Whipped Lemonade : గిలక్కొట్టిన నిమ్మరసం.. ఇప్పుడు కొత్త ఫుడ్ ట్రెండ్...

First Published Aug 26, 2021, 1:01 PM IST

సంప్రదాయ నిమ్మరసం లాగా కాకుండా ఈ విప్డ్ లెమనేడ్.. మిల్క్ డ్రింక్ లాగా ఉంటుంది. దీంట్లో తాజా నిమ్మరసపు రుచి ఆకట్టుకుంటుంది. తీపి, కండెన్సెడ్ పాలు.. అన్నీ కలిసి ఈ లెమనేడ్ ను అద్భుతంగా చేస్తాయి.

డాల్గోనా కాఫీ.. ఫుల్ వైరల్ అయిన కాఫీ వెరైటీ.. అప్పటివరకు మనకు అందుబాటులో ఉన్న కాఫీ రుచికి కొత్త సొగసులు అందింది. మన రుచి మొగ్గలకు డిఫరెంట్ టేస్ట్ తో ఆకట్టుకుంది. కాఫీ రుచికి క్రీమ్ ను జోడించి కొత్త రుచి ఆస్వాదించేలా చేసింది. అందుకే ఎవ్వరి నోట విన్నా డాల్గోనా కాఫీ మాటే వినిపించేది. 

Lemonade

ఇప్పుడు దాని తరువాత అంతటి ట్రెండ్ సృష్టించే మరో ఐటమ్ రెడీ అయ్యింది. అదే విప్డ్ లెమనేడ్.. ఎంచక్కా తెలుగులో చెప్పాలంటే గిలక్కొట్టిన నిమ్మరసం.  ఇంతకీ ఈ విప్డ్ లెమనేడ్ అంటే ఏమిటి...ఎక్కడి నుంచి వచ్చింది. ఇది కొరియన్ జ్యూస్. దీనికి ప్రత్యేకమైన రుచి, వాసన ఉంటాయి. దీనివల్ల ప్రపంచమంతా ఈ విప్డ్ లెమనేడ్ మీద మనసు పారేసుకుంటుంది. 

lemonade

మరి ఈ విప్డ్ లెమనేడ్ ప్రత్యేకత ఏంటీ? అంటే... సంప్రదాయ నిమ్మరసం లాగా కాకుండా ఈ విప్డ్ లెమనేడ్.. మిల్క్ డ్రింక్ లాగా ఉంటుంది. దీంట్లో తాజా నిమ్మరసపు రుచి ఆకట్టుకుంటుంది. తీపి, కండెన్సెడ్ పాలు.. అన్నీ కలిసి ఈ లెమనేడ్ ను అద్భుతంగా చేస్తాయి. కండెన్స్ డ్ మిల్క్, నిమ్మరసంలను బాగా గిలకొట్టి.. ఆ ఫ్టఫ్పీ డ్రింక్ కు పైన పుదీనా, ఐస్ క్యూబ్స్ తో అలంకరించి అందిస్తే.. అంతే ఇక. 

ఇఈ విప్డ్ లెమనేడ్ ప్రస్తుతం యూత్ లో బాగా ట్రెండ్ అవుతోంది. దీని రుచి కోసం పోటీ పడుతున్నారు. ఈ కొరియన్ పానీయానికి సంబంధించిన అనేక వీడియోలు కొరియా నుంచి రిలీజ్ అవుతున్నాయి. దీన్ని కొన్ని ప్రాంతాల్లో  బ్రెజిలియన్ నిమ్మరసం అని కూడా అంటారు. చాలా తక్కువ పదార్థాలతో దీన్ని తయారు చేయవచ్చు. క్షణాల్లో రెడీ అయిపోతుంది. ఇంట్లోనే ఈజీగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో.. తెలుసుకుంటే.. కొత్త రుచితో మీ అతిధుల్ని అదరగొట్టొచ్చు. 

ఈ విప్డ్ లెమనేడ్ ప్రస్తుతం యూత్ లో బాగా ట్రెండ్ అవుతోంది. దీని రుచి కోసం పోటీ పడుతున్నారు. ఈ కొరియన్ పానీయానికి సంబంధించిన అనేక వీడియోలు కొరియా నుంచి రిలీజ్ అవుతున్నాయి. దీన్ని కొన్ని ప్రాంతాల్లో  బ్రెజిలియన్ నిమ్మరసం అని కూడా అంటారు. చాలా తక్కువ పదార్థాలతో దీన్ని తయారు చేయవచ్చు. క్షణాల్లో రెడీ అయిపోతుంది. ఇంట్లోనే ఈజీగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో.. తెలుసుకుంటే.. కొత్త రుచితో మీ అతిధుల్ని అదరగొట్టొచ్చు. 

విప్డ్ లెమనేడ్ ఎలా తయారు చేయాలంటే.. ఒక పెద్ద గ్లాస్ జగ్/పిచ్చర్ తీసుకోండి, ¼ కప్పు నిమ్మరసం, 1/4 కప్పు కండెన్స్ డ్ మిల్క్, 1 టేబుల్ స్పూన్ చక్కెర కలపాలి. దీన్ని బాగా క్రీమ్ లాగా అయ్యేవరకు గొలక్కొట్టాలి. సరిగ్గా నురుగు ఆకృతిలో రావడానికి హ్యాండ్ బ్లెండర్ ఉపయోగించాలి. చక్కగా నురుగలా తయారయ్యాక.. దీనికి ఐస్ చిల్డ్ వాటర్, ఐస్ క్యూబ్స్ ను బ్లెండ్ చేయండి. అంతే మీ విప్డ్ లెమనేడ్ రెడీ. దీనికి కొన్ని తాజా బెర్రీలు, పుదీనా లేదా నిమ్మకాయ ముక్కలతో టాపింగ్ చేస్తే సరిపోతుంది. 

click me!