అమ్మాయిలకే తొందర ఎక్కువ... 15ఏళ్లకే కన్యత్వం కోల్పోయి... షాకింగ్ సర్వే

First Published | Sep 25, 2019, 1:15 PM IST

కన్యత్వానికి విలువిచ్చే ఐదు శాతం మంది మాత్రమే ఆ అనుభవానికి దూరంగా ఉంటున్నారు. కేవలం 6 మంది తాము సెక్స్‌ అనుభవాన్ని పొందకపోవడానికి కారణం తమకు తగిన జోడి దొరకక పోవడమేనని చెప్పారు.

నేటి యువత శృంగారం విషయంలో కాస్త ముందుగానే తొందరపడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. మరీ ముఖ్యంగా అమ్మాయిలు తక్కువ వయసులోనే తమ కన్యత్వాన్ని కోల్పోతున్నారని ఓ సర్వేలో తేలింది. ప్రేమలో ఉన్నవారే తొందరగా వర్జినిటీ కోల్పోతున్నారని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రేమలో పడ్డప్పుడు లైంగికంగా దగ్గరవ్వాలనే కోరిక కలగటం సహజం. కానీ దశాబ్దం క్రితం ఆ కోరికలు ముద్దులు, కౌగిలింతలవరకే పరిమితమయ్యేవి. శారీరకంగా దగ్గరవ్వటానికి పెళ్లి వరకూ ఆగాల్సిందే అన్న అభిప్రాయం నాటి యువతలో ఉండేది.

కానీ నేటి తరం యువతలో అంత సహనం ఉండటం లేదట. ప్రేమ పేరిట సెక్స్ అనుభవాన్ని పొందుతున్నారు. సెక్స్‌ అనుభవం పొందిన టీనేజర్లందరూ అవతలి వ్యక్తితో ప్రేమలో ఉన్నాం కాబట్టే శారీరకంగా దగ్గరయ్యాం అని చెప్పడం విశేషం.
కన్యత్వానికి విలువిచ్చే ఐదు శాతం మంది మాత్రమే ఆ అనుభవానికి దూరంగా ఉంటున్నారు. కేవలం 6 మంది తాము సెక్స్‌ అనుభవాన్ని పొందకపోవడానికి కారణం తమకు తగిన జోడి దొరకక పోవడమేనని చెప్పారు.
కాగా.. డ్యురెక్స్ ఫేస్ ఆఫ్ గ్లోబల్ సెక్స్ నివేదిక ప్రకారం... అమ్మాయిల సరాసరి 18.3ఏళ్ల వయసులో వర్జినిటీ కోల్పోతున్నారట. మలేషియా, సింగపూర్, ఇండియాల్లో అమ్మాయిలు 20ఏళ్ల వయసులో కన్యత్వం కోల్పోతుండగా... యూకే, యూఎస్ లలో 16ఏళ్లకు ఐలాండ్, జర్మనీల్లో 15.5 ఏళ్లకే కన్యత్వాన్ని కోల్పోతున్నట్లు సర్వేలో తేలింది.
మలేషియాలో అమ్మాయిలు 20.2 ఏళ్లకు, భారత్ లో 19ఏళ్లకు కన్యత్వాన్ని కోల్పోతున్నారు. రష్యాలో 18.7ఏళ్లకు వర్జినిటీ కోల్పోతుండగా... గ్రీస్ లో 18.1 వయసులోనే వర్జినిటీ కోల్పోతున్నారు.
ఇక ప్రతి పది శాతం మంది పదో తరగతి విద్యార్థుల్లో ముగ్గురు సెక్స్ అనుభవాన్ని పొందుతున్నారట. వీళ్లలో 46 శాతం మంది స్కూలు, కాలేజీ ప్రాంగణంలో కండోమ్‌ ప్యాక్స్‌ చూసినట్టు చెప్పారు. 25 శాతం మంది తమ తోటి విద్యార్థులు గర్భం దాల్చినట్టు చెప్పారు. 2008లో ఇలాంటి సర్వే చేపట్టినప్పుడు ఈ నిష్పత్తి 10:1 ఉంటే 2016కి 10:3 స్థాయికి పెరిగింది.

Latest Videos

click me!