రోజూ పాలు పొంగిపోతున్నాయా? ఈ టిప్స్ తో ఒక్క చుక్కా కిందపడదు.. ట్రై చేయండి..

First Published | Jun 3, 2021, 3:55 PM IST

ఉదయాన్నే పాలు కాగబెట్టడం నిజంగా ఓ పెద్ద టాస్క్.. స్టౌదగ్గర ఉన్నంతసేపు ఎలాంటి చలనం లేకుండా ఉండే పాలు..అలా ఒక్కనిమిషం పక్కకు తిరగగానే పొంగిపోతాయి. 

ఉదయాన్నే పాలు కాగబెట్టడం నిజంగా ఓ పెద్ద టాస్క్.. స్టౌదగ్గర ఉన్నంతసేపు ఎలాంటి చలనం లేకుండా ఉండే పాలు..అలా ఒక్కనిమిషం పక్కకు తిరగగానే పొంగిపోతాయి.
రోజూ కాకపోయినా వారానికి రెండు, మూడుసార్లు తప్పనిసరిగా ప్రతీ ఇంట్లోనూ ఈ పొంగుడు కార్యక్రమం మామూలే. అవి పొంగడం, ఆ తరువాత స్టౌ శుభ్రం చేసుకోవడం..ఇదంతా పెద్ద తలనొప్పి.

పాలు కాగబెట్టడానికి ఇంత కథా..అంటారా? అయితే మీ ఇంట్లో మీ ఆవిడనో, మీ అమ్మనే లేదా పెద్దవారిని అడిగిచూడండి విషయం మీకే అర్థమవుతుంది. లేదా ఓ సారి మీరే స్వయంగా పొంగకుండా కాగబెట్టి చూడండి.
మరెలా పాలు ఒక చుక్కకూడా కింద పడకుండా కాగబెట్టడం ఎలా..? అంటే దానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటిని సరిగా ఫాలో అయితే సరి.
కాస్త పెద్ద గిన్నెలో పోసి, స్టౌ సిమ్ లో పెట్టి దాని మానాన దాన్ని వదిలేస్తే.. మెల్లగా ఏ అరగంటకో పొంగకుండా కాగుతాయి. అయితే ఇది ఉదయం ఉండే హడావుడిలో అయ్యే పని కాదు.
పాలు కాగబెట్టే గిన్నెలో ఓ గరిటె పెట్టండి. దీనివల్ల పాలు కాగినప్పుడు అందులోని ఆవిరి బైటికి పోవడానికి దారి ఏర్పడడం వల్ల పొంగకుండా ఉంటాయి.
పాలు కాగబెట్టడానికి బాయిలర్ వాడుతున్నట్టైతే.. అది డబుల్ బాయిలర్ అయి ఉండేలా చూసుకోండి. లేదంటే ఓ పెద్ద పాన్ లో నీళ్లు వేడిచేసి అందులో చిన్నగిన్నెలో పాలు పోసి కాగబెట్టండి. దీనివల్ల పాలు పొంగవు.
పాల గిన్నె అంచులకు నెయ్యి రాయడం వల్ల పొంగకుండా చూడొచ్చు. నెయ్యిలోని గ్రీజ్ లాంటి స్వభావం పాలను పొంగనివ్వదు.
పొంగుకు వచ్చిన పాలమీద నీళ్లు చిలకరిస్తే కూడా పాలు పొంగకుండా ఉంటాయి. ఆవిరితో వచ్చిన పొంగు నీటి బిందువులతో అణిగిపోయి చక్కగా మరుగు పడతాయి.
పాల గిన్నె మీద అడ్డంగా చెక్క స్పూన్ ను ఉంచితే కూడా పాలు పొంగవు. అయితే ఈ స్పూన్ పాలగిన్నె రెండు అంచులను దాటేలా ఉండేలా చూసుకోవాలి.
మైక్రోవేవ్ లో పాలు వేడిచేస్తున్నట్లైతే..ఇది చాలా ఈజీ. ఒక కప్పు లేదా 250 మి.లీ పాలు 45 సెకన్లలో గది ఉష్ణోగ్రతకు వచ్చి 2.5 నిమిషాల్లో మరుగుతాయి. ఇలాగే 500 మి.లీ పాలను వేడి చేయడానికి 5 నిమిషాలు పడుతుంది.
అయితే మైక్రోవేవ్‌లో పాలను వేడి చేయడానికి మైక్రో సేఫ్ పాత్రను ఉపయోగించాలని గుర్తుంచుకోండి.
పాలు అడుగంటకుండా ఉండాలంటే మందపాటి గిన్నెలో పాలు కాగబెట్టాలి. పాలు అందులో పోసేముందు గిన్నెలో కాసిన్ని నీళ్లు పోస్తే అడుగు అంటుకుపోదు. మీగడ కూడా బాగా కడుతుంది.
పాలు అడుగంటకుండా ఉండాలంటే మందపాటి గిన్నెలో పాలు కాగబెట్టాలి. పాలు అందులో పోసేముందు గిన్నెలో కాసిన్ని నీళ్లు పోస్తే అడుగు అంటుకుపోదు. మీగడ కూడా బాగా కడుతుంది.

Latest Videos

click me!