మిగిలిపోయిన ఆహారం తినడం మంచిదేనా? ఆయుర్వేదం ఏం చెబుతుంది?

First Published | Oct 8, 2021, 2:41 PM IST

మిగిలిపోయిన ఆహారం, తాజాగా వండిన ఆహారం లాగా పోషకాలు ఉండవు అనే విషయాన్ని ఆయుర్వేదం ఖండించలేదు. కానీ, ఆయుర్వేదం ప్రకారం, తాజాగా వండిన ఆహారాన్ని వంట చేసిన 3 గంటలలోపు తీసుకోవాలి

వండిన ఆహారం మిగిలిపోతే ఏం చేస్తారు? పని వాళ్లకు ఇస్తాం. లేదంటే ప్రిజ్ లో పెట్టుకుని తెల్లవారి తింటాం. అయితే ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని తినడం సురక్షితమేనా? చాలా యేళ్లుగా ఇది చర్చనీయాంశంగా ఉన్న విషయం. దీనిమీద రకరకాల వాదనలు వినిపిస్తాయి. సైన్స్ ప్రకారం ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద మళ్లీ వేడి చేయడం వల్ల ఆహారంలోని బ్యాక్టీరియా, వ్యాధికారక క్రిములు చనిపోతాయి అని ఒక వాదన. 

వండిన ఆహారం మిగిలిపోతే ఏం చేస్తారు? పని వాళ్లకు ఇస్తాం. లేదంటే ప్రిజ్ లో పెట్టుకుని తెల్లవారి తింటాం. అయితే ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని తినడం సురక్షితమేనా? చాలా యేళ్లుగా ఇది చర్చనీయాంశంగా ఉన్న విషయం. దీనిమీద రకరకాల వాదనలు వినిపిస్తాయి. సైన్స్ ప్రకారం ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద మళ్లీ వేడి చేయడం వల్ల ఆహారంలోని బ్యాక్టీరియా, వ్యాధికారక క్రిములు చనిపోతాయి అని ఒక వాదన. 

Latest Videos


మరో వాదన ప్రకారం మిగిలిపోయిన ఆహారాన్ని తినడం ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తుందని ఆయుర్వేదం నమ్ముతుంది. దీనిమీద ఆయుర్వేదంలో ఎంతో బాగా వర్ణించారు. 

మిగిలిపోయిన ఆహారం, తాజాగా వండిన ఆహారం లాగా పోషకాలు ఉండవు అనే విషయాన్ని ఆయుర్వేదం ఖండించలేదు. కానీ, ఆయుర్వేదం ప్రకారం, తాజాగా వండిన ఆహారాన్ని వంట చేసిన 3 గంటలలోపు తీసుకోవాలి. అలా కాకుండా వండిన ఆహారాన్ని లేటుగా తినడం మామూలు విషయమే అయితే.. 24 గంటల కంటే ఎక్కువ నిల్వ ఉంచిన ఆహారాన్ని తినొద్దని ఆయుర్వేదం చెబుతోంది. ఒకవేళ అలా తింటున్నట్లైతే దాంట్లో బ్యాక్టీరియా అభివృద్ధి చెందకుండా ఉండటానికి ఆహారాన్ని నిల్వ చేయడానికి, మళ్లీ వేడి చేయడానికి సరైన మార్గాలను ఎంచుకోవాలని చెబుతోంది.

మిగిలిపోయిన ఆహారాన్ని తినడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. అయితే తాజాగా వండిన ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేసి, తినేముందు వేడి చేసుకుని తినడం వల్ల వ్యాధికారకాలు, బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయని కూడా చెబుతున్నారు. వాస్తవానికి, మాంసాహారం, సీఫుడ్ విషయంలో, బ్యాక్టీరియా, వ్యాధికారక కారకాలు సమయం గడిచిన కొద్ది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి. వాటిని సరిగ్గా వేడి చేసి, నిల్వ ఉండేలా చూసుకోవాలి. 

అయితే, వండిన పదార్థాలను రిఫ్రిజిరేటర్ లో పెట్టి తరువాత.. ఆహారాన్ని తినేముందు వేడి చేయడం వల్ల  పోషక విలువలు క్షీణిస్తాయని చెబుతున్నారు. అందుకే, 24 గంటల పాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకోకూడదని సూచించబడింది.

ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల దాంట్లోని విటమిన్లు, అవసరమైన పోషకాలు నాశనం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందుకే తాజాగా వండిన ఆహారాన్ని తినడం వల్ల శరీరానికి మంచి పోషణ లభిస్తుందని, జఠరాగ్నిని వృద్ధి చెందుతుందని చెబుతున్నారు. అంతేకాదు, సరిగా నిల్వ చేయకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. 

click me!