పాన్‌కేక్‌ల రుచిని పెంచడం కోసమే కాకుండా.. వాటి పోషక విలువలను కూడా పెంచడానికి కొన్ని పదార్థాలను కలపాలి. వీటిని రుచికరంగా తినడానికి పాన్ కేకులకు తేనె లేదా మాపుల్ సిరప్‌ని ఎంచుకోవచ్చు. చాలా మంది వీటిని పండ్లతో తినడానికి కూడా ఇష్టపడతారు. దీనికోసం అరటిపండ్లు, స్ట్రాబెర్రీలు, యాపిల్స్, బ్లూబెర్రీస్, మామిడి పండ్లనుపాన్‌కేక్‌ల మీద టాప్-ఆఫ్ చేయచ్చు. లేదా బాదం, వాల్‌నట్‌లు, గుమ్మడికాయ గింజలు, పుచ్చకాయ గింజలను అలంకరించడం ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వులను జోడించొచ్చు.