోజు ఆడవాళ్లు ఉపవాసం ఉంటారు. ఈ పండుగను ప్రార్థనలు, ఉత్సవాలతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తీజ్ పండుగ వర్షాకాలాన్ని సూచిస్తుంది. ఈ పండుగ నాడు మహిళలు చేతులకు ఖచ్చితంగా గోరింటాకును పెట్టు9కుంటారు. అలాగే ఊయల మీద ఊగుతారు. స్పెషల్ వంటకాలను కూడా ఆస్వాదిస్తారు. 
 

sawan shivratri 2024


శ్రావన శివరాత్రి

శ్రావణ శివరాత్రి పండుగ శివునికి అంకితం చేయబడింది. ఇది హిందువుకు ఒక ముఖ్యమైన పండుగ. పవిత్రమైన శ్రావణ మాసంలో ఈ పండుగ వస్తుంది. ఈ రోజు శివ భక్తులు ఉపవాసం ఉంటారు. శివ పూజలు చేస్తారు. అలాగే శివలింగానికి అభిషేకం కూడా చేస్తారు. 

శ్రావన సోమవారం వ్రతం

శ్రావణ సోమవార వ్రతాన్ని చాలా మంది మహిళలు అనుసరిస్తారు. ఈ పండుగ  పరమేశ్వరునికి అంకితం చేయబడింది. ఈ రోజు ఆడవాళ్లు నిష్టగా ఉపవాసం ఉంటారు. పవిత్రమైన శ్రావణ మాసంలోని సోమవారాల్లో భక్తులు ఉపవాసం ఉండి శివుడిని భక్తితో పూజిస్తారు. ముఖ్యంగా కఠినమైన ఉపవాసాలను పాటిస్తారు. పరమేశ్వరుడికి అభిషేకాలు చేస్తారు. 

click me!