భూమిపై ఇప్పటివ‌ర‌కు ఒక్క వ‌ర్ష‌పుచుక్క ప‌డ‌ని గ్రామం ఇది !

First Published | Nov 19, 2024, 9:13 PM IST

A village without rains : అనంత విశ్వంలో అనేక మిస్ట‌రీలు ఉన్నాయి. భూమిపై కూడా కొన్ని ఇప్ప‌టికీ అంతుచిక్క‌ని విష‌యాలు ఉన్నాయి. ఇదే త‌ర‌హాలో ఒక్క‌సారి కూడా వ‌ర్షం ప‌డని గ్రామాలు, ప్ర‌దేశాలు ఉన్నాయంటే మీరు న‌మ్ముతారా? 
 

A village without rains mystery village: ప్రపంచంలో తక్కువ వర్షపాతం ఉన్న ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అయితే, అవి చాలా వరకు ఏడారులుగా ఉన్నాయన్న సంగ‌తి తెలిసిందే. భారతదేశంలోని మేఘాలయ వంటి కొన్ని ప్రదేశాలలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. కానీ యెమెన్‌లోని అల్-హుతైబ్ అనే గ్రామం ఇప్పటి వరకు ఒక్క వర్షపు చుక్క కూడా పడని ప్రదేశంగా రికార్డు సృష్టించింది.

కానీ, ఈ గ్రామం దాని అందం, విశిష్టతతో ప్ర‌త్యేక గుర్తింపు పొందింది. ప్ర‌పంచంలోని చాలా ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి ఈ అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని ఆస్వాదిస్తారు. ఇక్కడ ఎప్పుడూ వర్షం ఎందుకు పడదు అనే విష‌యాలు మిమ్మ‌ల్ని నిజంగా ఆశ్చర్యప‌రుస్తాయి. 

భూమిపై ఇప్ప‌టివ‌ర‌కు ఒక్కసారి కూడా వ‌ర్షం ప‌డ‌ని గ్రామం అల్-హుతైబ్

భూమిపై ఇప్ప‌టివ‌ర‌కు ఒక్కసారి కూడా వ‌ర్షం ప‌డ‌ని గ్రామం యెమెన్‌లోని అల్-హుతైబ్. ఈ గ్రామం యెమెన్ రాజధాని సనా నుండి కొంత దూరంలో ఉంది. ఈ గ్రామం దాని అద్భుత‌మైన‌ అందాలతో ప్రసిద్ధి చెందింది.

'అల్-హుతైబ్' గ్రామం పెద్ద‌ కొండ పైభాగంలో ఉంది. ఇక్కడ నుండి కింద‌కు చూస్తే అద్భుత‌మైన దృశ్యాలు చాలా సుందరంగా ఉంటాయి. చలికాలంలో ఇక్కడ చలి చాలా తీవ్రంగా ఉంటుంది. అదే స‌మ‌యంలో వేసవిలో ఇక్కడ నివాసితులు మండే ఎండలను ఎదుర్కోవలసి ఉంటుంది.

Latest Videos


Hutayb, al-Hutaib

అల్-హుతైబ్ గ్రామంలో ఎందుకు వర్షం పడదు? 

అల్-హుతైబ్ గ్రామంలో ఎప్పుడూ వర్షాలు ప‌డ‌వు. దీనికి అస‌లు కార‌ణం ఈ గ్రామం ఉన్న ప్ర‌దేశం ఎత్తు. 'అల్-హుతైబ్' గ్రామం సముద్ర మట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉంది. సాధారణంగా ఈ గ్రామానికి చాలా దిగువన ఉన్న 2,000 మీటర్ల ఎత్తులో మేఘాలు ఏర్పడతాయి. ఈ కారణంగా వర్షపు చుక్కలు ఇక్కడికి చేరుకోలేవు. అందుకే ఈ గ్రామం ఎప్పుడూ పొడి వాతావ‌ర‌ణంతో ఉంటుంది.

Hutayb, al-Hutaib

ప్రపంచంలోని అత్యంత పొడి గ్రామం అల్-హుతైబ్

ఇక్కడ వర్షం పడనప్పటికీ ఇప్పటికీ ఈ గ్రామం పర్యాటకులలో బాగా ప్రాచుర్యం పొందింది. దీని కొండ ప్రదేశం, చారిత్రక నిర్మాణశైలి ఇక్కడికి వచ్చే ప్రజలను మంత్రముగ్ధులను చేస్తాయి. గ్రామంలోని ఇళ్ళు పురాతన, ఆధునిక శైలుల అద్భుతమైన సమ్మేళనం, ఇక్కడి ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. అందుకే ఇక్క‌డికీ ప‌ర్యాట‌కులు భారీగా వస్తుంటారు.

Hutayb, al-Hutaib

యెమెన్ లోని అల్-హుతైబ్ కు ప్ర‌త్యేక గుర్తింపు 

అల్-హుతైబ్ గ్రామంలో నివసించే చాలా మంది ప్రజలు 'అల్-బోహ్రా' లేదా 'అల్-ముక్రమ' కమ్యూనిటీకి చెందినవారు. వారిని యెమెన్ కమ్యూనిటీ అని పిలుస్తారు. ఇక్కడి ప్రత్యేక సంప్రదాయాలు, సంస్కృతి దీనికి ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. వర్షం పడకపోవచ్చు, కానీ ఇక్కడి ప్రజలు ఈ ప్రదేశాన్ని స్వర్గంగా భావించి తమ జీవనశైలిలో ప్రాముఖ్యతనిస్తారు. అందుకే వంద‌ల ఏళ్లుగా ఇక్క‌డ జీవ‌నం సాగిస్తున్నారు.

click me!