పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొనొచ్చా? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..

First Published | Apr 4, 2022, 3:34 PM IST

పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొనడం లేదా వద్దనుకోవడం పూర్తిగా ఆ భార్యా భర్తల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఆ సమయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలను తప్పక తీసుకోవాల్సిందే.. అదేంటంటే.. 

సెక్స్ విషయంలో కొందరికి చాలా అపోహలు , డౌట్లు ఉంటాయి. అంటే దీన్ని ఇలాగే చేయాలి. ఆ సమయంలో ఇలాగే ఉండాలి.. ఇంత సమయమే చేయాలంటూ ఎన్నో ఎన్నెన్నో విషయాల్లో అపోహపడిపోతూ ఉంటారు. వాస్తవానికి సెక్స్ విషయంలో అలాంటి అనుమానాలేమీ పెట్టుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. 

ఇక సెక్స్ విషయంలో మరో ముఖ్యమై అపోహ ఏమిటంటే.. పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొనకూడదా అని చాలా మందికి డౌట్లు వస్తుంటాయి. ఈ సమయంలో సెక్స్ లో పాల్గొనకూడదని అనుకుంటారు. నిజానికి నెలసరి సమయంలో కూడా సెక్స్ లో పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో సెక్స్ లో పాల్గొంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటంటే.. 
 


వాస్తవానికి పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొనాలా? వద్దా అనేది ఆ భార్యా భర్తలపై ఆధారపడి ఉంటుంది. ఆ ఇద్దరికే ఓకే అయితే ఆనందంగా సెక్స్ ను ఎంజాయ్ చేయొచ్చంటున్నారు నిపుణులు. కానీ కొన్ని నిబందనలను మాత్రం తప్పకపాటించాల్సిందే. అదేంటంటే.. 
 

వ్యక్తిగల పరిశుభ్రత.. పీరియడ్స్ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యం. అలాంటిది ఈ సమయంలో శృంగారంలో పాల్గొంటే మరింత శుభ్రంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ టైంలో మీరు సెక్స్ లో పాల్గొనాలనుకుంటే ఖచ్చితంగా పరిశుభ్రంగాఉండాలి. లేదంటే సెక్స్ ను ఎంజాయ్ చేయలేరు. 

ఆమెను అర్థం చేసుకోండి.. ఇద్దరికీ ఓకే కదా అని సెక్స్ లో రెచ్చిపోకండి. ఆ సమయంలో ఆడవారి పరిస్థితి అంతగా ఏం బాగోదు. కాబట్టి ఆమెను అడిగి కన్ఫామ్ చేసుకోండి. ఆమెకు ఓకే అయితేనే మీరు ముందడుగు వేయండి. లేదంటే ఆమెను ఇబ్బంది పెట్టకండి. 
 

సమయం కూడా ముఖ్యమే.. పీరియడ్స్ టైంలో ఆడవారి మూడ్ ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటుంది. అంటే ఉదయం, సాయంత్రం వేళల్లో వారి మూడ్ లో ఛేంజెస్ రావొచ్చు. కాబట్టి సెక్స్ పై ఆమెకు ఏసమయంలో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకుని ఆ సమయంలోనే శృంగారంలో పాల్గొనండి అంటున్నారు నిపుణులు. 
 

ఎక్స్ పెరిమెంట్స్ వద్దే వద్దు.. నెలసరి సమయంలో సెక్స్ లో పాల్గొనొచ్చు.. కానీ ఎక్స్ పెరిమెంట్స్ జోలికి అస్సలు వెళ్లకూడదంటున్నారు నిపుణులు. కొన్ని రకాల భంగిమల వల్ల బ్లీడింగ్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుందట. కాబట్టి మీరు ఎక్స్ పెరిమెంట్స్ జోలికి వెళ్లకండి. 
 

పీరియడ్స్ టైంలో సెక్స్ చేయడం వల్ల లాభాలు ఇవే..  

నెలసరి సమయంలో ఆడవారు శారీరకంగానే కాదు మానసికంగా కూడా అలజడికి లోనవుతుంటారు. అలాంటి సమయంలో సెక్స్ లో పాల్గొంటే వీరి మనసు రిలాక్స్ అవుతుందట. 
 

పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొనడం వల్ల ఆక్సిటోసిన్ , ఎండోమార్మిన్ అనే హార్మోన్లు రిలీజ్ అవుతాయట. దీనివల్ల నెలసరిలో వచ్చే నొప్పులు, తిమ్మర్లు, అధిక బ్లీడింగ్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట. 

వాస్తవానికి పీరియడ్స్ టైంలోనే ఆడవారు సెక్స్ లో పాల్గొనాలి అనుకుంటారట. ఎందుకంటే.. ఆ సమయంలో వారిలో కొన్ని హార్మోన్లు రిలీజ్ అవ్వడం వల్ల దాన్ని వాళ్లు ఇష్టపడతారట. కానీ అందరి మహిళల ఆలోచనలు ఒకేలా ఉండవని మీరు గుర్తించుకోవాలి. 
 

Latest Videos

click me!