Geyser
చలికాలంలో చల్లనీళ్లతో స్నానం అంటే మామూలు విషయం కాదు. ఏ ఒక్కరు ఇద్దరో తప్ప చాలా మంది ఈ సీజన్ లో వేడినీళ్లతోనే స్నానం చేస్తుంటారు. ఒక్క స్నానానికి మాత్రమే కాదు.. ఇతర పనుల కోసం కూడా వేడి నీళ్లను ఉపయోగించే వారు ఉన్నారు. ఇందుకోసం కొంతమంది హీటర్లను వాడితే.. మరికొంతమంది గీజర్లను వాడుతుంటారు. అయితే గీజర్లతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గీజర్లు పేలుతుంటాయి. దీనివల్ల ఈ మధ్యే ఒక నవ వధువు చనిపోయింది కూడా. అందుకే గీజర్లను సేఫ్ గా ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నిజానికి గీర్లను ఉపయోగించడం పెద్ద విషయం కాదు. ఇదినిమిషాల్లో నీళ్లను వేడి చేసి ఇచ్చేస్తుంది. అందుకే చాలా మంది వీటిని వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. ఎందుకంటే ఇది ప్రమాదకరం కాదని అందరూ అనుకుంటారు. కానీ గీజర్ ను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇది ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే గీజర్ ను ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి
Geyser
గీజర్ ని ఆన్ లో ఉంచొద్దు
చాలా మంది గీజర్ ను ఒక్క సారి ఆన్ చేసారంటే.. అలాగే ఆన్ లోనే ఉంచుతారు. ఇక దాని గురించి మర్చిపోతుంటారు. కానీ గీజర్ ను ఎక్కువ సేపు ఆన్ లో అస్సలు ఉంచకూడదు. ఎందుకంటే దీనివల్ల గీజర్ పేలే ప్రమాదం ఉంది. అలాగే కరెంట్ బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి అవసరానికి ఆన్ చేసి ఆ తర్వాత గీజర్ ను ఆఫ్ చేయడం మర్చిపోకూడదు.
ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి
గీజర్ ను కొనేటప్పుడు అది మంచి స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉందా? లేదా? అనేది ముందే తెలుసుకోవాలి. ఇలాంటి గీజర్లు మార్కెట్ లో చాలా దొరుకుతాయి. అయితే చాలా మంది గీజర్ లో అప్పటికే వేడి నీరు ఉన్నా.. మళ్లీ గీజర్ ను ఆన్ చేసి స్నానం చేస్తుంటారు. కానీ దీనివల్ల కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే గీజర్ ను ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేడి నీళ్లను ఉపయోగించాలి.
సర్టిఫైడ్ కంపెనీ నుంచి మాత్రమే కొనండి
మార్కెట్ లో ఎక్కువ ధర నుంచి తక్కువ ధర వరకు ఎన్నో రకాల గీజర్లు ఉంటాయి. అయితే చాలా మంది తక్కువ ధరకు వచ్చే గీజర్లను మాత్రమే వాడుతుంటారు. కానీ మీరు సేఫ్ గా ఉండాలనుకుంటే మాత్రం సర్టిఫైడ్ కంపెనీ నుంచి గీజర్ ను మాత్రమే కొనండి. వీటివల్ల ప్రమాదం జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.
సర్వీసింగ్ పూర్తి చేయాలి
చలికాలంలో గీజర్లను బాగా ఉపయోగిస్తుంటారు. కాబట్టి మీరు ప్రతిరోజూ గీజర్ ను ఆన్ చేసే ముందు కరెంట్ కనెక్షన్ బాగా ఉందో? లేదో? ఖచ్చితంగా చెక్ చేయండి. అలాగే గీజర్ 45-50 డిగ్రీల మధ్య ఉండేలా చూసుకోవాలి. అది కూడా గీజర్ సర్వీసింగ్ చేయించుకున్న తర్వాత.
సౌడ్స్
కొన్ని కొన్ని సార్లు గీజర్ల నుంచి స్నానం చేస్తుంటే వింత వింత శబ్దాలు వస్తుంటాయి. ఇలాంటి వాటిని అస్సలు లైట్ తీసుకోకూడదంటారు నిపుణులు. ఎందుకంటే గీజర్ లో ఏదైనా సమస్య ఉంటేనే ఇలా వాటి నుంచి సౌండ్స్ వస్తాయి.