రోజూ తలస్నానం చేస్తే జుట్టు ఊడిపోతుంది.. దీనిలో నిజమెంత..?

First Published | Jul 13, 2024, 3:08 PM IST

వారానికి రెండు సార్లు మాత్రమే తలస్నానం చేయాలని ఇంట్లో పెద్దలు చెప్పిన మాట గుర్తుండే ఉంటుంది. అసలు ఇలా ఎందుకు చెప్తారు? రోజూ స్నానం చేస్తే జుట్టు ఊడిపోతుంది? అన్న మాటలో నిజమెంతో ఇప్పుడు తెలుసకుందాం పదండి. 

ప్రతి ఒక్కరికీ జుట్టు ఊడిపోతుంది. అది అమ్మాయిలకైనా కావొచ్చు. అబ్బాయిలకైనా కావొచ్చు. సాధారణంగా ప్రతి ఒక్కరికీ రోజుకు 50 వెంట్రుకలు ఊడిపోతాయి. దీనివల్ల టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఇంతకు మంచి ఊడిపోతేనే ప్రాబ్లం. ఎందుకంటే ఇది హెయిర్ ఫాల్ సమస్య కావొచ్చు. జుట్టు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే జుట్టుకు సంబంధించి ఎన్నో సమస్యలు వస్తాయి. వీటిలో జుట్టు రాలడం, జిడ్డు జుట్టు, చుండ్రు, వెంట్రుకలు తెగిపోవడంతో పాటుగా నెత్తికి సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నాయి. అయితే ఈ సమస్యలను తగ్గించుకోవడానికి చాలా మంది ప్రతిరోజూ తలస్నానం చేస్తుంటారు. 
 

కానీ పెద్దలు మాత్రం ప్రతిరోజూ తలస్నానం చేయకూడదని చెప్తుంటారు. వారానికి రెండు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుందని అంటుంటారు. అసలు రోజూ తలస్నానం చేయడం మంచిదా? చెడ్డదా? దీనివల్ల జుట్టుకు ఏవైనా సమస్యలు వస్తాయా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


రోజూ తలస్నానం చేస్తే జుట్టు రాలుతుందా? 

వేసవి కాలంలో తలస్నానం రోజూ చేయడం మంచిది. ఎందుకంటే ఇది జుట్టు మీదుండే జుట్టును తొలగిస్తుంది. ఈ జిడ్డు జుట్టు రాలేలా చేస్తుంది. కానీ ప్రతిరోజూ షాంపూ పెట్టుకుని తలస్నానం చేయడం మంచిదికాదు. మీరు గనుక జుట్టు రాలే సమస్య నుంచి బయటపడాలంటే మాత్రం రోజూ తలస్నానం చేయడం మానుకోండి. ఎందుకంటే రోజూ తలస్నానం చేయడం వల్ల నెత్తిమీద ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల మీ నెత్తిమీద చాలా పొడిగా, నిర్జీవంగా మారుతుంది.

వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేయాలి?

జుట్టు పొడవు, మందాన్ని బట్టి తలస్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు.. కర్లీ హెయిర్ ఉన్న వారు వారానికి ఒకసారి లేదా  3 నుంచి 4 రోజులకు ఒకసారి తల స్నానం చేయొచ్చు. జిడ్డుగల జుట్టు ఉన్న వారు వారానికి 2 లేదా 3 సార్లు స్నానం చేయొచ్చు. సన్నని, పొట్టి జుట్టు ఉన్నవారు జుట్టు మురికిగా ఉన్నప్పుడు మాత్రమే తల స్నానం చేయాలి.
 

Hair wash

తలస్నానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

1. తలస్నానం చేసేటప్పుడు మీ జుట్టు రకాన్ని తెలుసుకోండి. 

2. ఎక్కువ కెమికల్స్ లేని షాంపూను వాడండి. 

3. మీకు ఏదైనా జుట్టు సమస్య ఉంటే డాక్టర్ సూచించిన షాంపూను మాత్రమే ఉపయోగించండి.

4. షాంపూను ముందుగా జుట్టుకు పెట్టకూడదు. స్నానం చేసేటప్పుడు మాత్రమే పెట్టాలి. ఇది జుట్టును తేమగా ఉంచుతుంది.

5. షాంపూ చేసిన తర్వాత కండీషనర్ ను ఖచ్చితంగా వాడండి. ఎందుకంటే కండీషనర్ జుట్టు పగిలిపోవడాన్ని నివారిస్తుంది.

hair wash

6. షాంపూను ఎక్కువగా పెట్టడం కూడా మంచిది కాదు. షాంపూ ఎక్కువ పెడితే జుట్టు క్లీన్ అవుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ దీనిలో నిజం లేదు. కొద్దిగా షాంపూను పెట్టి జుట్టును క్లీన్ చేయండి. అది సరిపోకపోతే మళ్లీ కొంచెం తీసుకోండి. తక్కువ షాంపూ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. 

bath

7. తలస్నానం చేయడానికి వేడి నీటిని ఉపయోగించకండి. దీనివల్ల మీ జుట్టు , నెత్తిమీద పొడిబారుతుంది. ఇది హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది. 

Latest Videos

click me!