ఎండాకాలంలో గుడ్లు తినడం మంచిది కాదా? నిజానిజాలు ఇవే..!

First Published Jun 14, 2024, 10:57 AM IST

గుడ్లు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం. ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, దీనిని తినడం గురించి ప్రజల మదిలో అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఆది, సోమవారాల్లో గుడ్లు తినాలని మీరు విన్నప్పటికీ, వేసవిలో రోజూ తినడం సురక్షితమేనా? అసలు నిజానిజాలేంటో తెలుసుకుందాం.
 

గుడ్లు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. అందుకే ఇవి ఆరోగ్యకరమైన ఆహారాలుగా పరిగణించబడతాయి. గుడ్లలో ఉండే ప్రోటీన్, క్యాల్షియం మన శరీరానికి తగిన మొత్తంలో పోషణను అందిస్తాయి. గుడ్లను తింటే మన ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే కండరాలను బలంగా ఉంచుతాయి. అయితే ఎండాకాలం వచ్చిందంటే చాలు  చాలా మంది గుడ్లను తినకూడదని చెప్తుంటారు. ఈ సీజన్ మొత్తం గుడ్లకు దూరంగా ఉండేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే గుడ్లు శరీరంలో వేడిని పెంచుతాయి. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ఎండాకాలంలో గుడ్లను తినకూడదని చాలా మంది నమ్ముతారు. మరి దీనిలో నిజమెంతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గుడ్లు తినేటప్పుడు గుర్తుంచుకోవాల్సి విషయాలు

ఎండాకాలమైనా, చలికాలమైనా, వానాకాలమైనా.. మీరు ఎలాంటి ఆహారాలను తిన్నా లిమిట్ లోనే తినాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే అతి మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. అవసరానికి మించి తింటే ఒక్క ఎండకాలంలోనే కాదు అన్ని కాలాల్లో ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ సూత్రం గుడ్లకు కూడా వర్తిస్తుంది. 

Egg

ఎండాకాలంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఉడకబెట్టిన గుడ్డును తినండి. ఎందుకంటే గుడ్డులో ఉండే ప్రోటీన్లు, ఇతర పోషకాలు రోజుకు అవసరమైన శక్తిని మీకు అందిస్తాయి. అలాగే ఆహారం బాగా జీర్ణం అవుతుంది కూడా.

గుడ్లలో ఇనుము, విటమిన్లు, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఫోలేట్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వు పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి గుడ్లను తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఇది బరువు తగ్గాలనుకునేవారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

గుడ్లు మెదడును, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి. అలాగే ఇవి అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. అలాగే మన  ఎముకలను, దంతాలను బలోపేతం చేయడానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు గుడ్లలో ఉంటాయి. 

గుడ్డు లోపలుండే పచ్చ సొనలో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది గుడ్డులో అత్యంత పోషక దట్టమైన భాగం. అయితే ఇది గుండె జబ్బులకు దారితీస్తుందని చాలా మంది తినకుండా పాడేస్తుంటారు. కానీ నిజమేంటంటే గుడ్డు పచ్చసొనను ఆహార కొలెస్ట్రాల్ గా తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి గుండె సమస్యలు రావు. కానీ  మీ శరీరంలో ఇప్పటికే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మాత్రం మీరు పచ్చసొనను తినకపోవడమే మంచిది. 
 

ఎండాకాలంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో రెండు కంటే ఎక్కువ గుడ్లును  తినకూడదు. లిమిట్ లో తినడం వల్ల మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే శరీరానికి అన్ని రూపాల్లో పోషణ అందుతుంది. గుడ్డు స్వభావం ఖచ్చితంగా వేడిగా ఉంటుంది. కానీ ఇది పోషకాల గని కాబట్టి దాని ప్రయోజనాలు మీ శరీరానికి పూర్తిగా లభించే విధంగా తినాలి.

Latest Videos

click me!