లెమన్ వాటర్ కాదు.. లెమన్ కాఫీ.. దీన్ని తాగితే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

First Published | Jul 19, 2024, 12:07 PM IST

బరువు తగ్గాలని పొద్దు పొద్దున్నే వేడి వాటర్ లో నిమ్మరసం పిండుకుని తాగే వారు చాలా మందే ఉన్నారు. లెమన్ వాటర్ బరువును తగ్గిస్తుందనేది నిజమే. కానీ లెమన్ కాఫీ కూడా మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అసలు దీన్ని తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయంటే? 
 

చాలా మంది లెమన్ వాటర్ ను ఉదయాన్నే పరిగడుపున తాగుతుంటారు. ఎందుకంటే ఈ వాటర్ బరువును తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. కడుపును ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మరెన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. కానీ చాలా మంది లెమన్ వాటర్ ను కేవలం బరువు తగ్గడానికి మాత్రమే తాగుతారు. నిజానికి లెమన్ వాటర్ కేలరీలను కరిగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.

coffee

నిమ్మకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో ఉన్న విష పదార్థాలు, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. లెమన్ వాటర్ కాకుండా.. మీరు లెమన్ కాఫీని తాగినా కూడా ఆరోగ్యంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


ఈ లెమన్ కాఫీని రోజూ తాగితే మీ ఆకలి చాలా వరకు నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో మీరు చాలా తక్కువ మొత్తంలో తింటారు. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను కరిగించి మీ బరువును తగ్గిస్తుంది. 

ఒక్క ఎండాకాలంలోనే కాదు వానాకాలం, చలికాలంలో కూడా మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. లేదంటే శరీరం డీహైడ్రేషన్ బారిన పడి ఎన్నో వ్యాధులు వస్తాయి. ఈ వానాకాలంలో మీ బాడీని హైడ్రేట్ గా ఉండాలనుకుంటే రోజూ లెమన్ కాఫీని తాగండి. 
 

లెమన్ కాఫీని ఎలా తయారుచేయాలి? 

కావాల్సిన పదార్థాలు: సగం నిమ్మకాయ, 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, ఒక కప్పు వేడి నీళ్లు.. దీన్ని తయారుచేయడానికి ముందుగా ఒక గ్లాసులో నిమ్మరసం తీసుకుని అందులో కాఫీ పొడి, గోరువెచ్చని నీళ్లు పోసి బాగా కలపండి.
 

Latest Videos

click me!